Sai DharamTeju యాక్సిడెంట్‌పై చిరంజీవి భావోద్వేగం.. ఆందోళన చెందవద్దు అంటూ..

టాలీవుడ్ హీరో సాయిధరమ్ తేజ్ రోడ్డు ప్రమాదానికి గురయ్యారనే వార్త మెగా అభిమానుల్లో, సినీ వర్గాల్లో తీవ్ర దిగ్బ్రాంతికి గురిచేసింది. ప్రమాదవార్త వినగానే మెగా అభిమానులు, మీడియా, ఆయన కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున హాస్పిటల్ వద్దకు చేరుకొన్నారు. తేజ్ ఆరోగ్యంపై ఆరా తీశారు. తనకు అత్యంత ఇష్టమైన మేనల్లుడు ప్రమాదానికి గురయ్యారనే విషయం తెలియగానే చిరంజీవి, నాగబాబు, పవన్ కల్యాణ్ భావోద్వేగానికి లోనయ్యారు. ఆ వివరాల్లోకి వెళితే..

 Mega Star Chiranjeevi tweet on Sai Dharam Tej accident and Health Update

సాయిధరమ్ తేజ్‌ను మెడికవర్ హాస్పిటల్‌కు తరలించిన తర్వాత పవన్ కల్యాణ్, త్రివిక్రమ్ శ్రీనివాస్, వరుణ్ తేజ్, పంజా వైష్ణవ్ తేజ్ ఇతర కుటుంబ సభ్యులు హుటాహుటిన హాస్పిటల్‌కు చేరుకొన్నారు. పవన్ కల్యాణ్ క్లుప్తంగా మీడియాతో మాట్లాడుతూ.. అపస్మారక స్థితిలో ఉన్నారు. మరో హాస్పిటల్‌కు షిఫ్ట్ చేస్తున్నాం అని చెప్పారు.

మెడికవర్ హాస్పిటల్ నుంచి అపోలో హాస్పిటల్‌కు తరలించిన తర్వాత మెగాస్టార్ చిరంజీవి సతీమణి సురేఖ, ఇతర కుటుంబ సభ్యులు వచ్చి సాయిధరమ్ తేజ్ ఆరోగ్యంపై ఆరా తీశారు.

ఇదిలా ఉండగా, సాయిధరమ్ తేజ్ ఆరోగ్యం గురించి మెగాస్టార్ చిరంజీవి ట్వీట్ చేశారు. కొద్ది గంటల క్రితం సాయిధరమ్ తేజ్ ప్రమాదానికి గురయ్యారు. ఆయనకు మైనర్ గాయాలు అయ్యాయి. సాయిధరమ్ తేజ్ ఆరోగ్యానికి ఎలాంటి ముప్పు లేదని చెప్పడం జరిగింది. ఫ్యాన్స్, సన్నిహితులు ఆందోళన పడాల్సిన అవసరం లేదు. అత్యుత్తమ, మెరుగైన వైద్యుల పర్యవేక్షణలో చికిత్స అందుతున్నది. కొద్ది రోజుల్లోనే కోలుకొని తిరిగి వస్తారు అని చిరంజీవి తెలిపారు

చిరంజీవితోపాటు తెలుగు సినిమా పరిశ్రమకు సంబంధించిన హీరోలు, క్యారెక్టర్ ఆర్టిస్టులు, సాంకేతిక నిపుణులు సాయిధరమ్ తేజ్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. హీరో రామ్ పోతినేని, మంచు మనోజ్, అలీరెజా తదితరుల త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. మెగా కుటుంబానికి చెందిన రాంచరణ్, ఉపాసన, సందీప్ కిషన్, ప్రకాశ్ రాజ్ ఇతర సినీ ప్రముఖులు అపోలో హాస్పిటల్‌కు వెళ్లి సాయిధరమ్ తేజ్ కుటుంబాన్ని పరామర్శించారు.

మంచు మనోజ్ ట్వీట్ చేస్తూ.. నీవు అవుట్ ఆఫ్ డేంజర్. నీవు త్వరగా హాస్పిటల్ నుంచి డిశ్చార్జి అవ్వాలని కోరుకొంటున్నాను అని ట్వీట్ చేశారు.

ఇదిలా ఉండగా, మెగా హీరో సాయిధరమ్ తేజ్ రోడ్డు ప్రమాదానికి గురైన వార్త సినీ వర్గాలను, అభిమానులను, సాధారణ ప్రజలను కాకుండా తీవ్ర దిగ్బ్రాంతికి గురిచేసిన సంగతి తెలిసిందే. గణేష్ చతుర్థి సంబురాల్లో ఉన్న ఫ్యాన్స్ ఈ వార్తతో ఉలిక్కిపడ్డారు. మెగా కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొన్నది. అయితే హైటెక్ సిటీలోని మైండ్ స్పేస్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదానికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్‌ను మాదాపూర్ పోలీసులు విశ్లేషించి.. కేసు నమోదు చేశారు. ప్రస్తుతం సాయిధరమ్ తేజ్ అపోలో హాస్పిటల్‌లో అత్యుత్తమ వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నారు.

సాయిధరమ్ తేజ్ కెరీర్ విషయానికి వస్తే.. ప్రస్తుతం రిపబ్లిక్ అనే చిత్రంలో నటిస్తున్నాను. ఈ చిత్రంలో ప్రభుత్వ ఉన్నతాధికారిగా ఓ విభిన్నమైన పాత్రలో కనిపించబోతున్నారు. ఈ చిత్రంలో అవినీతిపై పోరాటం చేసే అధికారి పాత్రలో ప్రేక్షకుల మెప్పు పొందడానికి ప్రయత్నిస్తున్నారు. త్వరలోనే ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానున్నది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X