For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ప్రభుత్వ నిర్ణయంపై నాగబాబు సెటైర్: ప్రమాదం తప్పదని హెచ్చరిక.. పప్పులో కాలేసిన మెగా బ్రదర్‌

  |

  సుదీర్ఘ కాలంగా తెలుగు సినీ ఇండస్ట్రీలో తన మార్కును చూపిస్తూ దూసుకుపోతున్నారు మెగా బ్రదర్ నాగబాబు. హీరోగా, సహాయ నటుడిగా, నిర్మాతగా ఎన్నో సినిమాలను ప్రేక్షకులకు అందించిన ఆయన.. ప్రస్తుతం పరిశ్రమలో పెద్దగా మెలుగుతున్నారు. ఈ నేపథ్యంలోనే సమాజంలో జరిగే ఎన్నో అంశాపై స్పందిస్తుంటారు. ఫలితంగా తరచూ వార్తల్లో నిలుస్తుంటారాయన. ఈ క్రమంలోనే తాజాగా ట్విట్టర్‌లో ప్రభుత్వ తీరును విమర్శిస్తూ ట్వీట్ చేశారు. అయితే, ఈ విషయంలో నాగబాబు పప్పులో కాలేశారంటూ ఆయనపై ట్రోల్స్ వస్తున్నాయి. ఆ వివరాలు మీకోసం!

  అప్పటి నుంచి ఇప్పటి వరకూ హవా

  అప్పటి నుంచి ఇప్పటి వరకూ హవా

  మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘రాక్షసుడు' అనే సినిమాతో నటుడిగా ఎంట్రీ ఇచ్చారు నాగబాబు. అప్పటి నుంచి ఇప్పటి వరకూ ఎన్నో సినిమాల్లో నటించారాయన. అంతేకాదు, నిర్మాతగానూ పలు సినిమాలను తీశారు. సుదీర్ఘమైన కెరీర్‌లో ఉత్తమమైన పాత్రలను చేసిన ఆయన.. కొన్ని సినిమాలను వన్ మ్యాన్ షోగా మార్చుకున్నారు. అంతలా మెగా బ్రదర్ తన ప్రభావాన్ని చూపించారు.

  కనిపించని నాగబాబు.. ఫ్యాన్స్ నిరాశ

  కనిపించని నాగబాబు.. ఫ్యాన్స్ నిరాశ

  సినీ రంగంలో సుదీర్ఘ కాలంగా కొనసాగుతోన్న నాగబాబు.. బుల్లితెరపైకి కూడా ఎంట్రీ ఇచ్చారు. ఈ క్రమంలోనే పలు సీరియళ్లలోనూ నటించారు. అదే సమయంలో కొన్ని షోలకు జడ్జ్‌గా వ్యవహరించారు. మరీ ముఖ్యంగా జబర్ధస్త్‌లో చాలా కాలం పాటు కొనసాగారు. ఇలాంటి పరిస్థితుల్లో కొన్ని రోజులుగా నాగబాబు టెలివిజన్‌పై కనిపించడం లేదు. దీంతో ఫ్యాన్స్ నిరాశగా ఉన్నారు.

  అందులో పోస్టులు.. వివాదాలు కూడా

  అందులో పోస్టులు.. వివాదాలు కూడా

  సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉండే నాగబాబు.. సమాజంలో జరిగే ఎన్నో విషయాలపై తనదైన శైలిలో స్పందిస్తూ ఉంటారు. లోకల్ విషయాలతో పాటు జాతీయ స్థాయి అంశాలపైనా అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు. ఈ క్రమంలోనే ఎన్నోసార్లు వివాదాల్లోనూ చిక్కుకున్నారు. అయినప్పటికీ తన గొంతును నిర్భయంగా చెబుతుంటారు. తద్వారా తరచూ వార్తల్లో నిలుస్తున్నారు.

  Hero Nikhil ఎమోషనల్.. మిగిలింది అదొక్కటే.. అందరికీ ఇచ్చి పడేశాడు!! || Filmibeat Telugu
  ప్రభుత్వ నిర్ణయంపై నాగబాబు సెటైర్

  ప్రభుత్వ నిర్ణయంపై నాగబాబు సెటైర్

  మెగా బ్రదర్ నాగబాబు తరచూ ఏదో విషయంపై స్పందిస్తుంటారన్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే ఉత్తరఖండ్‌ రాష్ట్రంలో ప్రతి ఏడాది జరిగే కన్వర్ యాత్ర గురించి ట్విట్టర్ ద్వారా స్పందించారు. ఈ మేరకు ఆ యాత్రపై కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ప్రస్తావిస్తూ విమర్శలు చేశారు. ఇలా చేయడం వల్ల కరోనా ప్రభావం మరింత పెరుగుతుందని వ్యాఖ్యానించారు.

  ఆ ప్రమాదం తప్పదంటూ హెచ్చరికలు

  ఆ ప్రమాదం తప్పదంటూ హెచ్చరికలు

  కన్వర్ యాత్ర గురించి స్పందిస్తూ.. ‘ఇండియా కరోని మూడో దశను కంట్రోల్ చేయగలుగుతుంది అని నమ్మకం ఉండేది. కానీ ఉత్తరఖండ్‌లో జరగబోతున్న కన్వర్ యాత్ర అనుమతి ఇవ్వటం వల్ల మూడో దశ ప్రమాదం తప్పేటట్లు లేదు. అంటే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వానికి రెండో మార్గాలు ఉన్నాయి. ఒకటి యాత్రను రద్దు చేయాలి లేదా థర్డ్ వేవ్‌ను ఆపగలగాలి' అని నాగబాబు ట్వీట్ చేశారు.

  పప్పులో కాలేసిన మెగా బ్రదర్‌.. ట్రోల్స్

  పప్పులో కాలేసిన మెగా బ్రదర్‌.. ట్రోల్స్

  కన్వర్ యాత్రకు అనుమతి ఇచ్చిందంటూ కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు చేసిన నాగబాబుకు నెటిజన్లు షాకిచ్చారు. దీనికి కారణం ఈ యాత్రకు ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు. అంతేకాదు, ఇప్పటికే దీనిపై అధికారిక ప్రకటన కూడా వెలువడింది. దీని తాలూకు మంత్రి చేసిన వ్యాఖ్యలను పోస్ట్ చేస్తూ నాగబాబును విమర్శిస్తున్నారు. దీంతో ఈ అంశం విపరీతంగా హాట్ టాపిక్ అయిపోయింది.

  English summary
  Senior Actor, Mega Brother Nagababu Very Active in Social Media. Now He Posted a Tweet about Kanwar Yatra and Criticised to Govt of India.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X