»   » మోహన్ లాల్ కొనేసాడట : కేరళలో అల్లు అర్జున్ రికార్దు బద్దలయ్యింది...

మోహన్ లాల్ కొనేసాడట : కేరళలో అల్లు అర్జున్ రికార్దు బద్దలయ్యింది...

Posted By:
Subscribe to Filmibeat Telugu

తమిళ సిన్మాల్లో చాలమట్టుకు దాదాపుగా డబ్ చేయకుండానే మళయాళం లో కూడా రిలీజ్ ఔతాయి. ఇక సూపర్స్టార్ సినిమా అంటే చెప్పనే అక్కరలేదు. రజినీ సినిమాలు స్ట్రెయిట్ సినిమాల స్థాయిలో భారీ లెవెల్లో రిలీజవుతాయి.మరి అంతగా వ్యాపారం ఉందనుకున్నప్పుడు ఎందుకు వదలాలనుకున్నాడేమో గానీ.. రజినీ సినిమాని భారీ మొత్తానికే సొంతం చేసుకున్నాడు.

"కబాలి" సినిమాను తన సొంత బేనర్ మీద కేరళలో విడుదల చేస్తున్నాడు. మోహన్ లాల్‌కు చెందిన "మ్యాక్స్ ల్యాబ్" ఆంటోనీ అనే మరో నిర్మాతకు చెందిన "ఆశీర్వాద్ సినిమాస్‌"తో కలిసి సమ్యుక్తంగా "కబాలి" కేరళ హక్కులను కొనుక్కుంది.


ఇప్పటిదాకా ఏ తమిళ సినిమాకూ ఇవ్వని స్థాయిలో ఫ్యాన్సీ రేటు ఇచ్చి మరీ రజిని కబాలి సొంతం చేసుకున్నాడట మోహన్ లాల్. ఇంకో విశేశం ఏమితనటే ఆ రాష్ట్రంలో 150 స్క్రీన్లలో ఈ సినిమా రిలీజవబోతోంది. 150 కేరళలో బిగ్ నంబర్.మనకంతే అది చిన్నగానే అనిపిస్తుంది గానీ అక్కడ ఉన్న విశ్తీర్ణం లో.., అక్కడి జనాభాకీ.., అదీ డబ్బింగ్ సినిమాకి 150 థియేతర్లు అంటే మాముల్లు విషయం కాదు.


Mohanlal secure Kerala distribution rights of "Kabali"

మామూలుగా అయితే కేవం అక్కడి స్టార్ హీరోల సినిమాలే ఆ స్థాయిలో రిలీజవుతాయి. ఈ మధ్య అల్లు అర్జున్ సినిమా "యోధవు"ను 80 థియేటర్లలో రిలీజ్ చేస్తే డబ్ సినిమాలలో అదే రికార్డ్ అన్నారు. ఇక ఇప్పుడు రజినీ సినిమా ఆ రికార్డ్ ని పూర్తిగా తుడిచి పెట్టేసి అసలు బ్రేక్ చేయలేని రేంజ్ లో కూచుంది. .


ఏటూ మోహన్ లాల్ పాత స్నేహితుడే గనక "కబాలి" సినిమాను కేరళలో ప్రమోట్ చేయడానికి కూడా రజినీకాంత్ అంగీకరించాడట. విడుదలకు ముందు ఒక రోజు కోచికి వచ్చి ప్రమోషన్లోల పాల్గొంటాడట సూపర్ స్టార్. ఐతే 'కబాలి' రిలీజ్ డేట్ విషయంలోనే కొంచెం సందేహాలున్నాయి. అనుకున్న ప్రకారం జులై 15న ఈ సినిమా రావడం కష్టమే అంటున్నారు. జులై 22కు వాయిదా పడే అవకాశాలు కనిపిస్తున్నాయి.

English summary
Malayalam Superstar Mohanlal is now a part of the film Kabali. The actor has grabbed the Kerala distribution rights of Tamil Superstar Rajinikanth’s gangster flick, Kabali.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu