»   » 'లీడర్' పోస్టర్స్ పై తప్పు రాత

'లీడర్' పోస్టర్స్ పై తప్పు రాత

Posted By:
Subscribe to Filmibeat Telugu

రాణా హీరోగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన 'లీడర్' చిత్రం కొత్త పోస్టర్స్ లో అక్షర దోషం ఉండటం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఒకటికి పదిసార్లు చెక్ చేసుకుని ఆ తర్వాతే బయిటకు వదిలే శేఖర్ కానీ, సురేష్ బాబు కానీ ఈ తప్పని గమనించకపోవటమేమిటంటున్నారు. ఇంతకీ ఈ పోస్టర్స్ పై దొర్లిన పొరపాటు వివరాలు ఏమిటంటే....'లీడర్' చిత్రంలోని డైలాగ్ అయిన 'నువ్వు నడిపిస్తున్న ప్రభుత్వమే కదరా!...శవాల్ని నడిపించలేం కదా పెద నాన్నా!' అని పెద్ద పెద్ద అక్షరాలుతో వేసారు. అయితే 'నువ్వు' అని పడకుండా 'నవ్వు' అని పడింది. దాంతో అర్ధమే మారిపోయింది. 'నవ్వు నడిపిస్తున్న ప్రభుత్వమే కదరా!' అని కనిపిస్తోంది. సినిమా చూసిన వారికి ఆ డైలాగ్ తెలియటంతో అది కరెక్టుగానే అర్దమవుతోంది. కానీ చూడని వారికి అదేమిటో అర్ధం కావటం లేదు. ఇక పిఆర్ డిపార్ట్ మెంట్ నుంచి వచ్చిన ఈ పోస్టర్ దరిదాపు అన్ని వెబ్ సైట్స్ లోనూ బయిట కూడా ఉంది. కాబట్టి కాస్త బయిటకు వెళ్ళే వాటిని చూసి పంపితే మేలు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu