»   » నమిత, ఫర్జానా హీరోయిన్స్ గా....

నమిత, ఫర్జానా హీరోయిన్స్ గా....

Posted By:
Subscribe to Filmibeat Telugu

నమిత, ఫర్జానా హీరోయిన్స్ గా శరత్ ‌కుమార్‌ హీరోగా నటించిన డబ్బింగ్ చిత్రం '1977'. జయసుధ కీలక పాత్రలో నటించిన ఈ సినిమాకి సంబంధించిన గీతాల్ని ఇటీవల హైదరాబాద్‌లో ఆవిష్కరించారు. జయసుధ తొలి సీడీని విడుదల చేసి తమ్మారెడ్డి భరద్వాజకి అందజేశారు. "రాజకీయాల్లోకి ప్రవేశించక ముందు అంగీకరించి నటించిన చిత్రమిది. యాక్షన్‌ అంశాలకు పెద్ద పీట వేశారు. విద్యాసాగర్‌ సంగీతం బాగుందన్నారు జయసుధ." 1977వ సంవత్సరంలో ఏం జరిగిందన్నే అంశమే ఈ కథకి ప్రాణం. ప్రతి సన్నివేశం ఉత్కంఠ కలిగిస్తుందన్నారు దర్శకుడు. సుప్రీమ్‌ ఫిల్మ్‌ వర్క్స్‌ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించింది. మధుర ఆడియో ద్వారా పాటలు విడుదలయ్యాయి.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu