ప్రభాస్‌తో డిజాస్టర్.. ప్రభుదేవాతో గొడవ.. 15ఏళ్ళ తరువాత అసలు నిజం చెప్పిన నిర్మాత
రెబల్ స్టార్ ప్రభాస్ మొదట ఈశ్వర్ సినిమాతో వెండితెరకు ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇక ఆ తరువాత. ఎంతో కష్టపడి చేసిన రాఘవేంద్ర సినిమా బాక్సాఫీస్ వద్ద దారుణమైన రిజల్ట్ ను అందుకుంది. ఆ సమయంలో ప్రభాస్ హీరోగా నిలదొక్కుకోవాలని ఎదురుచూస్తున్న సమయంలో మంచి విజయాన్ని అందించిన సినిమా వర్షం. అయితే ఆ తరువాత అదే నిర్మాతతో చేసిన సినిమా డిజాస్టర్ కావడంతో దర్శకుడితో గొడవ జరిగినట్లు అప్పట్లో రూమర్స్ ఎన్నో వచ్చాయి. ఇక ఇన్నాళ్లకు ఆ రూమర్స్ పై నిర్మాత క్లారిటీ ఇచ్చాడు.

బడా హీరోలు సిద్ధాంగా ఉండేవారు.
ఆ నిర్మాత మరెవరో కాదు. ఎమ్ఎస్.రాజు. ఆయన కెరీర్ మొదట్లో తెరకెక్కించిన సినిమాలన్నీ కూడా బాక్సాఫీస్ వద్ద ఒక ట్రెండ్ సెట్ చేశాయి. దేవి సినిమతో పాటు ఒక్కడు బాక్సాఫీస్ వద్ద భారీ స్థాయిలో వసూళ్లను అందుకోవడంతో ఆయనతో సినిమా చేయాలని అప్పట్లో బడా హీరోలు సిద్ధాంగా ఉండేవారు.

చిన్న సినిమా వచ్చినా
సుమంత్ ఆర్ట్ ప్రొడక్షన్ లో ఒక సినిమా వస్తోంది అంటే అప్పట్లో ప్రేక్షకులలో కూడా మంచి అంచనాలు ఉండేవి. చిన్న సినిమా వచ్చినా భారీ స్థాయిలో ఓపెనింగ్స్ వచ్చేవి. మనసంతా నువ్వే, నువ్వొస్తానంటే నేనొద్దంటానా.. వంటి మ్యూజికల్ హిట్స్ కూడా మంచి గుర్తింపును అంధించాయి.

ప్రభుదేవా - ప్రభాస్ కాంబో..
అయితే వర్షం సినిమా సక్సెస్ అనంతరం హీరో ప్రభాస్, ఎమ్ఎస్.రాజు ప్రొడక్షన్ లోనే మరొక సినిమా చేసేందుకు కామిట్మెంట్ ఇచ్చాడు. ఇక నువ్వొస్తానంటే నేనొద్దంటానా హిట్టవ్వడంతో ఆ సినిమా దర్శకుడు ప్రభుదేవా కాంబినేషన్ లోనే మరొక సినిమా చేయాలని పౌర్ణమి ఆలోచనతో ముందుకు వెళ్లారు.

ప్రభుదేవాతో గొడవ
అప్పట్లో ఛత్రపతి హిట్ అయిన తరువాత చేసిన సినిమా కావడంతో పౌర్ణమిపై ఒక్కసారిగా అంచనాలు అకాశాన్ని దాటేశాయి. అంచనాలకు తగ్గట్లుగానే నిర్మాత భారీ బడ్జెట్ తో నిర్మించారు. కానీ సినిమా దారుణమైన రిజల్ట్ ను అందుకుంది. అయితే సినిమా మేకింగ్ విషయంలో నిర్మాత రాజు, డైరెక్టర్ ప్రభుదేవా మధ్య గొడవ అయినట్లు అప్పట్లో రూమర్స్ బాగానే వచ్చాయి.

అసలు నిజం చెప్పిన నిర్మాత
ఆ రోజుల్లో రూమర్స్ ఎన్ని వచ్చినా ఎవరు క్లారిటీ ఇవ్వకపోవడంతో ఇప్పటికి కూడా అదే నిజమని చాలా మంది అనుకుంటున్నారు. ఇక 15 ఏళ్ళ అనంతరం నిర్మాత ఎమ్ఎస్.రాజు ఆ రూమర్స్ కు చెక్ పెట్టాడు. నిజంగా ప్రభుదేవాకు తనకు మధ్య ఎలాంటి గొడవ జరగలేదని కేవలం అవి పుకార్లేనని అన్నారు. ఇప్పటికి తమ మధ్య మంచి రిలేషన్ ఉందని రాజు వివరణ ఇచ్చారు.


Click it and Unblock the Notifications











