For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మంచు ఫ్యామిలీ మల్టీస్టారర్ మొదలైంది(ఫోటోలు)

By Srikanya
|

హైదరాబాద్ : శ్రీ లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ ఐదుగురు హీరోలతో ఓ సినిమాను నిర్మిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం ప్రారంభోత్సవం హైదరాబాద్‌లోని దైవసన్నిధానంలో జరిగింది. డా.మంచు మోహన్‌బాబు, మంచు విష్ణు వర్ధన్‌బాబు, మంచు మనోజ్‌కుమార్, వరుణ్ సందేశ్, తనీష్ హీరోలు. ఆరియాన, వివియాన సమర్పిస్తున్నారు.

'లక్ష్యం' ఫేమ్ శ్రీవాస్ దర్శకత్వం వహిస్తున్నారు. మంచు విష్ణువర్ధన్‌బాబు, మంచు మనోజ్‌కుమార్ నిర్మాతలు. ఓ హిందీ చిత్రం రీమేక్ గా రూపొందుతోందని నిర్మాతలు తెలియచేసారు. మోహన్ బాబు తన కెరీర్ లో మరో మలుపు తెచ్చే చిత్రంగా ఈ చిత్రాన్ని చెప్తున్నారు.

ఈ చిత్రంలో బ్రహ్మానందం, గిరిబాబు, వెన్నెల కిషోర్‌, అలీ, ఎమ్మెస్‌ నారాయణ, పోసాని కృష్ణమురళి, రఘుబాబు, కాశీ విశ్వనాథ్‌, ఏవీఎస్‌ తదితరులు నటిస్తున్నారు. ఛాయాగ్రహణం: ఎమ్‌.ఆర్‌.పళనికుమార్‌, రచన: కోనవెంకట్‌, గోపీమోహన్‌, బి.వి.ఎస్‌.రవి, మాటలు: మరుధూరి రాజా, కూర్పు: ఎం.ఆర్‌.వర్మ, కళ: నారాయణ రెడ్డి, సంగీతం: కీరవాణి, బప్ప లహరి, బాబా సెహగల్‌, అచ్చు, సమర్పణ: ఆరియాన, వివియాన.

ముహూర్తపు సన్నివేశానికి రాఘవేంద్రరావు కెమెరా స్విచ్ఛాన్ చేశారు.

క్లాప్ బోర్డును ఆరియానా, వివియాన, మంచు నిర్మల చేతుల మీదుగా దాసరి నారాయణరావు అందుకుని క్లాప్‌కొట్టారు.

వరప్రసాద్‌రెడ్డి స్క్రిప్ట్‌ను అందజేశారు.

మోహన్‌బాబు మాట్లాడుతూ..ఇటీవలి కాలంలో యమదొంగ, బుజ్జిగాడు... ఇలా కొన్ని చిత్రాల్లో ప్రత్యేక పాత్రలు చేశాను. హీరోగా చేసి మాత్రం చాలాకాలం అయ్యింది. మళ్లీ ఇన్నాళ్లకు హీరోగా చేస్తున్నాను. నేను ఇన్ని సంవత్సరాల తర్వాత హీరోగా నటిస్తున్న సినిమా అనేసరికి ప్రేక్షకుల్లో ఆసక్తి ఉంటుంది అన్నారు.

అలాగే.. ఓ హిందీ చిత్రం ఆధారంగా మన తెలుగు ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టు ఈ కథను తయారుచేశారు. శ్రీవాస్‌ దర్శకత్వం వహించిన 'లక్ష్యం' చూశాను. నాకు నచ్చింది. ఈ సినిమాను చక్కగా మలుస్తాడనే నమ్మకం ఉంది. శ్రీవాస్‌ వేరే సినిమా ఒప్పుకొన్నా నా మీద గౌరవంతో ఈ సినిమా చేయడానికి అంగీకరించారు. వచ్చే నెల్లో చిత్రీకరణ మొదలుపెడతాము అని మోహన్ బాబు తెలిపారు.

దర్శకుడు శ్రీవాస్ మాట్లాడుతూ " హిలేరియస్ ఎంటర్‌టైనర్ ఇది. మోహన్‌బాబుగారు, విష్ణు, మనోజ్, వరుణ్, తనీష్ కోసం ఈ సినిమా స్క్రిప్ట్ చేశాం. ఇంత మంది కాల్షీట్లు కుదరడానికి కాస్త టైమ్ పడుతుంది. మేలో యూరప్‌లో పాటలను చిత్రీకరిస్తాం. తర్వాత రెగ్యులర్ షూటింగ్‌కు వెళ్తాం'' అని చెప్పారు.

ఎన్నెన్నో ప్రత్యేకతలున్న ఈ సినిమాను 'దేనికైనా రెడీ' కన్నా 100 రెట్లు హిట్ చేయాలని కృషి చేస్తున్నామని కోన వెంకట్ తెలిపారు.

రవీనా టాండన్, హన్సిక, ప్రణీత హీరోయిన్స్ గా నటిస్తున్నారు.

మంచు విష్ణు, మంచు మనోజ్‌, వరుణ్‌ సందేశ్‌, తనీష్‌ ప్రధాన పాత్రధారులు.

శ్రీ లక్ష్మీప్రసన్న పిక్చర్స్‌, 24 ప్రేమ్స్‌ ఫ్యాక్టరీ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.

రచన: కోన వెంకట్, గోపిమోహన్, బి.వి.యస్.రవి, మాటలు: మారుధూరి రాజా, పాటలు: చంద్రబోస్, భాస్కరభట్ల, అనంత శ్రీరామ్, విశ్వ, ఫైట్స్: విజయన్, ఎడిటింగ్: ఎమ్.ఆర్.వర్మ, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: విజయ్ కుమార్.ఆర్, కళ: నారాయణరెడ్డి, డ్యాన్స్: రాజు సుందరం, ప్రేమ్‌రక్షిత్.

రెండున్నరగంటలు పూర్తి హాస్యరసభరితంగా సాగే చిత్రమిది. నవ్వించడమే లక్ష్యంగా సబ్జెక్ట్‌ను తయారుచేశారు. మే నెలలో యూరప్‌లో రెండు పాటల్ని చిత్రీకరిస్తారు.

English summary
Mohan Babu, Vishnu Manchu and Manoj Manchu are teaming up for the first time for an untitled multi-starrer film. Varun Sandesh and Tanish are also playing lead roles apart from Raveena Tandon, Hansika and Pranitha Subhash. Two more actresses are going to cast in this film. Srivas, who had earlier made Lakshyam, is directing the film and it’s going to be produced by Vishnu and Manoj. The film was officially launched in Hyderabad and the entire Mohan Babu’s family graced the event along with Dasari Narayana Rao, Lavanya Tripathi, BVS Ravi, Gopi Mohan and Kona Venkat among many others.
 
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more