Don't Miss!
- News
ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో హైకోర్టు సంచలన తీర్పు..!!
- Finance
Telangana Budget: కీలక రంగాలకు కేటాయింపులు ఇలా.. జర్నలిస్టుల సంక్షేమానికి కూడా..
- Sports
INDvsAUS : స్పిన్ పిచ్‌లతో భారత్‌కూ సమస్యే?.. రికార్డులు చూస్తే తెలిసిపోతోంది!
- Travel
ప్రపంచ స్థాయి పర్యాటక గ్రామం.. పోచంపల్లి విశేషాలు!
- Technology
బెట్టింగులు, లోన్లు అంటూ ప్రజలను వేధిస్తున్న 230 యాప్ లు బ్యాన్!
- Lifestyle
Chanakya Niti: చాణక్య నీతి ప్రకారం ఈ పనులు చేసిన తర్వాత తప్పనిసరిగా స్నానం చేయాలి
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
ఆ అప్పులను చూస్తేనే భయం వేసేది.. వాడు మేనేజ్ చేస్తాడనుకొని దెబ్బతిన్నా: నాగబాబు
మెగా బ్రదర్ నాగబాబు ఇప్పుడంటే హ్యాపీగా కనిపిస్తూ ఇంటర్వ్యూలు ఇస్తున్నారు గాని ఒకప్పుడు ఆయన కూడా ఎవరు ఊహించని విధంగా కష్టాలు ఎదుర్కొన్న వారే. అన్నయ్య మెగాస్టార్ తమ్ముడు పవర్ స్టార్ ఉన్నా కూడా నాగబాబు ఆర్థికంగా చాలా దెబ్బతిన్న సందర్భాలు చాలానే ఉన్నాయి. అయితే ఇటీవల యూ ట్యూబ్ ఛానెల్ లో నాగబాబు తన ఆర్థిక కష్టాల గురించి అలాగే డబ్బు విలువ గురించి చాలానే చెప్పారు.

ఆ సినిమా ఎఫెక్ట్..
నాగబాబు మెగాస్టార్ తమ్ముడిగా హీరోగా ఎంట్రీ ఇచ్చినప్పటికీ క్లిక్కవ్వలేదు. ఆ తరువాత నిర్మాతగా మారి చాలా నష్టపోయారు. వెనక్కి తిరిగి చూస్తే అప్పులు..ముఖ్యంగా ఆరెంజ్ లాంటి సినిమా చూసిన తరువాత నాగబాబు పరిస్థితి కష్టాల్లో కురుకుపోగా సోదరులు చిరంజీవి, పవన్ కళ్యాణ్ ఆర్దికంగా నిలదొక్కుకునేలా చేశారు.

మంచి మార్కెట్ సెట్ చేసుకోవడంతో..
అనంతరం నాగబాబు జబర్దస్త్ వంటి షోలు చేయడమే కాకుండా సీరియల్స్ ద్వారా అలాగే క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా మంచి క్రేజ్ అందుకున్నారు. ఇక అదృష్టవశాత్తూ తనయుడు వరుణ్ తేజ్ హీరోగా మంచి స్థాయికి ఎదిగాడు. మంచి మార్కెట్ సెట్ చేసుకోవడంతో నాగబాబు ఒక ఉన్నత స్థాయికి చేరుకుంది.

అప్పులను చూస్తే భయం వేసేది
అయితే ఇటీవల ఆ విషయాల గురించి ఒక ప్రోమోలో చెప్పారు. నాగబాబు మాట్లాడుతూ.. అనుబంధాలు ముఖ్యమే. ప్రతీది డబ్బుతో కొనలేము అని అందరూ చెప్పే సోది మాటలే. కానీ డబ్బు సంపాదించడం అనేది గ్రేట్ పని. అదొక ఆర్ట్. నేను ఒక సమయంలో నా అప్పులు ఎంత ఉన్నాయో చూసుకోవడానికే భయం వేసేది.

వాడిని నమ్మి..దెబ్బతిన్నా
మనోడు ఒకడు ఉన్నాడు. అంతా వాడే మ్యానేజ్ చేస్తూ చేసుకుంటాడు అని నమ్మాను. కానీ ఆ తరువాత ఎంత దెబ్బతిన్నానో నాకు మాత్రమే తెలుసు. డబ్బులు సంపాదించుకుండా ఇంట్లోనే కూర్చుంటే పిల్లలు కూడా గౌరవించరు. బాధ్యతలు తీర్చుకోవాలి అంటే ప్రేమలు అభిమానాలు దొరకవు.
Recommended Video

ఈజీగా డబ్బు సంపాదించవచ్చు.
డబ్బును నిజంగా గౌరవించాలి. డబ్బు చెడ్డది అని చెప్పేవాళ్లకు అర్థం కావాల్సిన విషయం ఒకటి ఉంది. డబ్బు ఎప్పుడైనా గొప్పదే. ప్రతి మనిషి కూడా డబ్బును సంపాదించగలడు. చేతులు కాళ్ళు లేని వాడు కూడా ఈజీగా డబ్బు సంపాదించవచ్చు. అది ఎలా అంటే..? అని సస్పెన్స్ తో నాగబాబు వదిలిన ప్రోమో ఎంతగానో ఆలోచింపజేస్తోంది. మరి ఫుల్ వీడియోలో ఎలాంటి విషయాలు చెబుతారో చూడాలి.