»   » అక్కలు నిర్మాతలైతే-తమ్ముళ్లు హీరోలా!

అక్కలు నిర్మాతలైతే-తమ్ముళ్లు హీరోలా!

Posted By:
Subscribe to Filmibeat Telugu

సూపర్ స్టార్ కృష్ణ కుమార్తె మంజుల హీరోయిన్ గా తన తమ్ముడు మహేష్ బాబుతో ఇప్పటికి రెండు చిత్రాలు నిర్మించారు. 'నాని", 'పోకిరి" అనే రెండు చిత్రాల్లో..దర్శకుడు పూరి జగన్నాధ్ తో కలిసి మంజుల సంయుక్తంగా నిర్మించిన 'పోకిరి" ఎంతటి సంచలన విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. ఆ తర్వాత 'కావ్యాస్ డైరీ"..తాజాగా 'ఏమాయ చేసావె" చిత్రాలు నిర్మించి నిర్మాతగా తన సత్తా ఏమిటో నిరూపించుకున్న మంజుల.. రెట్టించిన ఉత్సాహంతో తన తమ్ముడు మహేష్ బాబుతో మరో చిత్రాన్ని నిర్మించేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు.

డా అక్కినేని కుమార్తె...నాగసుశీల కూడా తన తమ్ముడు నాగార్జునతో ఓ చిత్రాన్ని నిర్మించనున్నారంటూ వార్త వెలువడడం తెలిసిందే పూర్వాశ్రమంలో పాత్రికేయులయిన..చింతలపూడి శ్రీనివాసరావుతో కలిసి తన తనయుడు సుశాంత్ తో ఇప్పటికి 'కాళిదాసు", 'కరెంట్" చిత్రాలను నిర్మించిన నాగసుశీల తాజాగా తన తనయుడితో జి.నాగేశ్వరరెడ్డి దర్శకత్వంలో మూడో చిత్రాన్ని నిర్మించేందుకు సమాయత్తమవుతూనే తన తమ్ముడు నాగార్జునతో మొదటి చిత్రాన్ని నిర్మించేందుకు ఏర్సాట్లు చేసుకుంటున్నారు. శ్రీనాగ్ కార్బొరేషన్ పతాకంపై అన్నపూర్ణ స్టూడియోస్ సమర్సణలో చింతలపూడి శ్రీనివాసరావుతో కలిసి శ్రీమతి నాగసుశీల నిర్మించే చిత్రానికి సంబంధించిన వివరాలు అధికారికంగా ఈ వారంలోనే వెల్లడికానున్నాయి.

అదేవిధంగా డాఅక్కినేని మనవరాలు సుప్రియ కూడా తన తమ్ముడు సుమం త్‌తో రెండేళ్ల క్రితం 'పౌరుడు" చిత్రాన్ని నిర్మించారు. అంతేకాదు చాలా కాలంగా సుప్రియ అన్నపూర్ణ స్టూడియోకు ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు. అలాగే డామోహన్‌బాబు కుమార్తె లక్ష్మీప్రసన్న కూడా తన తమ్ముళ్లు విష్ణు, మనోజ్‌లతో చిత్రాలు నిర్మిస్తుండడం తెలిసిందే. మరి.. వీరిని స్ఫూర్తిగా తీసుకుని ఇంకెంతమంది అక్కయ్యలు, చెల్లెమ్మలు నిర్మాతలుగా మారతారో వేచి చూడాల్సిందే!

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu