»   » ‘మెర్క్యూరీ’ టీజర్ రిలీజ్: ప్రభుదేవా మూకీ చాలా కొత్తగా, భయం భయంగా....

‘మెర్క్యూరీ’ టీజర్ రిలీజ్: ప్రభుదేవా మూకీ చాలా కొత్తగా, భయం భయంగా....

Posted By:
Subscribe to Filmibeat Telugu
Mercury teaser : silent thriller out

చాలా ఏళ్ల క్రితం కమల్ హాసన్ హీరోగా సింగితం శ్రీనివాస్ దర్శకత్వంలో 'పుష్కక విమానం' అనే మూవీ సినిమా వచ్చిన సంగతి తెలిసిందే. అప్పట్లో ప్రయోగాత్మకంగా తెరకెక్కించిన ఆ చిత్రం భారతీయ ప్రేక్షకులను ఎంతగానో అలరించింది. చాలా ఏళ్ల తర్వాత అలాంటి డిఫరెంట్ కాన్సెప్టుతో మరో చిత్రం వస్తోంది. 'మెర్క్యూరీ' టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ప్రభుదేవా హీరోగా నటిస్తున్నారు. కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వం వహిస్తున్నారు.

 సైలెంట్ థ్రిల్లర్

సైలెంట్ థ్రిల్లర్

‘మెర్క్యూరీ' సినిమా సైలెంట్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతోంది. ఈ చిత్రానికి భాష లేదు. ఇందులో ఎలాంటి డైలాగులు ఉండవు. ఇదొక మూకీ సినిమా. చెవులతో సంబంధం లేకుండా కేవలం కళ్లతో చూస్తూ ప్రేక్షకులు థ్రిల్ ఫీలయ్యేలా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.

 సినిమా కాన్సెప్టు ఏమిటి?

సినిమా కాన్సెప్టు ఏమిటి?

1992లో మెర్క్యూరీ విష ప్రభావం వల్ల 84 మంది చనిపోయారు... అనే ఓ కథ చుట్టూ ఈ సినిమా తిరుగుతుందని తెలుస్తోంది. మరి దీన్ని దర్శకుడు తెరపై ఎలాంటి డైలాగులు లేకుండా ఆసక్తిగా ఎలా మలిచాడు అనేది థియేటర్లో చూడాల్సిందే.

 జీవితం యుద్ధంలా మారినపుడు శక్తివంతమైన స్క్రీమ్ సైలెన్స్

జీవితం యుద్ధంలా మారినపుడు శక్తివంతమైన స్క్రీమ్ సైలెన్స్

జీవితం యుద్ధంలా మారినపుడు శక్తివంతమైన స్క్రీమ్ సైలెన్స్.... అని టీజర్లో చూపించడాన్ని బట్టి చూస్తే దర్శకుడు ఈ చిత్రంలో ఎవరూ ఊహించని ఒక సరికొత్త సినిమాను ప్రేక్షకుల ముందుకు తేబోతున్నారని తెలుస్తోంది.

ముఖ్య నటులు

ముఖ్య నటులు

ప్రభుదేవా, సనంత్, ఇంధుజా, దీపక్ పరమేష్, శశాంక్ పురుషోత్తమ్, అనిష్ పద్మనాభన్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. పెన్‌ మూవీస్‌ పతాకంపై కార్తికేయన్‌ సంతానం, జయంతిలాల్‌ గద ఈ చినిర్మిస్తున్నారు. సంతోష్‌ నారాయణ్‌ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రానికి కథ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్: కార్తీక్ సుబ్బరాజు.

 అందుకే ప్రభుదేవా

అందుకే ప్రభుదేవా

ఈ చిత్రానికి భాష అంటూ లేదు. సైలెంట్ మూవీ కాబట్టి దేశంలోని అన్ని ప్రాంతాల్లో ఈ చిత్రం ఏప్రిల్ 13న విడుదల కానుంది. అందుకే ఈ చిత్రంలో నేషనల్ వైడ్ గుర్తింపు ఉన్న ప్రభుదేవాను హీరోగా ఎంచుకున్నారు.

రానా, ధనుష్, నివిన్ పౌలి, రక్షిత్ శెట్టి

ఈ చిత్రం ప్రమోషన్లు కూడా డిఫరెంటుగా నిర్వహిస్తున్నారు. తెలుగు స్టార్ రానా, తమిళ స్టార్ ధనుష్, మలయాళం స్టార్ నివిన్ పౌళి, కన్నడ స్టార్ రక్షిత్ శెట్టి చేతుల మీదుగా ఈ టీజర్ విడుదల చేయించారు.

English summary
When life is at war, the most powerful scream is SILENCE. Mercury - the first-of-its-kind Silent Thriller is all set to release worldwide on Friday the 13th of April, 2018.Pen Studios and Stone Bench Films present “MERCURY”, starring Prabhu Deva, written and directed by Karthik Subbaraj, Produced By Kaarthekeyen Santhanam - Jayantilal Gada (pen).
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu