మురుగదాస్-దిల్ రాజు కాంబినేషన్లో సినిమా!
హైదరాబాద్: ప్రముఖ ఫిల్మ్ మేకర్ మురుగదాస్ త్వరలో తెలుగు స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజుతో చేతులు కలపబోతున్నారు. ప్రస్తుతం హిందీలో సోనాక్షి సిన్హా ప్రధాన పాత్రలో ‘అకీరా' సినిమాను తెరకెక్కిస్తూ బిజీగా గడుపుతున్న మురుగదాస్ ఈ సినిమా పూర్తయిన వెంటనే ఓ తెలుగు సినిమా చేయబోతున్నారు.
దిల్ రాజు, మురుగదాస్ కలిసి ఈ సినిమాను ప్రొడ్యూసర్ చేయబోతున్నట్లు సమాచారం. ‘పండగ చేస్కో' సినిమా దర్శకుడు గోపీచంద్ మలినేని ఈ చిత్రానికి దర్శకత్వం వహించబోతున్నారు. ఇటీవల ఈ ముగ్గురూ కలిసి త్వరలో చేయబోయే ప్రాజెక్టు గురించి చర్చించినట్లు సమాచారం.

గత వారం ఈ ముగ్గురు కలిసి తాము చేయబోయే సినిమా గురించి చర్చించినట్లు, ముగ్గురూ తాము అనుకున్న ప్రాజెక్టుపై పాజిటివ్ గా ఉన్నట్లు సమాచారం. ప్రముఖ తెలుగు హీరోతో సినిమా చేయబోతున్నారు. అయితే ఎవరితో చేస్తున్నారనే విషయం ఇంకా బయటకు రాలేదు.
ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరించడంతో పాటు స్టోరీ కూడా అందించబోతున్నారు మురుగదాస్. తమిళంలో మురుగదాస్ నిర్మాతగా, తెలుగు వెర్షన్ బాధ్యతను దిల్ రాజు లీడ్ చేయబోతున్నారు. ఇది పూర్తిగా ఫ్రెష్ స్క్రిప్టుతో తెరకెక్కిస్తున్నారని, గతంలో వచ్చిన ఏ సినిమాకు ఇది రీమేక్ కాదని తెలుస్తోంది. తన తర్వాతి సినిమాను దిల్ రాజు నిర్మించబోతున్నారని, త్వరలో పూర్తి వివరాలు తెలియజేస్తానని గోపీచంద్ మలినేని గతవారం తన ట్విట్టర్ పేజీ ద్వారా వెల్లడించారు.


Click it and Unblock the Notifications











