రామ్ చరణ్ రచ్చలో ఓ ప్రముఖ హీరోయిన్ సర్ ఫ్రైజ్ సాంగ్...!?

By Sindhu

'ఆరెంజ్"లో లవర్‌ బాయ్‌ గా కనిపించిన రామ్‌ చరణ్ వెంటనే తన పంథా మార్చి మాస్ ఎంటర్‌ టైనర్ చేస్తున్నారు. అదే 'రచ్చ" సినిమా. రామ్ చరణ్, తమన్నా జంటగా 'ఏమైంది ఈ వేళ"తో ప్రతిభావంతుడైన దర్శకునిగా పేరు తెచ్చుకున్న సంపత్‌నంది ఈ చిత్రానికి దర్శకుడు. మెగా సూపర్‌ గుడ్ ఫిలిమ్స్ పతాకంపై ఆర్ బి చౌదరి సమర్పణలో ఎన్ వి ప్రసాద్, పారాస్‌ జైన్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. తమన్నా ఇందులో కథానాయిక. చిత్రీకరణ శరవేగంతో జరుగుతోంది. శ్రీలంక, బ్యాంకాక్‌ల్లో ఇప్పటికే భారీ షెడ్యూల్స్ చేశారు.

ఇటీవలే గోవాలో హీరో ఇంట్రడక్షన్ ఫైట్‌ని, భారీ ఛేజ్‌ని నాలుగు రోజులపాటు చిత్రీకరించారు. ఈ నెల 25 నుంచి హైదరాబాద్‌లో మరో షెడ్యూలు జరగనుంది. ఇప్పటికే అరవైశాతం చిత్రం షూటింగ్ పూర్తయింది. ముగ్గురు ఫైట్‌మాస్టర్లు ఈ చిత్రానికి పనిచేస్తుండటం విశేషం. అమీన్, స్టన్ శివ, రామ్-లక్ష్మణ్ నేతృత్వంలో యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరించారు. 'చిరుత" తర్వాత చరణ్ సినిమాకు మణిశర్మ స్వరాలందిస్తున్నారు. చిరంజీవి నటించిన 'గ్యాంగ్‌ లీడర్"లోని ఓ పాటను రీమిక్స్ చేస్తున్నారని బయట ప్రచారం జరుగుతోంది. ఆడియోను డిసెంబర్ ద్వితీయార్థంలో విడుదలచేయుటకు ప్లాన్ చేస్తున్నారు.

అయితే అటువంటి ప్రయత్నమేమీ జరగలేదని యూనిట్ వర్గాలు చెబుతున్నాయి. అయితే ఓ ప్రముఖ హీరోయిన్ తో సర్‌ ప్రైజ్‌ గా స్పెషల్‌ సాంగ్ చేయించాలనే ఆలోచన దర్శక, నిర్మాతల్లో ఉన్నట్టుగా ఫిలిమ్‌ నగర్ సమాచారమ్. 'రచ్చ" కోసం చరణ్ ప్రత్యేకంగా మియామి వెళ్లి ఫిట్‌ నెస్ ట్రైనింగ్ తీసుకున్నారు. ఈ సినిమా గెటప్, డాన్సులు, ఫైట్‌ ల విషయంలో కూడా చరణ్ ప్రత్యేక శ్రద్ధ కనపరుస్తున్నారు. అందుకే, కమర్షియల్ ఎలిమెంట్స్ అన్నీ ఉండేలా చూసుకుంటున్నాడు. పరుచూరి బ్రదర్స్‌ లాంటి అనుభవజ్ఞులైన రచయితలతో చరణ్ కలిసి పనిచేయడం ఇదే ప్రథమం. ఈ కథ విషయంలో చిరంజీవి కూడా చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నారు. 'రచ్చ"ను సంక్రాంతికి విడుదల చేయాలనేది నిర్మాతల ప్లాన్..

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X