ఆ.. పవర్ కోల్పోతున్న నాగార్జున
తన సినిమాల ద్వారా ఎంతో మంది కొత్త దర్శకులను పరిచయం చేసిన నాగార్జున.....కొత్త దర్శకుల ఎంపికలో మంచి ముందు చూపు ఉన్న హీరోగా పేరు తెచ్చుకున్నాడు. నాగార్జున సినిమాల ద్వారా సినీ పరిశ్రమకు పరిచయమైన రామ్ గోపాల్ వర్మ, వైవిఎస్ చౌదరి, దశరథ్, లారెన్స్ మంచి దర్శకులుగా ఎదిగారు.
అయితే రానురాను నాగార్జునలో ముందు చూపు పవర్ తగ్గుతుందనే విమర్శలు వినిపిస్తున్నాయి. తన గత సినిమా కేడి గమనించినా, తన తనయుడు నాగచైతన్య హీరోగా వచ్చిన జోష్, దడ సినిమాలు పరాజయం పాలైన విషయం పరిశీలించినా ఈ విషయం స్పష్టం అవుతోంది. జోష్ సినిమాఃను వాసువర్మ, కేడి మూవీని కిరణ్, దడ చిత్రాన్ని అజయ్ భూయాన్ ప్రేక్షక రంజకంగా తెరకెక్కించడంలో విఫలం అయ్యారు. ఈ దర్శకులను ఎంపిక చేసింది నాగార్జునే కాబట్టి ఆయనలో దర్శకుల సామర్థ్యాన్ని అంచనా వేసే శక్తి తగ్గుతుందనే వాదన వినిపిస్తోంది.


Click it and Unblock the Notifications











