For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  కొడుక్కు మాత్రమే కనిపించే దెయ్యాన్ని: నాగార్జున (ఫొటో ఫీచర్)

  By Srikanya
  |

  హైదరాబాద్‌: అక్కినేని నాగార్జున, రమ్యకృష్ణ, లావణ్య త్రిపాఠిలు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న 'సోగ్గాడే చిన్నినాయన' చిత్రం వర్కింగ్‌ స్టిల్స్‌ని అక్కినేని నాగార్జున ట్విట్టర్‌లో విడుదల చేశారు. కర్ణాటకలోని మైసూరు తదితర ప్రాంతాల్లో దాదాపు 25రోజుల పాటు నిర్విరామంగా ఈ చిత్రం షూటింగ్‌ జరిగింది.

  ఈ చిత్రానికి కల్యాణ్‌ కృష్ణ దర్శకత్వం వహిస్తుండగా, అనూప్‌ రూబెన్స్‌ సంగీతం అందిస్తున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్‌ బ్యానర్‌పై అక్కినేని నాగార్జున ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

  ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

  ఈ సందర్భంగా నాగార్జున మాట్లాడుతూ.. తొలిసారిగా ‘సోగ్గాడే చిన్నినాయనా' ఫుల్ కామెడీ చిత్రంలో తాను నటిస్తున్నానని, సోగ్గాడిగా, అమాయకుడిగా రెండు పాత్రల్లో తేడాలు ప్రేక్షకులకు నచ్చుతాయని తెలిపారు. గ్రామీణ నేపథ్యంలో సాగే ఔట్ అండ్ ఔట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా సాగే ఈ చిత్రంలో తండ్రి పాత్ర ఇందులో ఘోష్ట్‌గా కనిపిస్తుందని, చనిపోయిన తర్వాత కొడుక్కుమాత్రమే కనబడే విచిత్రమైన ఆ పాత్రలో తాను నటించానని తెలిపారు.

  నాగార్జున ఇంకేమన్నారో...క్రింద చదువుతూ ఫొటోలు చూడండి

  నేపధ్యంగా తీసుకుని

  నేపధ్యంగా తీసుకుని

  ఈ సరికొత్త పాయింట్ వినగానే ఇష్టంతో ఈ సినిమాను చేశామని, రెండు పాత్రలను నేపథ్యంగా తీసుకొని సినిమాకు ఆ పేరును ఖరారు చేశామని తెలిపారు.

  అద్బుతంగా..

  అద్బుతంగా..

  దర్శకుడు కళ్యాణకృష్ణ మంచి రచయిత అవడంతో రామ్మోహన్ ఇచ్చిన లైన్‌ను డెవలప్ చేసి ఈ చిత్రాన్ని అద్భుతంగా తీర్చిదిద్దాడని ఆయన తెలిపారు.

  గ్రాండ్ గా..

  గ్రాండ్ గా..

  ప్రస్తుతం జరిగే పోస్ట్‌ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తిచేసి, మంచి తేదీని ఖరారుచేసి, గ్రాండ్‌గా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని ఆయన అన్నారు.

  రిలీజ్ ఎప్పుడంటే...

  రిలీజ్ ఎప్పుడంటే...

  నవంబర్‌ తరువాత ఈ చిత్రం విడుదలకు సన్నాహాలు చేస్తున్నట్లు చిత్ర యూనిట్ వెల్లడించింది.

  హంసానందిని

  హంసానందిని

  ఈ సినిమాలోని ఓ కీలక పాత్రలో హాట్ హీరోయిన్ హంసా నందిని నటిస్తుంది. కొన్ని రోజులు షూటింగులో కూడా పాల్గొంది. తన పాత్ర వివరాలు వెల్లడించలేనని, నేను గతంలో నటించిన పాత్రల కంటే భిన్నమైన పాత్ర అని హంసా తెలిపింది. దర్శకుడు కథ చెప్పిన వెంటనే అంగీకరించిందట.

  బ్రహ్మానందం పాత్ర..

  బ్రహ్మానందం పాత్ర..

  ఈ సినిమాలో బ్రహ్మానందం స్వామిజీగా వినోదం పండిస్తారని సమాచారం.

  తెర ముందు

  తెర ముందు

  నాగార్జున, రమ్యకృష్ణ, లావణ్యాత్రిపాఠి, నాజర్, బ్రహ్మానందం, సంపత్, నాగబాబు, సప్తగిరి, పోసాని కృష్ణమురళి, హంసానందిని, అనసూయ, దీక్షాపంత్, బెనర్జీ, సురేఖావాణి, దువ్వాసి, రామరాజు తదితరులు నటించారు.

  తెరవెనుక

  తెరవెనుక

  ఈ చిత్రానికి కథ: పి.రామ్మోహన్, స్క్రీన్‌ప్లే: సత్యానంద్, కెమెరా: పి.ఎస్.వినోద్, సిద్ధార్ధ్ రామస్వామి, సంగీతం: అనూప్ రూబెన్స్, ఎడిటింగ్: ప్రవీణ్‌పూడి, నిర్మాత: అక్కినేని నాగార్జున, మాటలు, దర్శకత్వం: కళ్యాణకృష్ణ.

  English summary
  The talkie portion of Akkineni Nagarjuna-starrer Telugu film Soggade Chinni Nayana, which features the star essaying two versatile characters, has been wrapped as the team completed its last schedule in Mysore.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X