twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఎన్టీఆర్ జీవితంలోని విలన్లను చూపించక పోతే ఎవరు చూస్తారు? రామ్ గోపాల్ వర్మ

    |

    రామ్ గోపాల్ వర్మ వివాదాలతో సావాసం చేయడానికి ఇష్టపడుతుంటారు. అందుకే ఎవరూ టచ్ చేయని వివాదాస్పద సబ్జెక్టులను టచ్ చేయడం, వాటిని సినిమా రూపంలోకి తేవడం ఆయనకు అలవాటు. తాజాగా వర్మ ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు జీవితంలోని వివాదాస్పద అంశాలను ఫోకస్ చేస్తూ 'లక్ష్మీస్ ఎన్టీఆర్' చిత్రం రూపొందిస్తున్నారు.

    తాజాగా ఓ ఆంగ్లపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో రామ్ గోపాల్ వర్మ మాట్లాడుతూ... ఎన్టీ రామారావు, లక్ష్మీ పార్వతి వివాహం జరిగిన తర్వాత జరిగిన హైడ్రామాను తన చిత్రంలో చూపించబోతున్నట్లు వెల్లడించారు. ఫిబ్రవరి చివరి వారంలో ఈ చిత్రం విడుదల కాబోతోంది.

    చివరి రోజుల్లో జరిగిన హైడ్రామా

    చివరి రోజుల్లో జరిగిన హైడ్రామా

    ఎన్టీ రామారావు ముఖ్యమంత్రిగా అధికారం చేపట్టిన కొన్ని నెలలకు 1993లో లక్ష్మీపార్వతిని పెళ్లాడారు. అయితే పార్టీలో లక్ష్మీపార్వతి జోక్యం పెరగడంతో ఆయన అల్లుడు చంద్రబాబు నాయుడు 1995లో ఎన్టీఆర్‌ నుంచి అధికారం చేజిక్కించుకున్నారు.

    ఈ విషయమై రామ్ గోపాల్ వర్మ మాట్లాడుతూ... ఎన్టీఆర్ జీవితంలోని చివరి రోజుల్లో జరిగిన హైడ్రామా ఏమిటి? లక్ష్మి పార్వతితో రిలేషన్ షిప్ ఎలాంటి పరిణామాలకు దారి తీసింది? అవి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎలాంటి మార్పులకు కారణమైంది? అనేది తన సినిమాలో ఆసక్తిగా చూపించబోతున్నట్లు తెలిపారు.

    అసలు విషయం అప్పుడే మొదలైంది

    అసలు విషయం అప్పుడే మొదలైంది

    ఈ చిత్రానికి ‘లక్ష్మీస్ ఎన్టీఆర్' అనే టైటిల్ ఎంచుకోవడానికి గల కారణం వివరిస్తూ... ‘ఎన్టీఆర్ సినిమా స్టార్‌గా ఎదగడం, తెలుగు దేశం పార్టీ స్థాపించడం, అధికారంలోకి రావడం లాంటివి అందరికీ తెలిసిన విషయాలే. కానీ ఆమె వచ్చిన తర్వాత ఎన్టీఆర్ జీవితం ఊహించని మలుపు తిరిగింది. అధికారం కోల్పోవవడం దగ్గర నుంచి మరణించే వరకు ఎన్నో విషయాలు చోటు చేసుకున్నాయి. అందుకే ఆ టైటిల్ ఎంచుకోవడం జరిగింది' అన్నారు.

    విలన్లను చూపించక పోతే ఎలా?

    విలన్లను చూపించక పోతే ఎలా?

    లక్ష్మీ పార్వతి వచ్చిన తర్వాత ఎన్టీ రామారావు జీవితంలో జరిగిన సంఘటనలు ఒక కమర్షియల్ సినిమాకు అనుగుణంగా ఉన్నాయి. ఆయన జీవితంలోని ఇతర విషయాలు అంత ఆసక్తికరంగా ఉండవు. బయోపిక్ అంటే అందులో సంఘర్షణ ఉండాలి. గాంధీ బయోపిక్ తీసుకుంటే ఆయన జీవితంలో బ్రిటిషర్లు విలన్లు. అలాంటపుడు బ్రిటిషర్లు లేకుండా బయోపిక్ తీస్తే ఎవరు చూస్తారు? ఆ అంశాలు లేకుండా బయోపిక్ ఉండాలని ఎవరూ కోరుకోరు. డాక్యుమెంటరీలో అయితే అలాంటివి వర్కౌట్ అవుతాయేమో? కానీ సినిమాలో కావు. ఎన్టీఆర్ జీవితంలో అతిపెద్ద సంఘర్షణ లక్ష్మీ పార్వతి ఆయన జీవితంలోకి వచ్చిన తర్వాతే మొదలైందని వర్మ తెలిపారు.

    నిజాలు చెప్పడమే నా ఉద్దేశ్యం

    నిజాలు చెప్పడమే నా ఉద్దేశ్యం

    నా సినిమాలో ఎన్టీఆర్ జీవితం మొత్తం చూపించడం లేదు. ఆయన జీవితంలోకి లక్ష్మీ పార్వతి ప్రేవశించిన తర్వాత నుంచి ఆయన మరణం వరకు చోటు చేసకున్న సంఘటనలు మాత్రమే చూపించబోతున్నామని వర్మ తెలిపారు. వెన్ను పోటు సాంగ్ విడుదల తర్వాత ఇది చంద్రబాబును టార్గెట్ చేస్తున్నట్లు ఉందనే వాదన తెరపైకి వచ్చింది. నా ఉద్దేశ్యం ఈ సినిమా ద్వారా ఎవరికీ టార్గెట్ చేయడం కాదు, కేవలం వాస్తవాలను చూపించే ప్రయత్నం చేయడమే అని రామ్ గోపాల్ వర్మ స్పష్టం చేశారు.

    English summary
    Lakshmi's NTR ran into trouble, recently, when the song Vennupotu was released. The song talked about backstabbing and supporters of Naidu burnt effigies of Varma for allegedly showing the chief minister in poor light. In India Today interview, Varma remained unfazed and said that he was "well within (his) rights" to bring the truth alive on celluloid. "With regard to Chandrababu Naidu, I am making a film on a story which is in the public domain and I am well within my rights to do so and my intention is to depict the truth but not to target anyone," he said.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X