»   »  'మగధీర' రూటులోనే 'మాయాబజార్'

'మగధీర' రూటులోనే 'మాయాబజార్'

Posted By:
Subscribe to Filmibeat Telugu

రామ్ చరణ్ తేజ, రాజమౌళి కాంబినేషన్ లో వచ్చిన మగధీర చిత్రాన్ని బ్లూ రే డిస్క్ ఫార్మెట్ లో డీవిడి లు రిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడదే పంధాని అనుసరిస్తూ 'మాయాబజార్' బ్లూ-రే డిస్క్ లు విడుదల చేస్తున్నారు. 'మగధీర' చిత్రాన్ని బ్లూ-రే డిస్క్ ఫార్మెట్ లో గీతా ఆర్ట్స్, బాలాజీ ఫిలిమ్స్ తో సంయుక్తంగా మార్చిలో విడుదల చేస్తున్నారు. ఇక విజయవారి 'మాయాబజార్'కు రీసెంట్ గా రంగులు అద్ది సినిమా స్కోప్, డిటిఎస్ కలిపి హిట్టు కొట్టిన సంగతి తెలిసిందే. ఈ చిత్ర విజయం స్పూర్తితో గోల్డ్ స్టోన్ సంస్థ మరిన్ని విజయా బ్యానర్ వారి 13 చిత్రాల రైట్స్ ను కూడా తీసుకుంది. మరో ప్రక్క కలర్ 'మాయాబజార్'ను బ్లూ-రే డిస్క్ గా విడుదల చేసేందుకు గోల్డ్ స్టోన్ సిఇవో జగన్మోహన్ ప్లాన్ చేస్తున్నారు. నిజానికి తెలుగులో తొలి కలర్ చిత్రం క్రెడిట్ ను దక్కించుకున్న ఈ చిత్రాన్ని బ్లూ-రే డిస్క్ రూపంలో విడుదల చేసి ఈ ఫార్మెట్ లో విడుదల చేసిన తొలి చిత్రం క్రిడిట్ కూడా దక్కించుకోవాలని గోల్డ్ స్టోన్ ఆలోచన అని చెప్తున్నారు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu