»   » పవర్ఫుల్ అండ్ ఇంట్రస్టింగ్: నాగచైతన్య సవ్యసాచి ఫస్ట్ లుక్

పవర్ఫుల్ అండ్ ఇంట్రస్టింగ్: నాగచైతన్య సవ్యసాచి ఫస్ట్ లుక్

Posted By:
Subscribe to Filmibeat Telugu

శరీరానికి కుడి, ఎడమ వైపులలో వున్న అనుబంధ అంగాలను (చేతులు, కాళ్ళు, కళ్ళు) సమాన స్థాయిలో ఉపయోగించగలిగే స్థితిని సవ్యసాచిత్వం (ఆంబిదెక్ష్తిరిత్య్) అంటారు. రెండు అంగాలనూ ఉపయోగించగల సామర్ధ్యాన్ని ప్రదర్శించే రకాలలో ఇది చాలా ప్రసిద్ధి చెందినది. అయితేరెండు చేతులనూ సమానంగా ఉపయోగించగల వారు చాలా అరుదుగా ఉంటారు. వందమందిలో ఒక్కరికి మాత్రమే సహజంగా ఈ సామర్థ్యం ఉంటుంది. ఒక్కో చేతితో కనపరచగలిగే ప్రజ్ఞ ఆధారంగా ఒక వ్యక్తి యొక్క సవ్యసాచిత్వాన్ని నిర్ధారిస్తారు.

ప్రేమమ్

ప్రేమమ్

‘ప్రేమమ్' చిత్ర విజయంతో నాగ చైతన్య కెరీర్ ఎంతలా ఊపందుకుందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఈ సినిమాతో చైతన్యకు సక్సెస్ తో పాటు ప్రత్యేకమైన ఇమేజ్ కూడా దక్కింది. అందుకే చైతన్య ఆ చిత్రాన్ని డైరెక్ట్ చేసిన చందూ మొండేటితో మరో సినిమాను చేయనున్నాడు.

Srinu Vaitla next movie with Naga Chaitanya | Filmibeat Telugu
సవ్యసాచి

సవ్యసాచి

యాక్షన్ ఎంటర్టైనర్ గా ఉండనున్న ఈ సినిమాకు ‘సవ్యసాచి' అనే టైటిల్ ఫిక్స్ చేసి ఇవాళ ఫస్ట్ లుక్ కూడా వదిలారు. ఈ సినిమా లోగో లుక్ ను ఈరోజు విడుదల చేసిన మేకర్లు.. నాగ చైతన్య తన రెండు చేతుల్లోనూ చెరో బాణాన్ని పట్టుకున్నట్లు ఒక ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ చేశారు.

డైరక్టర్ చందూ మొండేటి

డైరక్టర్ చందూ మొండేటి

ఇక పురాణాల విషయానికొస్తే.. రెండు చేతులతో బాణాలు సమర్ధవంతంగా వేసే అర్జునుడిని.. సవ్యసాచి అని పిలుస్తారు. మొత్తానికి ఈ సినిమాలో నాగ చైతన్య క్యారెక్టర్ ను తెలుపడానికి పురాణాల్లో నుండి తవ్వి తీసిన పేరును పెట్టాడంటే.. డైరక్టర్ చందూ మొండేటి నిజంగానే ఇక్కడే తన మొదటి సక్సెస్ కొట్టేసినట్లు.

మహాభారతంలో అర్జునుడు

మహాభారతంలో అర్జునుడు

మహాభారతంలో అర్జునుడికి ‘సవ్యసాచి' అనే బిరుదుండేది. మరి ఈ పేరును ఎంచుకున్నారంటే సినిమాలో కొత్త తరహా కాన్సెప్ట్ ఏదో ఉంటుందనే అనిపిస్తోంది. ఇకపోతే ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ నిర్మించనున్నారు. మంచి రోజులు దాటకుండా టైటిల్, ఫస్ట్ లుక్ ప్రకటించేసి, మరి కొద్ది రోజుల్లో షూటింగ్ స్టార్ట్ చేస్తున్నారు. చాలా కీలకమైన పాయింట్ తో దర్శకుడు చందు మొండేటి కథ తయారు చేసాడట.

డిఫరెంట్ పాయింట్

డిఫరెంట్ పాయింట్

అసలు ఇలా సవ్యసాచి అని పేరు పెట్టాడంటే మనోడు ఎలాంటి కథతో ఈ సినిమాను తీస్తున్నాడా అనే ఆసక్తి పెరిగిపోతోంది. ఎందుకంటే జంతువలను కూడా హిప్నటైజ్ చేయొచ్చు అంటూ చందూ తీసిన కార్తికేయ ధియేటర్లలో పిచ్చెత్తించింది. అందుకే ఇప్పుడు సవ్యసాచి అనే టైటిల్ పెట్టాడంటే ఖచ్చితంగా ఈ సినిమాలో కూడా ఏదో డిఫరెంట్ పాయింట్ డీల్ చేస్తున్నాడనే అనిపిస్తోంది.

లోగో డిజైన్ లో ఒక చేతి ముద్ర

లోగో డిజైన్ లో ఒక చేతి ముద్ర

అలాగే లోగో డిజైన్ లో ఒక చేతి ముద్ర కూడా ఉంది. అది చూస్తుంటే మాత్రం ఇదేదో డిఫరెంట్ యాక్షన్ ఎంటర్టైనర్ అనిపించకమానదు. ఇకపోతే మైత్రి మూవీస్ వారు నిర్మిస్తున్న ఈ సినిమాలో ఒక బాలీవుడ్ హీరోయిన్ నటిస్తోంది అని తెలుస్తోంది. అది సంగతి.

English summary
Titled Savya Saachi, the movie will be directed by Chandoo Mondeti of Karthikeya and Premam fame and the movie’s first look poster has been released today
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu