For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ధోనీ: ద అన్ టోల్డ్ స్టోరీ రివ్యూ (వీడియో)

  |

  ఇండియన్ క్రికెట్ టీమ్ గ్రేటెస్ట్ ఎవర్ కెప్టెన్లలో ఒకడైన ధోని కెరీర్ ఎలా ఆరంభమైందో.. అతను ఎలా ఎదిగాడో.. ప్రపంచంలోనే అత్యుత్తమ కెప్టెన్లలో ఒకడిగా ఎలా గుర్తింపు తెచ్చుకున్నాడో అందరికీ తెలుసు. ఐతే అతడి కెరీర్ ఆరంభమవ్వడానికి ముందు ఏం జరిగిందన్నది చాలామందికి తెలియదు. ఆ విశేషాలతోనే నీరజ్ పాండే ?ఎం.ఎస్.ధోని? సినిమా తీశాడు. క్రికెట్ టార్జాన్ ఎమ్మెస్ ధోనీ ఇవాళే సినీ క్రీజ్ లోకి అడుగు పెట్టాడు. అయితే ధోనీ ఇక్కడ ఎంత వరకూ సక్సెస్ అవుతాడూ అన్న విషయం లో మొన్నటిదాకా చాలామందికే అనుమానం ఉండేది. కానీ ట్రైలర్ చూడగానే ధోనీ మరీ తాము ఊహించుకున్నంత సామాన్యమైన సినిమా కాదనే అభిప్రాయానికి వచ్చారు. ఈ రోజు వచ్చిన ధోనీ ఎంత వరకూ అభిమానులని అలరించ గలిగాడు.., ఆటలోనే కాకుండా సినిమాలోనూ మరెన్ని రికార్డులని అందుకోనున్నాడు ఒక సారి చూద్దాం...

  సాధారణంగా రిటైర్ అయిన స్పోర్ట్స్ స్టార్ మీద బయో పిక్ తీయటం కామన్. ఇప్పటి వరకూ వచ్చిన సినిమాలన్నీ దాదాపుగా అలానే వచ్చాయి. కాని ఒక క్రికెటర్ అందునా కెరీర్ లో పీక్ స్టేజి ఉన్న ఒక సారధి జీవితం మీద తీయటం అనేది ఇదే మొదటి సారి. ఒక మామూలు కుర్రాడు జాతీయ, అంతర్జాతీయ స్థాయి స్టార్ ఆటగాడిగా ఎదిగిన జర్నీని అద్బుతంగా తెరమీదకి ఎక్కించటం లో దర్శకుడు నీరజ్ పాండే స్క్రిప్ట్ రాసుకున్న తీరు అద్బుతం అనే చెప్పాలి. ఇక హీరో పాత్రలో ధోనీ గా కనిపించిన సుశాంత్ రాజ్ పూత్ కి ఎక్కువ మార్కులే వెయ్యొచ్చు.

  క్రికెటర్ అవ్వాలనుకొన్న ఆశలుకుప్పకూలి టికెట్ కలెక్తర్ గా మారిన ధోనీ మళ్ళీ క్రికెట్ కి ఎలా వచ్చాడు అన్న కీలక మైన అంశాన్ని తెలియ చెప్పటానికి కథనాన్ని చక్కగా రాసుకున్నాడు. ఇదే ప్రతీ ధోనీ అభిమానినీ ఆకర్శించే అంసం... ఇక ధోనీ వ్యక్తి గత జీవితం లోని లవ్ ఎఫైర్లను కూడా బాగానే హ్యాండిల్ చేసాడు. ఈ సక్సెస్ఫుల్ ఆటగాడి ఫెయిల్యూర్ లవ్స్టోరీ నీ, తర్వాత సాక్షి తో ధోనీ వివాహ అనుభందం గురించీ చెప్తూ ఎక్కడా బోర్ కొట్తనివ్వకుండా కథని నడిపించాడు. నిజానికి మనకు తెలిసిన కథని సినిమాగా చూస్తున్నప్పుడు ప్రేక్షకుడికి ఉండే ఏరకమైన పోల్చి చూసే అవకాశాన్ని ఇవ్వకుండా సినిమా చూసేలా చేయటం అంటే మామూలువిశయమేం కాదు. మొత్తానికి బాలీవుడ్ కి ఇంకో హిట్ బయో పిక్ అందినట్టే...

  English summary
  M S Dhoni has hit the theatres and it stars Sushant Singh Rajput in the lead role. Since the day, the trailer of the film has released, the movie is in terrific buzz! Now, the D-day has arrived, we will finally get to know whether the movie is actually worth the hype.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X