twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నాగార్జునకి ఇది సిల్వర్ జూబ్లి ఇయర్!

    By Sindhu
    |

    సినీ రంగ ప్రవేశంలో డా. అక్కినేని నటవారసుడు నాగార్జున 24సంవత్సారాలు విజయవంతంగా పూర్తి చేసుకుని నేడు 25వ వసంతంలోకి ప్రవేశించారు. అమెరికాలో ఇంజనీరింగ్ చేసినా ఉద్యోగం అవకాశాలు కోసం ఎదురు చూడకుండా తానే సినీ నిర్మాణంలోకి అడుగు పెట్టాలని భావించినా అన్న వెంకట్ ప్రోత్సాహంతో తండ్రి అనుమతితో హిందీ హీరోని రీమేక్ చేసి తనే హీరో గా సీనియర్ దర్శకుడు దగ్గుబాటి మధుసూధనరావు దర్శకత్వంలో తెలుగులో 'విక్రమ్" గా రూపొందించారు. ఈ చిత్రాన్నిమే 24న 1986లో 28కేంద్రాల్లో విడుదలై పూర్తి విజయాన్ని సాదించింది. తర్వాత 'శివ" హిందీ రీమేక్ ద్వారా నాగార్జున బాలీవుడ్ కు సైతం పరిచయమయ్యారు. ఆయన సినీ రంగప్రవేశం తేలిగ్గానే జరిగినా నటుడిగా నిలదొక్కుకున్నది స్వయంకృతోనే. ఎప్పటికప్పుడు తన నటజీవితాన్ని స్థిరపరుచుకోవడానికి ఆవిశ్రాతంగా తనదైన శైలిలో కృషి ఫలితంగా 'మజ్ఝ", 'ఆఖరిపోరాటం", 'గీతాంజలి", 'శివ" వంటి చిత్రాలతో స్టార్ అయ్యారు.

    1989లో విడుదలైన 'శివ" చిత్రం అంతకుముందున్న రికార్డులన్నీ బద్దలు కొట్టి విడుదలైన అన్ని కేంద్రాలలో శతదినోత్సవం జరుపుకుంది. తమిళనాడులో 'ఉదయం" పేరుతో విడుదలైన 'శివ" అక్కడ కూడా 22 కేంద్రాలలో శతదినోత్సవం జరుపుకుంది. 'శివ" హిందీ రీమేక్ ద్వారా బాలీవుడ్ కు నాగ్ పరిచయ్యమయ్యారు. నటుడిగా కాదు నిర్మాతగా కూడా ఆయన కొత్తదనాన్ని కోరుకుంటారు. కొత్త దర్శకులను, సాంకేతిక నిఫుణులను పరిచయం చేయడంలో, ప్రోత్సహించడంలో ముందుంటారు. 'నిన్నే పెళ్లాడతా" చిత్రంతో కుటుంబ కథానాయకుడిగా అందరినీ అలరిస్తే 'అన్నమయ్య"గా, 'రామదాసు" గా అత్యుత్తమ అభినయం ప్రదర్శించి ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేశారు. ఆయన నటజీవితంలో ఈ రెండూ చిత్రాలు చిరస్థాయిగా నిలిచిపోతాయనడంలో సందేహం లేదు. అందుకే నటుడిగా నాగార్జునకిది సిల్వర్ జూబ్లి ఇయర్ అనటం సమంజసమే..

    తన వారసులు హీరోలుగా వస్తున్నా...నాగార్జున మరిన్ని మంచి చిత్రాల్లో నటించాలని దట్స్ తెలుగు మనసారా కోరుకుంటోంది.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X