»   » బాలయ్య బాబుదే మొదటి కాంప్లిమెంట్

బాలయ్య బాబుదే మొదటి కాంప్లిమెంట్

Posted By:
Subscribe to Filmibeat Telugu

బాలయ్య బాబు నుంచి మొదటి కాంప్లిమెంట్ అందుకున్నా. 'బాణం' సినిమాలో నా నటనను చూసి ఆయన చాలా ఇంప్రెస్ అయ్యారు. బాగా చేశావని అభినందించారు. ఆయన సలహాలు తీసుకుంటు ఉంటా అంటున్నారు నారా రోహిత్. నారా రోహిత్ పుట్టిన రోజు సందర్భంగా కలిసిన మీడియాతో ఇలా స్పందించారు. అలాగే జూనియర్ ఎన్టీఆర్‌తో తన అనుబంధం గురించి చెబుతూ..సినిమాల్లో బిజీగా ఉండటం వల్ల మీట్ అవ్వడం తక్కువ. అప్పుడప్పుడు కలుస్తుంటాం. చాలా విషయాలు చర్చించుకుంటాం. సినిమాల మీద కూడా డిస్కస్ చేస్తాం. సలహాలు తీసుకుంటా అన్నారు.

తన తదుపరి ప్రాజెక్టులు గురించి చెపుతూ..'సోలో' సినిమా దాదాపు పూర్తి కావచ్చింది. పది రోజుల షూటింగ్ పెండింగ్ ఉంది. ఈ సినిమా తరువాత విజయ్‌కృష్ణ దర్శకత్వంలో నటిస్తున్నా. 'ప్రస్థానం' నిర్మాత ఈ సినిమాను నిర్మిస్తున్నారు. 'సోలో' సినిమాతో పాటు మరో సినిమా చేసే అవకాశం వచ్చింది. అయితే డేట్స్ కుదరకపోవడంతో ఆ సినిమా వదులుకోవాల్సి వచ్చింది అన్నారు.నారా రోహిత్ వదులుకున్న చిత్రం రానా ప్రస్తుతం చేస్తున్న నా ఇష్టం చిత్రం. ఆ చిత్రం కోసం నారా రోహిత్ దాదాపు ఆరు నెలలు పాటు వెయిట్ చేసారు.

English summary
Canning of two songs remained balance to complete the shooting of 'Solo' directed by Parasuram and produced by Vamsi Krishna Srinivas on the banner of SVK Cinema with Nara Rohit as hero.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu