»   » మహాలక్ష్మి..ఐ లవ్ యు (నాగచైతన్య '100% లవ్')

మహాలక్ష్మి..ఐ లవ్ యు (నాగచైతన్య '100% లవ్')

Posted By:
Subscribe to Filmibeat Telugu

ఈ రోజు(శుక్రవారం) నాగచైతన్య, తమన్నా కాంబినేషన్ లో రూపొందిన 100% లవ్ చిత్రం విడుదల అవుతోంది. ఈ చిత్రంలో బాలు (నాగచైతన్య), మహాలక్ష్మి (తమన్నా) గా కనిపిస్తారు. ఇంజినీరింగ్ చదివే వీరిద్దరూ బావ మరదళ్లు. బాలు ధ్యాసంతా చదువు మీదైతే...మహాలక్ష్మి ఆలోచనలు బాలూ మీద.అయినా ఒకరంటే ఒకరికి పడదు. చదువు పూర్తయ్యాక ఓ సాఫ్ట్‌వేర్‌ కంపెనీ ఇద్దరికీ ఉద్యోగాలిస్తుంది. ఆ సందర్భంలోనే స్వప్న (తష) పాత్ర ప్రవేశిస్తుంది. అక్కడి నుంచి కథలో మలుపులు చోటుచేసుకొంటాయి. బాలు మీద మహాలక్ష్మికి ఉన్నది ప్రేమా? ఆకర్షణా? మధ్యలో స్వప్న ఏం చేసింది? ఇవన్నీ తెర మీద చూసి తెలుసుకోవల్సిందే.ఇక ఈ చిత్రం గురించి నిర్మాత బన్నీ వాసు మాట్లాడుతూ ''మా చిత్రంలో యూత్ కే కాదు... కుటుంబ ప్రేక్షకులకూ నచ్చే అంశాలు ఉన్నాయి. ప్రేమ, ఆకర్షణ వీటి మధ్య ఎంత దూరం ఉన్నదనే విషయం చాలా సున్నితంగా తెర మీద ఆవిష్కరించాం. నాగచైతన్య-తమన్నాల జంట అందరికీ నచ్చుతుంది. సన్నివేశాలన్నీ సుకుమార్‌ శైలిలో ఉండి.. వినోదం పంచిస్తాయి. దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం జనానికి చేరువైంది. ముఖ్యంగా డియాలో డియాలా పాట ప్రత్యేక ఆకర్షణ అన్నారు.

సంస్థ: గీతా ఆర్ట్స్‌
నటీనటులు: నాగచైతన్య, తమన్నా, తషా, నరేష్‌, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, కె.ఆర్‌.విజయ, విజయ్‌కుమార్‌, ఎమ్మెస్‌ నారాయణ తదితరులు.
సంగీతం: దేవిశ్రీప్రసాద్‌
నిర్మాత: బన్నీ వాసు
రచన-దర్శకత్వం: సుకుమార్‌

English summary
Naga Chaitanya’s latest movie 100% Love releasing today(6 May). Bunny Vaas makes his debut as producer through Geeta Arts banner. Sukumar directed this movie. Tamanna plays female lead. Music scored by Devi Sri Prasad is a huge chart buster.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu