Don't Miss!
- Lifestyle
Super Brain Yoga: సూపర్ బ్రెయిన్ యోగా, దీంతో ఎన్నో ఉపయోగాలున్నాయ్.. తెలుసా?
- News
ప్రతీ ఇంటా "మా నమ్మకం నువ్వే జగన్"...!!
- Finance
DA Hike: ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. కరువు భత్యాన్ని పెంపు.. ఎంతంటే..?
- Sports
INDvsAUS : ఆసీస్‌కు అది అలవాటే.. అది వాళ్ల మైండ్ గేమ్.. అశ్విన్ ఘాటు రిప్లై!
- Travel
సందర్శకులను కనువిందుచేసే కొల్లేరు బోటు షికారు!
- Technology
వన్ ప్లస్ 11 స్పెసిఫికేషన్లు లీక్ ! లాంచ్ మరో రెండు రోజుల్లోనే ...!
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
అక్కినేని వారసత్వం నిలబెట్టిన నాగ చైతన్య 9
అక్కినేని నాగ చైతన్యకు ఈ రోజు స్పెషల్ డే. నేటితో చైతూ ఇండస్ట్రీకి వచ్చి 9 ఏళ్లు పూర్తయింది. అతడు నటించిన తొలి చిత్రం 'జోష్' సెప్టెంబర్ 5, 2009న విడుదలైంది. వాసు వర్మ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మించారు.
తొలి సినిమాతో నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న చైతూ ... ఆ తర్వాతి సంవత్సరం వచ్చిన 'ఏ మాయ చేసేవే' సినిమాతో బ్లాక్ బస్టర్ విజయం తన ఖాతాలో వేసుకున్నాడు. ఆ తర్వాత '100% లవ్' సినిమాతో మరో విజయం సొంతం చేసుకుని... ఇండస్ట్రీలో హీగా స్టాండ్ అవ్వడంతో పాటు అక్కినేని ఫ్యామిలీ నట వారసత్వాన్ని నిలబెట్టాడు.
నాగ చైతన్య కెరీర్లో ఎప్పటికీ గుర్తుండి పోయే స్పెషల్ మూవీ 'మనం'. ఈ చిత్రంలో తాతయ్య అక్కినేని నాగేశ్వరరావు, తండ్రి నాగార్జునతో కలిసి నటించి చైతూ... ఈ సినిమాలో తనతో జతకట్టిన సమంతకు మరింత దగ్గరవ్వడంతో పాటు ఆమె ప్రేమలో పూర్తిగా మునిగిపోయాడు. వీరి వివాహం గతేడాది జరిగిన సంగతి తెలిసిందే.

'ప్రేమమ్' సినిమాతో పాటు మరికొన్ని విజయాలు తన ఖాతాలో వేసుకున్న నాగ చైతన్య..... కొన్ని ప్లాపులు సైతం ఫేస్ చేయక తప్పలేదు. అయితే తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుని నటుడిగా టాలీవుడ్లో పర్మినెంట్ యాక్టర్‌గా సెటిలయ్యాడని చెప్పడంలో ఎలాంటి సందేశం లేదు.
ప్రస్తుతం నాగ చైతన్య నటించిన రెండు సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. మారుతి దర్శకత్వంలో చైతు చేసిన 'శైలజా రెడ్డి అల్లుడు' త్వరలో విడుదల కాబోతోంది. దీంతో పాటు చందూ మొండేటి దర్శకత్వంలో రూపొందుతున్న 'సవ్యసాచి'పై కూడా మంచి అంచనాలున్నాయి.