»   » బాలయ్యకు అవమానం... దున్నపోతులపై, ఇంత దారుణంగానా

బాలయ్యకు అవమానం... దున్నపోతులపై, ఇంత దారుణంగానా

Posted By:
Subscribe to Filmibeat Telugu

సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలృష్ణ కనిపించడంలేదట. దీంతో నియోజకవర్గ ప్రజలు ఆయన కోసం గాలిస్తున్నారు. అంతేకాకుండా, బాలకృష్ణ కోసం గాలిస్తూ... వింత నిరసనలకు దిగారు. నియోజకవర్గ ప్రజలు బాలయ్యపై ఇంతలా ఆగ్రహం వ్యక్తం చేయడానికి కారణాలు లేకపోలేదు.

 తాగునీటి సమస్య

తాగునీటి సమస్య

హిందూపురం నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో తీవ్రమైన నీటి ఎద్దడి నెలకొంది. దీన్ని పరిష్కరించలేక అధికారులు చేతులెత్తేశారు. దీంతో తాగునీటి సమస్యను పరిష్కరించాలంటూ స్థానికులు, ప్రతిపక్ష పార్టీలు ఆందోళనలు దిగాయి. బాలకృష్ణ సినిమాలు తీయడంపై మాత్రమే దృష్టిపెట్టారని.. నియోజకవర్గాన్ని పట్టించుకోవడంలేదని వారు ఆరోపిస్తున్నారు.

ఎమ్మెల్యే బాలకృష్ణ

ఎమ్మెల్యే బాలకృష్ణ

అయితే అక్కడితో ఆగకుండా వేసవి నీటి ఎద్దడి నుంచి నానా ఇబ్బందులు పడుతుంటే ఐదు నెలలనుంచి ఎమ్మెల్యే బాలకృష్ణ హిందూపురం నియోజకవర్గానికి రావడం లేదని మండిపడ్డారు. నీరు లేక బిందెడు నీళ్లు కోసం రూ. 10చెల్లించి కొనుగోలు చేస్తున్నామని ఆవేదన వ్యక్తం చేసారు.

తాగునీటి సమస్య

తాగునీటి సమస్య

ఇందులోభాగంగా, బుధవారం తాగునీటి సమస్యను పరిష్కరించాలని, నియోజకవర్గంలో ఆగిపోయిన అభివృద్ధి కార్యక్రమాలను తిరిగి ప్రారంభించాలని కోరుతూ. దున్నపోతులతో ర్యాలీ నిర్వహించారు. అంతేకాదు బాలకృష్ణ కనిపించడం లేదంటూ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసి..టీడీపీ పార్టీని, ఎమ్మెల్యే బాలకృష్ణల పేర్లను దున్నపోతులపై రాసి ఊరేగింపుచేశారు. సమాచారం అందుకున్న పోలీసులు స్థానికుల్ని చెదరగొట్టే ప్రయత్నం చేశారు.

సినిమా నా? ప్రజలా?

సినిమా నా? ప్రజలా?

అయితే ఈ ఉదంతం మీద బాలయ్య ఇంకా స్పందించలేదు, సినిమా నా? ప్రజలా? అనుకున్నప్పుడు కొన్ని వదిలేయక తప్పదు, గతం లోనూ సినీ నటుల్లో చాలామందే ఇలా రెండు పడవలమీదా కాలువేయబోయి జారిపడ్డారు. కొందరు రాజకీయాలని వదిలేసి సినిమాలు చేసుకుంటూంటే మరికొందరు సినిమాలు వదిలేసి రాజకీయాలకే అంకితమైపోయారు. మరి ఇప్పుడు బాలయ్య చూపు ఏవైపో మరి.

English summary
A huge protest is carried out in Hindupur, saying that Balakrishna need to respond on the drinking water issues in the Hindupur constituency. They are doing protest by writing balaKrishna name, and TDP Government's on the buffalos.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu