»   » చంద్రశేఖర్‌ యేలేటి కొత్త చిత్రం ప్రారంభమైంది..టైటిల్ ఏంటంటే

చంద్రశేఖర్‌ యేలేటి కొత్త చిత్రం ప్రారంభమైంది..టైటిల్ ఏంటంటే

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ :మోహన్‌లాల్‌, గౌతమి ప్రధాన పాత్రల్లో వారాహి చలన చిత్రం సంస్థ రూపొందిస్తున్న చిత్రం 'మనమంతా'. చంద్రశేఖర్‌ యేలేటి దర్శకుడు. రజనీ కొర్రపాటి నిర్మాత. హైదరాబాద్‌లో ఈ చిత్రం లాంఛనంగా ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి సాయి కొర్రపాటి క్లాప్‌నిచ్చారు. ఈ రోజు(సోమవారం) నుంచి షూటింగ్ ప్రారంభిస్తారు.

''మధ్యతరగతి జీవితానికి ప్రతిబింబంగా నిలిచే కథ ఇది. తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో ఒకేసారి తెరకెక్కిస్తున్నామ''అని చిత్ర యూనిట్ తెలిపింది.

Mohan Lal-Yeleti’s new film launched!

ముహుర్త‌పు స‌న్నివేశాన్ని దేవుని ప‌టాల‌పై చిత్రీక‌రించారు. వారాహి చ‌ల‌న చిత్రం అధినేత‌ సాయికొర్ర‌పాటి క్లాప్ కొట్టి, స్క్రిప్ట్‌ను ద‌ర్శ‌కుడు చంద్ర‌శేఖ‌ర్ యేలేటికి అందించారు. రేప‌టి నుండి సినిమా రెగ్యుల‌ర్ చిత్రీక‌ర‌ణ జ‌రుపుకోనుంది. వేర్వేరు మధ్యతరగతి కుటుంబాలకు చెందిన నలుగురు భిన్నమైన వ్యక్తుల కథే ఈ చిత్రమని తెలియజేశారు.

Mohan Lal-Yeleti’s new film launched!

మోహన్ లాల్, గౌతమి, ఊర్వశి, గొల్లపూడి మారుతీరావు, అయ్యప్పశర్మ, పరుచూరి వెంకటేశ్వరరావు తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి ఎడిటర్: చంద్రశేఖర్, ఆర్ట్: రవీందర్, కెమెరా: రాహుల్, మ్యూజిక్: మహేష్ శంకర్, నిర్మాత: రజనీ కొర్రపాటి, కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: చంద్రశేఖర్ యేలేటి.

English summary
Mohan Lal was doing a film titled as ‘Manamantha’ under the direction of Chandrasekhar Yeleti, who had done different films like Ithe, Anukokunda Oka Roju, Saahasam, Okkadunadu and Prayanam. This Manamantha was the middle class family story revolving around the four characters.
Please Wait while comments are loading...