»   » అక్రమ సంభంధమే మీరాచోప్రా ని ముంచింది

అక్రమ సంభంధమే మీరాచోప్రా ని ముంచింది

Posted By:
Subscribe to Filmibeat Telugu

పవన్ కళ్యాణ్ బంగారం చిత్రంలో హీరోయిన్ గా చేసిన మీరా చోప్రా పై అరెస్ట్ వారెంట్ ఇష్యూ అయింది.ఐపీసీ సెక్షన్ 120బి (నేరపూరిత కుట్ర) క్రింద కేసు బుక్ చేసి డిల్లీ పోలీసులు ఆమె గురించి వెతుకుతున్నారు.డిల్లీలో అనుమానస్పదంగా మరణించిన రుచి భట్టాన్ డైరీలో వివరాలను బట్టి ఈ కేసును రిజిస్టర్ చేసారు. తన భర్త సుమిత్ కీ నటి మీరా చోప్రాకి అక్రమ సంభంధం ఉండేదని,ఎప్పుడూ తనను ఆమెతో పోల్చి మాట్లాడేవాడని,అది తను తట్టుకోలేకపోయిందంటూ రుచి డైరీలో రాసింది.

దాంతో పోలీసులు ఈ యాంగిల్ లో కేసుని పరిశోధించటానకి ఆమె కోసం వెతుకుతున్నారు. గుర్గావ్‌కు చెందిన రుచి భట్టాన్ అనే మహిళ జూన్ 28వ తేదీన అనుమానాస్పదస్థితిలో మరణించింది. రుచి ఫ్యానుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుందని ఆమె అత్తమామలు చెబుతుండగా... భర్తే చంపేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నాడని పుట్టింటివారు ఆరోపిస్తున్నారు. ఇక మీరా చోప్రా తెలుగులో పెద్దగా క్లిక్ కాలేదు. ఆమె నటించిన వాన, బంగారం, మారో,జగన్మోహిని చిత్రాలు భాక్సాఫీస్ వద్ద ఫెయిల్యూర్ అయ్యాయి.

English summary
An FIR was registered against actress Meera Chopra in a case related to murder of a Delhi housewife. Sumit has an extra marital relationship with Meera Chopra.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu