»   » ప్రాడ్ కేసుల నిర్మాతతో నమిత ఏం పాడు పని...

ప్రాడ్ కేసుల నిర్మాతతో నమిత ఏం పాడు పని...

Posted By:
Subscribe to Filmibeat Telugu

భారీ అందాల నమిత తాజాగా ఫైర్ అనే చిత్రం కమిటయింది. అయితే నిర్మాత,దర్శకుడు మరెవరో కాదు ఎస్.కె.బషీద్. ఇప్పటికే ఎన్నో ప్రాఢ్ కేసుల్లో ఉన్న ఆయన ఈ చిత్రాన్ని ప్రారంభిస్తున్నాడనగానే నమిత తెలిసి ఈ ట్రాప్ లోకి వచ్చిందా లేక డబ్బులు కోసం ఒప్పుకుందా అనే సందేహం అందరికీ వచ్చింది. ఇక బషీద్ డైరక్ట్ చేసిన చిత్రం రామ్ దేవ్ రెండు వారాల క్రితం రిలీజై డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. ఇక నమిత ప్రధానపాత్రలో రూపొందే 'ఫైర్‌" అక్టోబర్‌ తొలి వారంలో ప్రారంభమ వుతోంది. దర్శకుడు ఎస్‌.కె.బషీద్‌, నిర్మాత కరీమున్నీసా కాంబి నేషన్‌లో రూపొందే రెండో చిత్రమిది. దర్శకుడు బషీద్‌ మాట్లాడుతూ 'రెండు షెడ్యూళ్లలో చిత్రీకరణ ముగిస్తాం. ఆస్ట్రేలియా, హాంకాంగ్‌లో షూటింగ్‌ ఉంటుంది. ఇంతవరకూ రాని మాస్‌ యాక్షన్‌ తరహా చిత్రమిది. వచ్చే ఏడాది విడుదల చేస్తాం" అన్నారు. ఎస్‌.కె.అబ్ధుల్లా సమర్పించే ఈ చిత్రానికి కెమెరా: మధు.కె.నాయుడు, మాటల సహకారం: సాయినాథ్‌, కథ-కథనం-మాటలు-దర్శకత్వం:ఎస్‌.కె. బషీద్‌. నమిత,బషీద్ కాంబినేషన్..సినిమా ఎలా ఉంటుందో ఇక చూడాలి.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu