twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ట్విట్టర్ రివ్యూ: మెర్క్యురీ.. సైలెంట్ థ్రిల్లర్, ఉత్కంఠ కలిగించేలా!

    |

    Recommended Video

    Mercury Movie Twitter Review మెర్క్యురీ ట్విట్టర్ రివ్యూ: సైలెంట్ థ్రిల్లర్!

    తాజగా ప్రభుదేవా ప్రధాన పాత్రలో నటించిన చిత్రం మెర్క్యురీ. సైలెంట్ మూవీగా వచ్చిన ఈ చిత్రం అద్భుతమైన సన్నివేశాలతో థ్రిల్ చేయడం ఖాయం అంటూ ప్రచారం పొందుతోంది. ఈ చిత్ర ప్రచార చిత్రాలు కూడా అలాగే ఉన్నాయి కార్తీక్ సుబ్బరాజ్ తెరకెక్కించిన ఈ ప్రయోగాత్మక చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇలాంటి ప్రయోగాత్మక చిత్రాలు చాలా అరుదుగా వస్తుంటాయి. దీనితో రెగ్యులర్ సినిమాలు చూసి విసిగిపోయిన ఆడియన్స్ కు మెర్కురీ చిత్రంపై మంచి అంచనాలు ఉన్నాయి. యుఎస్ లో ఈ చిత్ర ప్రదర్శన ప్రారంభం అయింది. మెర్క్యురీ చిత్రం అంచనాలు అందుకునే విధంగా ఉందా లేదా ఇప్పుడు చూద్దాం.

    ఎక్స్టార్డినరీ సైలెంట్ థ్రిల్లర్

    మెర్క్యురీ చిత్రానికి యుఎస్ లో అద్భుతమైన స్పందన వస్తోంది. స్క్రీన్ ప్లే, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ చిత్రానికి ప్రధాన బలం. ఇటువంటి ప్రయోగాత్మక చిత్రాన్ని ఎంచుకున్న దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ కు అభినందనలు.

    థ్రిల్ మూమెంట్స్ ఉన్నాయి కానీ

    చిత్రం స్లోగా పిక్ అప్ అవుతుంది. మంచి థ్రిల్ మూమెంట్స్ ఉన్నా కొన్ని మాత్రమే ఉన్నాయి. సినిమాట్రోగ్రఫీ చాలా బావుంది.

    ఆ చిత్ర కథలాగే

    మెర్క్యురీ చిత్రం డోంట్ బ్రీత్ అనే చిత్రాన్ని పోలివుంది. కార్తీక్ సుబ్బరాజ్ వంటి దర్శకుడు చేయాల్సిన చిత్రం కాదు.

    సెకండ్ హాఫ్ ఆకట్టుకుంది

    ఫస్ట్ హాఫ్ బాగాలేదు. సెకండ్ హాఫ్ బావుంది. సెకండ్ హాఫ్ లో కొన్ని ఆసక్తికరమైన సన్నివేశాలు ఉన్నాయి. ప్రభుదేవా అద్భుతంగా నటించారు.

    మంచి సందేశం

    మెర్క్యురీ చిత్రంలో మంచి సందేశం ఉంది. బ్యాక్ గ్రౌండ్ సంగీతం ఉత్కంఠ రేకెత్తించే విధంగా ఉంది.

    అద్భుతమైన స్పందన

    మెర్క్యురీ చిత్రానికి అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన వస్తోంది.

    థ్రిల్ కలిగించింది

    మెర్క్యురీ చిత్ర ఫస్ట్ హాఫ్ చాలా థ్రిల్ కలిగించింది. డైలాగులు లేకపోయినప్పటికీ సినిమా బావుంది.

    అలా అనుకుంటే పొరపాటే

    ప్రభుదేవా మంచి డాన్సర్ మాత్రమే అనుకుంటే పొరపాటు పడినట్లే. ఆయన ఎంత మంచి నటుడో మెర్క్యురీ చిత్రం చూసాక తెలుస్తుంది.

    హార్ట్ టచ్చింగ్ ట్విస్ట్

    మెర్క్యురీ అద్భుతమైన చిత్రం. ఈ చిత్రంలో ఉన్నా ట్విస్ట్ హృదయాన్ని హత్తుకునే విధంగా ఉంది.

    మునుపెన్నడూ కనిపించని విధంగా

    ప్రభుదేవా గతంలో ఎప్పుడూ లేని విధంగా ఈ చిత్రంలో కనిపించబోతున్నాడు. సైలెంట్ థ్రిల్లర్ గా వచ్చిన మెర్క్యురీ మంచి సినిమా అనుభూతిని కలిగించడం ఖాయం.

    English summary
    Mercury movie Twitter review. karthik Subbaraj is the director for this silent film
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X