For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  నాగచైతన్య 'సాహసం శ్వాసగా సాగిపో..' చిత్రం టీజర్ (వీడియో)

  By Srikanya
  |

  హైదరాబాద్‌: గౌతమ్‌ వాసుదేవ్‌ మీనన్‌ దర్శకత్వంలో అక్కినేని నాగచైతన్య హీరోగా తెరకెక్కుతున్న చిత్రం 'సాహసం శ్వాసగా సాగిపో'. ఈ చిత్రం ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ను నాగచైతన్య ట్విట్టర్‌ ద్వారా అభిమానులతో పంచుకున్న సంగతి తెలిసిందే. అదేవిధంగా చిత్రం టీజర్‌ను ఆయన తండ్రి అక్కినేని నాగార్జున పుట్టినరోజు సంర్భంగా శనివారం సాయంత్రం విడుదల చేసారు. ఎ.ఆర్‌.రెహమాన్‌ చిత్రానికి సంగీతం సమకూరుస్తుండగా, రచయిత కోన వెంకట్‌ సమర్పకులుగా వ్యవహరిస్తున్నారు. ఆ టీజర్ ని ఇక్కడ చూడండి.

  ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

  రొమాంటిక్ యాక్షన్ ఎంటర్టెనర్ గా ఈ చిత్రాన్ని ప్లాన్ చేస్తున్నారు. ఫస్ట్ లుక్ లో రోడ్డుపై బైక్ ఉండటాన్ని బట్టి ఇదొక అడ్వెంచరస్ రోడ్ ట్రిప్పుకు సంబంధించిన కాన్సెప్టుతో సాగుతుందని స్పష్టమవుతోంది. అయితే టైటిల్ లోగోలో ‘సాగిపో'..అనేది ‘పారిపో' అనిపించేలా డిజైన్ చేసారు. దీన్ని బట్టి సినిమాలో సాహసం శ్వాసగా సాగిపోతాడా... లేక పారిపోతాడా? అనేది ఆసక్తికరంగా మారింది.

  గౌతమ్ మీనన్ సినిమాలు చూస్తూ ఆయన సినిమాల్లో హీరోను కావాలనుకున్నాను. ఆయన దర్శకత్వంలో నటించే అవకాశం వస్తుందా అనుకుంటున్న సమయంలో 2009లో వచ్చిన ఏమాయ చేసావే చిత్రంతో నా కల నెరవేరింది. గౌతమ్‌మీనన్‌తో సినిమా అన్నప్పుడు నమ్మలేకపోయాను. అలాంటి దర్శకుడితో మరోసారి పనిచేయడం ఆనందంగా వుంది అన్నారు నాగచైతన్య. ఈ చిత్ర టీజర్‌ను శనివారం హైదరాబాద్‌లో డి.సురేష్‌బాబు విడుదల చేశారు.

  ఈ సందర్భంగా నాగచైతన్య మాట్లాడుతూ ఏమాయ చేసావే సినిమాతో నేను ప్రేమకథా చిత్రాలకు బాగా సూటవుతానని గౌతమ్ మీనన్ నిరూపించారు. ప్రేక్షకుల్లో కూడా నా సినిమా అంటే మంచి క్రేజ్ మొదలైంది. ప్రేమకథా చిత్రాల్ని గౌతమ్ మీనన్ ఏవిధంగా తెరకెక్కిస్తారో యాక్షన్ ఎంటర్‌టైనర్‌లని కూడా అదే స్థాయిలో రూపొందిస్తారన్న పేరుంది.

  Naga Chaitanya's Saahasam Swaasaga Saagipo Teaser

  ఈ సినిమాలో ఫస్ట్‌హాఫ్ అంతా ఏమాయ చేసావే ఫ్లేవర్‌తో సాగితే సెకెండ్‌హాఫ్ యాక్షన్ నేపథ్యంలో వుంటుంది. ఇలా రెండు రకాల నేపథ్యంలో వున్న సినిమా ఒక నటుడిగా నాకు దక్కడం ఆనందంగా వుంది. ఈ సినిమా రిలీజ్ కోసం ఎదురు చూస్తున్నాను అన్నారు. గౌతమ్ మీనన్ మాట్లాడుతూ కథకు అనుగుణంగానే టైటిల్‌ని పెట్టడం జరిగింది.

  ఈ టైటిల్ రేష్మా ఘటాల సూచించారు. ఇప్పటి వరకు 70 శాతం చిత్రీకరణ పూర్తయింది. రెహమాన్ ఆరు అద్భుతమైన పాటలిచ్చారు. సినిమాలో మాత్రం నాలుగు పాటలే వుంటాయి. మంజిమ మోహన్ బ్రిలియెంట్ నటి. ఈ సినిమా తరువాత అంతా ఆమె ప్రేమలో పడిపోతారు. అంత అద్భుతంగా నటించింది అన్నారు.

  సహజత్వానికి దగ్గరగా తెరకెక్కిన ఈ సినిమా రోటీన్ కమర్షియల్ ఫార్ములాను బ్రేక్ చేస్తుంది అని కోన వెంకట్ తెలిపారు. గౌతమ్ మీనన్, ఏ.ఆర్.రెహమాన్ వంటి గ్రేట్ టెక్నీషియన్‌లతో కలిసి తొలి సినిమా చేయడం గర్వంగా వుంది అని నిర్మాత రవీందర్‌రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో రేష్మా ఘటాల, సునీత తాటి, కెమెరామెన్ డాన్ మకార్థూర్ తదితరులు పాల్గొన్నారు.

  ‘ఏ మాయ చేసావె' చిత్రం తెలుగులో నాగ చైతన్య, తమిళంలో శింబు చేసినట్లే.... ‘సాహసం శ్వాసగా సాగిపో' కూడా తెలుగులో చైతన్య, తమిళంలో శింబు చేయబోతున్నారు. ‘ఏ మాయ చేసావె' టైటిల్ మాదిరిగానే ఈ టైటిల్ కూడా ఒక్కడు మూవీ సాంగ్ లిరిక్ నుండి తీసుకున్నదే కావడం గమనార్హం.

  ఈ సినిమాకు ఎం రవీందర్ రెడ్డి నిర్మాత. సునితా తాటికి చెందిన గురు పిల్మ్స్ బేనర్లో కోన వెంకట్ సమర్పకుడిగా ఈ సినిమా తెరకెక్కబోతోంది. ఏఆర్ రెహమాన్ సంగీతం అందించబోతున్న ఈ చిత్రానికి గౌతం మీనన్ దర్శకత్వం

  English summary
  Saahasam Swaasaga Saagipo is a south indian Telugu film directed by acclaimed film maker Gautham Vasudev Menon, starring Akkineni Naga Chaitanya, Manjima Mohan and Baba Sehgal. Music for this film is composed by the Academy and BAFTA award winner A.R.Rahman
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X