»   » నయనతార ‘అనామిక’ సెన్సార్ రిపోర్ట్

నయనతార ‘అనామిక’ సెన్సార్ రిపోర్ట్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: నయనతార ప్రధాన పాత్రలో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం 'అనామిక'. తాజాగా ఈచిత్రం సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. ఈ చిత్రానికి సెన్సార్ బోర్డు సభ్యులు ఎలాంటి కత్తిరింపులు లేకుండా U/A సర్టిఫికెట్ జారీ చేసారు. త్వరలో ఈచిత్రానికి సంబంధించిన రిలీజ్ డేట్ ప్రకటించనున్నారు.

వయాకమ్‌ 18 మోషన్స్‌ పిక్చర్స్‌, ఎండెమోల్‌ ఇండియా, లాగ్‌లైన్‌ ప్రొడక్షన్స్‌ ప్రై.లిమిటెడ్‌, సెలెక్ట్‌ మీడియా హోల్డింగ్స్‌ సంస్థలు కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ''భర్తను వెతుక్కొంటూ వచ్చిన ఓ యువతి హైదరాబాద్‌ నగరంలో చేసిన పోరాటమే ఈ సినిమా. ఆమె ప్రయత్నం ఫలించిందా లేదా అనేది కీలకాంశం. బాలీవుడ్ మూవీ 'కహానీ' కథకు పలు మార్పులు చేసి ఈ సినిమాని తెరకెక్కించారు.

గతంలో ఓ సారి నయనతార ఈ సినిమా గురించి మాట్లాడుతూ ''స్త్రీ ప్రాధాన్యమున్న సినిమాలో నటించడం చాలా ఆనందాన్నిస్తోంది. అనామికగా కొత్త నయనతారని చూస్తారు. కహాని' సినిమాలో చాలా మార్పులు చేశారు. నా పాత్ర తీరుతెన్నులు కూడా మారాయి. నా శైలిలోనే నటించాను. ఎంత రీమేక్‌ అయినా మార్పులు, చేర్పులూ అవసరం. మక్కీకి మక్కీ తీస్తే చూడ్డానికి ఎవరూ సిద్ధంగా లేరు. ఒక వేళ అలాంటి కథలే నాముందుకు వస్తే అంగీకరించను. శేఖర్‌ శైలి తెలుసు కాబట్టి, ఆయన మార్పులు నచ్చాయి కాబట్టి 'కహాని' ఒప్పుకున్నా'' అన్నారు.

హిందీలో కహానీ...తెలుగు అనామిక

హిందీలో కహానీ...తెలుగు అనామిక

హిందీలో వచ్చిన 'కహానీ'కి ఇది రీమేక్‌. తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి తెరకెక్కించారు. హైదరాబాద్‌లోని చార్మినార్‌, సుల్తాన్‌ బజార్‌, ముర్గి మార్కెట్‌ ప్రాంతాల్లో చిత్రీకరణ జరిగింది. ఆర్ట్ డైరక్టర్ చిన్నా నేతృత్వంలో దుర్గామాత సెట్ ని పద్మారావు నగర్ లో వేసి చిత్రీకరించారు. వైభవ్‌, పశుపతి తదితరులు నటిస్తున్నారు. సంగీతం: ఎం.ఎం.కీరవాణి, కూర్పు: మార్తాండ్‌ కె.వెంకటేష్‌, ఛాయాగ్రహణం: విజయ్‌ సి.కుమార్‌.

హిట్టవుతుందనే నమ్మకం..

హిట్టవుతుందనే నమ్మకం..

ఎండర్ మోల్ ఇండియా, లాగ్ లైన్ ప్రొడక్షన్స్, సెలక్ట్ మీడియా హోల్డింగ్ సంస్థలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ఈ చిత్రంపై మంచి అంచనాలే ఉన్నాయి. బాలీవుడ్ తరహాలో ఇక్కడా హిట్ అవుతుందని భావిస్తున్నారు.

యండమూరి వీరేంద్రనాథ్ సహకారం..

యండమూరి వీరేంద్రనాథ్ సహకారం..

బాలీవుడ్ మూవీ ‘కహానీ'లో విద్యా బాలన్ పోషించిన పాత్రను ఇందులో నయనతార పోషిస్తోంది. ఈ చిత్రానికి ప్రముక నావెలిస్ట్ యండమూరి వీరేంద్రనాధ్ ఈ చిత్రానికి సహాయ రచయితగా పని చేస్తున్నారు. విజయ్ సి. కుమార్ సినిమాగ్రఫీ చేయనున్నారు.

హైదరాబాద్ నేపథ్యం

హైదరాబాద్ నేపథ్యం

కహానీ చిత్రం కోల్ కతా బ్యాక్ డ్రాప్‌తో సాగుతుంది. అయితే ఈ చిత్రాన్ని తెలుగు నేటివిటీకి తగిన విధంగా హైదరాబాద్ ఓల్డ్ సిటీ నేపథ్యాన్ని ఎంచుకున్నాడు దర్శకుడు శేఖర్ కమ్ముల.

మార్పులు చేర్పులు

మార్పులు చేర్పులు

ఈ చిత్రం గురించి శేఖర్ కమ్ముల మాట్లాడుతూ...కహానీ తెలుగు, తమిళం రీమేక్ ప్రేక్షకులకు నచ్చే విధంగా ఉంటుందని, ఇక్కడి నేటివిటీకి తగిన విధంగా కొన్ని మార్పులు చేర్పులు చేసినట్లు వెల్లడించారు.

నయనతార

నయనతార

'చిత్ర పరిశ్రమలోకి నేను అడుగుపెట్టిన రోజులతో పోలిస్తే చాలా మార్పులు కనిపిస్తున్నాయి. అప్పట్లో వాణిజ్య చిత్రాల్లో మాత్రమే అవకాశం దొరికేది. పాటలు, డ్యాన్సులతోనే గడిచిపోయేది. ఇప్పుడు మాత్రం హీరోయిన్ ని కూడా దృష్టిలో పెట్టుకొని పాత్రల్ని తీర్చిదిద్దుతున్నారు. ఇదొక మంచి పరిణామం'' అని చెప్పుకొచ్చింది నయనతార.

హాలీవుడ్ టు బాలీవుడ్ టు టాలీవుడ్

హాలీవుడ్ టు బాలీవుడ్ టు టాలీవుడ్

అనేక హాలీవుడ్ సినిమాల స్ఫూర్తి‌తో చేసిన ఈ సినిమా హిందీలో ఘన విజయం సాధించడంతో తెలుగులో కూడా మంచి విజయం సాధిస్తుందనే నమ్మకంతో ఉన్నారు దర్శక నిర్మాతలు.

కీరవాణి సంగీతం..

కీరవాణి సంగీతం..

ఎమ్‌.ఎమ్‌.కీరవాణి ఈ చిత్రానికి స్వరాలు అందిస్తున్నారు. కీరవాణితో పని చేయడం శేఖర్‌కి ఇదే ప్రథమం. అనామిక చిత్రీకరణ హైదరాబాద్‌ పరిసరాల్లో సాగుతోంది. ఈ చిత్రంలో వైభవ్‌ పోలీసు పాత్రను పోషిస్తున్నారు. ఈ కథలో కీలకమైన పాత్ర ఇది.

English summary
Actress Nayanatara’s suspense thriller ‘Anamika’ has received a U/A from the censor board today.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu