Just In
- 41 min ago
ఊపిరి పీల్చుకో బాక్సాఫీస్.. మరో కొన్ని నెలల్లో కిక్కిచ్చే సినిమాలతో రాబోతున్న స్టార్ హీరోలు
- 1 hr ago
క్యారెక్టర్ ఆర్టిస్ట్ ప్రగతి మరో షాకింగ్ లుక్.. 16ఏళ్ల కూతురు, ఎక్స్‌పోజింగ్‌తో చంపేసిందిగా..
- 2 hrs ago
RRR పోస్టర్.. ఆ సినిమా నుంచి తస్కరించారట.. రాజమౌళిపై మరోసారి ట్రోలింగ్స్
- 11 hrs ago
ఎస్సీ బాలసుబ్రహ్మణ్యంకు పద్మ విభూషణ్.. గానగంధర్వుడికి ఘన నివాళి
Don't Miss!
- News
నిమ్మగడ్డ అదను చూసి దెబ్బకొట్టారా ? జగన్ కొంపముంచిన నిర్ణయమిదే- టర్నింగ్ పాయింట్
- Sports
మౌమా, సుధా సింగ్‌తో సహా ఏడుగురికి పద్మశ్రీ
- Automobiles
బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ కోసం 50,000 మంది క్యూలో ఉన్నారు..
- Lifestyle
మంగళవారం దినఫలాలు : వ్యాపారులకు ఈరోజు చాలా అదృష్టం కలిసి వస్తుంది...!
- Finance
రూ.50వేలకు దిగువనే బంగారం ధరలు, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
సూపర్బ్: ‘ప్రేమమ్’ రొమాంటిక్ ఫోటోస్...
చైతన్య అక్కినేని, శ్రుతిహాసన్,మడొన్నాసెబాస్టియన్,అనుపమ పరమేశ్వరన్ ల కాంబినేషన్ లో, దర్శకుడు 'చందు మొండేటి దర్శకత్వంలో యువ నిర్మాత సూర్యదేవర నాగవంశీ 'సితార ఎంటర్ టైన్మెంట్స్' పతాకంపై పి.డి.వి ప్రసాద్ సమర్పణలో నిర్మిస్తున్న చిత్రం 'ప్రేమమ్'.
ఇటీవల విడుదలైన ఆడియోకు మంచి స్పందన వస్తోంది. గోపీసుందర్ అందించిన బానీలు కొత్తగా, ఆహ్లాద బరితంగా, రొమాంటిక్ ఉన్నాయనే టాక్ వినిపిస్తోంది. ఇక ట్రైలర్ విడుదలైన తర్వాత సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి.
ఈ చిత్రాన్ని అక్టోబర్ 7న 'దసరా పండుగ' కానుకగా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. తాజాగా విడుదలైన న్యూ ఫోటోస్ ప్రేక్షకుల్లో మరింత ఆసక్తిని పెంచుతోంది. నాగ చైతన్య గతంలో కంటే స్టైలిష్ గా ఈ చిత్రంలో కనిపించబోతున్నాడు.

సుందరాంగులు
శృతి హాసన్, మడోన్నా సెబాస్టియన్, అనుపమ పరమేశ్వరన్ అందం ఈ సినిమాకు అదనపు ఆకర్షణ.

మూడు లవ్ స్టోరీ
సినిమాలో హీరో నాగ చైతన్య పాత్ర చాలా ఆసక్తికరంగా ఉండబోతోంది. మళయాల వెర్షన్లో హీరో జీవితంలో జరిగిన మూడు ప్రేమ కథలను ఆసక్తికరగా ఆ విష్కరించారు. తెలుగులోనూ ఆ మ్యాజిక్ రిపీట్ అవుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు.

30 ఏళ్ళ జీవితంలోని ప్రేమానుభూతులు
31 వ వడిలో ఉన్న ఒక యువకుడి 30 ఏళ్ళ జీవితంలోని ప్రేమానుభూతులను సమాహారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. మళయాల వెర్షన్ చూసిన ఎవరికైనా తెలుగు వెర్షన్ హీరో పాత్రకు నాగ చైతన్య తప్ప మరెవరూ సూట్ కారనే భావన కలుగుతుంది.

ఫస్ట్ లవ్ స్టోరీ
సినిమాలో మొదటి లవ్ స్టోరీ తన టీనేజ్ లో మొదలవుతుంది. అప్పుడు అనుపమ పరమేశ్వరన్ తో ప్రేమలో పడతాడు. అయితే ఆమె మరొకరిని ప్రేమించడంతో ఆ ప్రేమ విఫలం అవుతుంది.

సెకండ్ లవ్ స్టోరీ
ఇక సెకండ్ లవ్ స్టోరీ తన కాలేజీ రోజుల్లో మొదలవుతుంది. తన కాలేజీలో లెక్చరర్ గా పని చేస్తున్న శృతి హాసన్ తో ప్రేమలో పడతాడు. కొంతకాలం తర్వాత ఆమె కూడా హీరోను ప్రేమిస్తుంది. అయితే ఓ యాక్సిడెంటులో ఆమె గతం మరిచిపోతుంది. దీంతో ఈ ప్రేమ కూడా ఫెయిల్ అవుతుంది.

థర్డ్ లవ్ స్టోరీ
30 సంవత్సరాల వయసు వచ్చేసమయానికి బేకరీ నడుపుకుంటూ ఉన్న హీరోకు మడోన్నా సెబాస్టియన్ పరిచయం అవుతుంది. విచిత్రం ఏమిటంటే..... ఈమె తన ఫస్ట్ లవర్ చెల్లెలు. ఆమెను చూసి మనసు పారేసుంటాడు. ఆమెకు విషయం చెబుతాడు. కానీ అప్పటికే ఆమెకు పెళ్లి ఫిక్స్ అవుతుంది.

మరి హీరో ఏం చేసాడు?
మరి మూడు ప్రేమలు విఫలం అయిన తర్వాత హీరో ఏం చేసాడు? ఇంతకీ హీరోకు పెళ్లవుతుందా? అయితే ఎవరితో అవుతుంది? అనేది ఆసక్తికరం.

యూత్ ఫుల్ స్టోరీ
సినిమా ఎవరికి నచ్చినా నచ్చక పోయినా... యూత్ మెచ్చే విధంగా ఉంటుందనడంలో ఎలాంటి సందేహం లేదు. సినిమా మొత్తం ఆ ఏజ్ ఆడియన్స్ మెచ్చే అంశాలతోనే నిండిఉంది.

మనల్ని మనం చూసుకున్నట్లే
మళయాలం వెర్షన్ చూసిన చాలా మంది తమను తామను తెరపై చూసుకున్నట్లు ఉందనే అభిప్రాయం వ్యక్తం చేసారు. తెలుగులోనూ అలాంటి రెస్పాన్సే వస్తుందని ఆశిస్తున్నారు దర్శక నిర్మాతలు.

ఇతర తారాగణం
ఈత్రంలోని ఇతర తారాగణం ఈశ్వరీరావు, జీవా, బ్రహ్మాజీ, శ్రీనివాస రెడ్డి, పృథ్వి, నర్రాశ్రీను, ప్రవీణ్, చైతన్యకృష్ణ, అరవిందకృష్ణ , సత్య,కార్తీక్ ప్రసాద్, నోయల్, జోగి బ్రదర్స్. ఈ చిత్రానికి సంగీతం; గోపిసుందర్, రాజేష్ మురుగేషన్, పాటలు: రామజోగయ్య శాస్త్రి,వనమాలి, శ్రీమణి, పూర్ణ, కృష్ణ మాదినేని;

టెక్నీషియన్స్
చాయా గ్రహణం: కార్తీక్ ఘట్టమనేని
ఎడిటింగ్: కోటగిరి వెంకటేశ్వర రావు
ఆర్ట్: సాహి సురేష్
ఒరిజినల్ స్టోరి: ఆల్ఫోన్సె పుధరిన్
సమర్పణ: పి.డి.వి. ప్రసాద్
నిర్మాత: సూర్యదేవర నాగవంశీ
స్క్రీన్ ప్లే - మాటలు - దర్శకత్వం: చందు మొండేటి