»   » ఆ బాధ ఎవరికీ చెప్పుకోలేక ఒంటరిగా కూర్చొని ఏడ్చేదాన్ని : అనుష్క

ఆ బాధ ఎవరికీ చెప్పుకోలేక ఒంటరిగా కూర్చొని ఏడ్చేదాన్ని : అనుష్క

Posted By:
Subscribe to Filmibeat Telugu

తెలుగు ఇండస్ట్రీలోకి సూపర్ చిత్రంతో ఎంట్రీ ఇచ్చిన బెంగుళూర్ బ్యూటీ అనుష్క అతి తక్కువ కాలంలో అగ్ర హీరోల సరసన నటించి నెంబర్ వన్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది. ఇక అరుంధతి చిత్రంతో లేడీ ఓరియెంటెడ్ అద్భుతమైన నటన ప్రదర్శించి విమర్శకుల నుంచి ప్రశంసలు పొందింది. ఓ హీరోయిన్ ఐదారేళ్లు ఇండస్ట్రీలో కొనసాగడమే కష్టం. అలాంటిది అనుష్క పదేళ్లుగా ఇండస్ట్రీలో ఉంది. పైగా ఇప్పటికీ స్టార్ హీరోయిన్ గా.. కెరీర్ పీక్స్ లో కొనసాగుతుండటం విశేషం.

దీనికి ముఖ్య కారణం.. అక్కినేని నాగార్జున అనడంలో ఎలాంటి సందేహం లేదు. బెంగళూరులో యోగా టీచర్ గా పని చేస్తున్న అనుష్కను టాలీవుడ్ లోకి తీసుకొచ్చింది ఆయనే అయినా తన నటనతో, హార్డ్ వర్క్ తో ఇండస్ట్రీ లో తనకంటూ ఒక స్థానం ఏర్పరుచుకుంది ఈ స్వీటీ.. టాప్ త్రీ లో నుంచి తగ్గకుండా దాదాపు అయిదేళ్ళుగా హీరోయింగా రాణిస్తోంది. అయితే సినిమా రంగం అయినంత మాత్రాన విలాసవంతమైన జీవితం ఉండదని, ఆ జీవితం కావాలంటే ఎన్నొ అభాదలు పడాల్సి ఉంటుందనీ, నటులకు కూడా చాలా కష్టాలు ఉంటాయని తాజాగా ఓ ఇంటర్వ్యూ లో వాపోయింది అనుష్క...

అనుష్క

అనుష్క

నేనీ స్థాయిలో ఉండటానికి చాలామంది కారణం. నాగార్జున - పూరి జగన్నాథ్ - శ్యామ్ ప్రసాద్ రెడ్డి.. వీళ్లందరికీ నా కెరీర్ తాలూకు క్రెడిట్ ఇవ్వాలి. ముఖ్యంగా నాగార్జున గారు సూపర్ సినిమా సమయంలో ఎంత బాగా చూసుకున్నారో చెప్పలేదు.

అనుష్క

అనుష్క

సెట్లో నన్నో చిన్నపిల్లలా ట్రీట్ చేశారు. పరిశ్రమ గురించి నాకేం తెలియదు. ఎలా ఉండాలో అర్థమయ్యేది కాదు. ఆ సమయంలో ఆయన ‘కష్టపడు. ఎదగడానికి అందుకు మించిన మార్గం లేదు' అని నాగార్జున చెప్పిన మాటలు నా చెవిలో మార్మోగుతూనే ఉంటాయి.

అనుష్క

అనుష్క

నా తొలి ఏడాది చాలా గందరగోళంగా నడిచింది. నేను సినిమాలు చేయను. ఇంటికెళ్లిపోతా చదువుకుంటా అని ఏడ్చేదాన్ని. అలాంటిది పదేళ్లకు పైగా కెరీర్ కొనసాగిందంటే నాగార్జున సహా దర్శకులు నిర్మాతలిచ్చిన ప్రోత్సాహమే కారణం.

 అనుష్క

అనుష్క

నాకు మంచి పేరును సంపాదించి పెట్టిన సినిమాల వలన నేను పరిశ్రమలో ఉన్నా లేకపోయినా ఈ సినిమాలు నన్ను నా అభిమానులకు ఎప్పుడూ గుర్తుచేస్తుంటాయి. అయితే అదంతా తేలికగా సాధ్య పడలేదు. ఆ కష్టాలు మీరు ఊహించనుకూడా లేరు.

అనుష్క

అనుష్క

ఆ మద్య వరుసగా కొన్ని చిత్రాల్లో కాల్షీట్లు ఇచ్చి విపరీత శ్రమకు లోనయ్యాను. ముఖ్యంగా లేడీ ఓరియెంటెడ్ సినిమాలన్నీ చాలా కష్టంతో కూడినవి, చాలా కష్టపడాల్సి వచ్చేది. ఊకో పాత్రకోసం గంటల తరబడి ప్రాక్టీస్ చేస్తూనే ఉండేదాన్ని.

అనుష్క

అనుష్క

షూటింగ్ పేకప్ అయ్యాక ఇంటికెళ్తే ఒళ్లంతా ఒకటే నొప్పులుగా ఉండేది. ఆ విషయాన్ని ఇంట్లో వారికి చెబితే బాధపడతారని ఒక్కోసారి లోలోపల బాధపడుతూ ఆ బాధ తట్టుకోలేక రూం లో ఒక్క దాన్నే బాగా ఏడ్చేసేదాన్ని..

అనుష్క

అనుష్క

అయితే నా భాదని అర్ధం చేసుకొని నా కుటుంబ సభ్యులు కొంత రెస్టు తీసుకోమని బలవంత పెట్టేవారు కానీ కమిట్ మెంట్ ఇచ్చిన తర్వాత సినిమాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేదాన్ని అదే ఈ రోజు అనుష్క అంటే ఒక గుర్తింపు తీసుకు వచ్చింది. ఇప్పుడున్న పేరూ హోదా ఇవన్నీ ఊరికే వచ్చినవి కాదు నా కష్టానికి ప్రతిగా వచ్చినదే అంతా..

అనుష్క

అనుష్క

అన్నీ ఒక ఎత్తైతే సైజ్ జీరో కోసం పడ్డ, పడుతున్న కష్టం ఒకెత్తు. ఇక సైజ్ జీరో చిత్రం తర్వాత తన వెయిట్ పెరగడంతో ఆ వెయిట్ తగ్గించుకోవడానికి నేను పడ్డ కష్టాల అన్నీ ఇన్నీ కావు.. ఇప్పుడు నా భవిశ్యత్ ఆరోగ్యం కూడా ఈ సమయం మీదే ఆధార పడి ఉంది.

అనుష్క

అనుష్క

అయితే నాకు తెలుసు సినిమాలు అన్న తర్వాత ఇలాంటి రిస్క్ చేయకుండా చిత్ర పరిశ్రమలో గుర్తింపు రాదని.. అయితే సెట్లో మాత్రం తన బాధను పైకి తెలియనిచ్చేదాన్ని కాదు అలా చెప్పుకోవతం మన మానసిక బలహీనతకు చిహ్నం అనుకుంటాను అని చెప్పింది.

అనుష్క

అనుష్క

అంత కష్ట పడింది కనుకే ఈరోజు అనుష్క ప్రస్తుతం తెలుగు, తమిళ ఇండస్ట్రీలో నెంబర్ వన్ రేసులో ఉంది. ఇక ముందుకూడా అనుష్క కెరీర్ ఇలాగే సాగుతుంది ఎందుకంటే అనుష్క ఇంకా కష్ట పడటానికి సిద్దంగా ఉంది...

English summary
Actress Anushka Shetty, in a interweave shares her strength, stating that only solution she has for everything is Crying, and that she talks to her close friends when she feels weak.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu