»   » నాగార్జునకి 'దడ'మొదలైంది

నాగార్జునకి 'దడ'మొదలైంది

Posted By:
Subscribe to Filmibeat Telugu

నాగార్జున కుమారుడు నాగచైతన్య హీరోగా చేసిన దడ చిత్రం ఈ శుక్రవారం విడుదల అవుతున్న సంగతి తెలిసిందే.అయితే ఈ సినిమాపై రామ్ హీరోగా చేసిన కందిరీగ చిత్రం పోటికి వస్తోంది. ఈ నేపధ్యంలో మొదటి సారి యాక్షన్ హీరోగా రంగంలోకి దూకుతున్న నాగచైతన్య కి కాస్త టెన్స్ గానే ఉన్నట్లు చెప్తున్నారు.అంతకన్నా ముందు నాగచైతన్య తండ్రి నాగార్జునకి టెన్షన్ స్టార్టయిందని అంటున్నారు.ఈ చిత్రం ప్రమోషన్ ని స్వయంగా నాగార్జునే పర్యవేక్షిస్తున్నట్లు వినపడుతోంది.అందులోనూ విడుదలకు దగ్గరపడుతున్నా ఊహించిన క్రేజ్ రాకపోవటం కూడా ఇబ్బందికరమైన అంశమే అంటున్నారు.

అయితే కాజల్,నాగచైతన్య జోడీ కావటం,స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ప్రమోట్ చేయటం కలిసివచ్చే అంశమని చెప్తున్నారు.ఈ దడ చిత్రం హిట్టైతే ఇదే రూటులో మరిన్ని యాక్షన్ చిత్రాలు చేయించి యాక్షన్ హీరోగా తన కుమారుడుని నిలబెట్టాలని నాగార్జున ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది.ఇక దడ చిత్రాన్ని అజయ్ భుయాన్ డైరక్ట్ చేసారు.అజయ్ భుయాన్ గత చిత్రం హౌస్ ఫుల్ ఇప్పటికీ ఇంకా విడుదల కాలేదు.అందులో కొన్ని షాట్స్ చూసి ఇంప్రెస్ అయిన నాగార్జున ఈ చిత్రం ఇచ్చినట్లు తెలుస్తోంది.విశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం షూటింగ్ ఎక్కువ భాగం అమెరికాలోనూ,బ్యాంకాక్ లోనూ జరిగింది.లవ్ తో కలిసిన యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ చిత్రం రూపొందిస్తున్నారు.ఇక మరో ప్రక్క నాగచైతన్య బెజవాడ రౌడీలు చిత్రం షూటింగ్ లో బిజీగా ఉన్నారు.

English summary
Nagachaithanya Dhada first look trailer released and the makers wanted to release the film on 12th of August.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu