For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  2014 : టాలీవుడ్ కొత్త హీరోయిన్స్(ఫొటో ఫీచర్)

  By Srikanya
  |

  హైదరాబాద్ : ఎప్పటికప్పుడూ ఏదో ఒక కొత్తదనం చూపాలని సినిమావాళ్లు తహతహలాడుతూంటారు. ముఖ్యంగా హీరోయిన్స్ విషయంలో సినిమా పరిశ్రమ కొత్త వాళ్లను ఇంట్రడ్యూస్ చేయటానికి ఉత్సాహం చూపుతూంటుంది.

  కొత్త వాళ్ళను ఇంట్రడ్యూస్ చేయటానికి ప్రధాన కారణం ..రెమ్యునేషన్ తక్కువ ఇవ్వవచ్చు అనేది ఒకటి అయితే...హీరో ఎలాగో చాలా కాలంగా చూస్తున్నవాడే ఉన్నప్పుడు హీరోయిన్ అయినా కొత్త అమ్మాయి అయితే ఫ్రెష్ గా ఉంటుందని దర్శకులు,నిర్మాతలు ఫీలవటం అనేది కారణంగా చెప్పవచ్చు.

  ఇక పెద్ద సినిమాల్లో సెకండ్ హీరోయిన్స్ గా చేసిన వాళ్లను ... చిన్న సినిమాల వాళ్లు తమ సినిమాల్లోకి తీసుకుంటూంరా. ఒక్కోసారి ఈ కొత్త హీరోయిన్స్ ..లీడ్ లో ఉన్న సీనియర్ హీరోయిన్స్ కు కంగారుపుట్టిస్తూంటారు. అయినా ఇప్పుడు ఏలుతున్న హీరోయిన్స్ అంతా..ఒకప్పుడు కొత్తవారే కదా.

  2014 లో పరిచయమై హిట్టైన హీరోయిన్స్ స్లైడ్ షోలో...

  కృతి సనన్

  కృతి సనన్

  ‘నేనొక్కడినే'లో మహేష్ సరసన ఛాన్సును కృతి సనన్‌ ఎగరేసుకుని పోయింది. ఈ ఢిల్లీడాల్‌కు ఇది తొలి చిత్రం. ప్రస్తుతం నాగచైతన్య సరసన నటిస్తున్న ఈ సుందరి ఆ మధ్య టైగర్‌ ష్రాఫ్‌తో ‘హీరోపంతి'(పరుగు రీమేక్) లోనూ నటించింది. హిందీలో ‘సింగ్‌ ఈజ్‌ బ్లింగ్‌', ‘ఫర్జి' చిత్రాలు ఈ పొడుగుకాళ్ల సుందరి చేతిలో ఉన్నాయి.

  అదా శర్మ

  అదా శర్మ

  బాలీవుడ్‌లో ‘1920'తో కెరీర్‌ మొదలు పెట్టిన ఆదాశర్మ తెలుగులో ‘హార్ట్‌ఎటాక్‌' పరిచయం అయ్యింది. నితిన్‌ ‘హార్ట్‌ ఎటాక్‌' హిట్‌ కావడంతో ‘గరం', త్రివిక్రమ్‌ దర్శకత్వంలో అల్లు అర్జున్‌ సినిమాల్లో నటిస్తోంది.

  పూజా హెగ్డే

  పూజా హెగ్డే

  నాగచైతన్య ‘ఒక లైలా కోసం' సినిమాలో తాజాగా కనిపించిన తుళు భామ పూజా హెగ్డే. నాగబాబు తనయుడు హీరోగా పరిచయమవుతున్న ‘ముకుంద' సినిమా అవకాశాన్ని కూడా అందిపుచ్చుకుంది. వచ్చే ఏడాదిలో కనీసం ఐదు నెలల పాటు ‘మొహంజదారో' సినిమాతో బిజీగా ఉండనుందీ ముద్దుగుమ్మ. ‘మొహంజదారో' కోసం ఇటీవల మణిరత్నం సినిమాను సైతం వదిలేశానని చెప్పుకొచ్చిందీ సుందరి.

  అమీ జాక్సన్..

  అమీ జాక్సన్..

  ‘మదరాసుపట్టణం' అనువాద సినిమాతో టాలీవుడ్‌కి పరిచయమైంది అమీ జాక్సన్‌. శంకర్‌ దర్శకత్వంలో విక్రమ్‌ సరసన నటించిన ‘ఐ' సినిమాతో ఈ సుందరి పేరు మారుమోగుతోంది. ‘ఎవడు' సినిమాతో ప్రత్యక్షంగా తెలుగు తెరకు ఈ ఏడాదే పరిచయమైందీ ఫారిన్‌ గర్ల్‌.

  రాశీ ఖన్నా

  రాశీ ఖన్నా

  ‘ఊహలు గుసగుసలాడే' అంటూ హిట్‌ సినిమాతో నాయికగా కెరీర్‌ను ప్రారంభించిన బొద్దు గుమ్మ రాశీఖన్నా. ఇదే ఏడాది ఆమె నటించిన ‘జోరు' కూడా విడుదలైంది. అంతకు ముందే ‘మనం'లో కేమియో కూడా చేసింది. ప్రస్తుతం గోపీచంద్‌ హీరోగా యువీ క్రియేషన్స్‌ తెరకెక్కిస్తున్న చిత్రం పనుల్లో నిమగ్నమై ఉంది రాశీ.

  సీరత్‌కపూర్‌

  సీరత్‌కపూర్‌

  శర్వానంద్‌ కెరీర్‌లో తొలి బిగ్‌ కమర్షియల్‌ హిట్‌ చిత్రం ‘రన్‌ రాజా రన్‌'. ఈ సినిమాలో ఉంగరాల జుట్టు చిన్నది సీరత్‌కపూర్‌ హీరోయిన్ గా పరిచయమైంది. ఇటీవల సందీప్‌కిషన్‌ సరసన ఓ సినిమాకు సంతకం చేసిందని సమాచారం.

  శుభ్ర అయ్యప్ప

  శుభ్ర అయ్యప్ప

  వైవీయస్‌ చౌదరి తెరకెక్కించిన ‘రేయ్‌'తో పరిచయం కావాల్సింది శుభ్ర అయ్యప్ప. ప్రారంభోత్సవ సమయంలో ఈ అమ్మాయి పేరు వినిపించినా అందులో నటించలేదు. విమర్శకుల ప్రశంసలు సైతం పొందిన నారా రోహిత్‌ హిట్‌ సినిమా ‘ప్రతినిధి'తో తెలుగు ప్రేక్షకుల ముందుకొచ్చింది.

  మిస్తీ

  మిస్తీ

  ‘చిన్నదాన నీకోసం' చిత్రంతో నితిన్‌ సరసన ఆడిపాడింది నార్త్‌ బ్యూటీ మిస్తీ. 24 న ఈ చిత్రం విడుదల అవుతోంది.

  వీణామాలిక్

  వీణామాలిక్

  బాలీవుడ్‌లో హాట్‌ హీరోయిన్ గా పేరు పొందిన వీణామాలిక్ ‘నగ్నసత్యం'తో కనిపించింది.

  సన్నిలియోన్

  సన్నిలియోన్

  మరో బాలీవుడ్ భామ సన్నిలోయన్ ‘కరెంట్‌ తీగ'లో టీచర్‌ పాత్రలో సన్ని ప్రేక్షకులను మురిపించారు. ఆమె మీదనే ప్రోమోలు, పోస్టర్స్ కట్ చేసారంటే ఆమె ఎంత క్రేయేట్ క్రియేట్ చేసిందే తెలుస్తోంది.

  పింకి సావిక

  పింకి సావిక

  విదేశీ భామ పింకి సావిక సుమంత్ హీరోగా నటించిన ఏమో గుర్రం ఎగరావచ్చు తో తెలుగుకి పరిచయం అయ్యింది.

  దియానికోలస్‌

  దియానికోలస్‌

  రిలీజ్ కు ముందు క్రేజీ ప్రాజెక్టుగా నిలించిన యమలీల-2 తో పరిచయం అయ్యిందీ విదేశీ భామ.

  క్రిస్టీనా అకీవా

  క్రిస్టీనా అకీవా

  ఆది హీరోగా వచ్చిన గాలిపటంతో ఈ విదేశీ భామ ఈ ఏడాది తెలుగు తెరకు పరిచయమయ్యింది.

  కుంకుం

  కుంకుం

  శ్రీకాంత్ హీరోగా వచ్చిన క్షత్రియతో ఈ ముద్దుగుమ్మ తెలుగుకి పరిచయం అయ్యింది.

  శ్రావ్య

  శ్రావ్య

  మారుతి నిర్మాణ సారధ్యంలో వచ్చిన లవ్‌ యు బంగారం చిత్రంతో పరిచయం అయ్యిందీ భామ.

  మనోచిత్ర

  మనోచిత్ర

  శ్రీకాంత్ హీరోగా వచ్చిన మల్లిగాడు మ్యారేజ్‌బ్యూరో చిత్రంతో పరిచయమయ్యిందీ ఈ అమ్మాయి.

  రీతువర్మ

  రీతువర్మ

  నవీన్ చంద్ర హీరోగ వచ్చిన నా రాకుమారుడు చిత్రంతో పరిచయమయ్యింది ఈమె.

  అలీషాభేగ్‌

  అలీషాభేగ్‌

  బ్రహ్మానందం కుమారుడు గౌతమ్ హీరోగా వచ్చిన బసంతి తో పరిచయం అయ్యిందీమె.

  ప్రియదర్శిని - జాస్మిన్‌

  ప్రియదర్శిని - జాస్మిన్‌

  పూరి జగన్నాథ్ తమ్ముడు సాయిరామ్ శంకర్ చిత్రం దిల్లున్నోడు తో వీరిద్దరూ పరిచయం అయ్యారు.

   కైనాజ్‌ మోతీవాలా

  కైనాజ్‌ మోతీవాలా

  శివాజి హీరోగా వచ్చిన బూచమ్మ బూచోడు తో పరిచయం అయ్యిందీమె.

  బార్బీ

  బార్బీ

  ఇండియన్ ఐడియా శ్రీరామ చంద్ర హీరోగా వచ్చిన ప్రేమాగీమాజాన్‌తా నయ్ తో పరిచయం అయ్యిందీమె.

  ఉలవచారు బిర్యాని ద్వారా

  ఉలవచారు బిర్యాని ద్వారా

  సంయుక్త ప్రకాష్ రాజ్ ప్రధాన పాత్రలో వచ్చిన ఉలవచారు బిర్యాని ద్వారా తెలుగుకి పరిచయం అయ్యిందీమె.

  అవంతిక

  అవంతిక

  నీలకంఠ దర్శకత్వంలో వచ్చిన థ్రిల్లర్ మాయతో పరిచయమయ్యిందీమె.

  ఎరిక

  ఎరిక

  ఆది చిత్రం గాలిపటంతో పరిచయం అయ్యిందీ ఈ హీరోయిన్.

  సన

  సన

  అజయ్ ప్రధాన పాత్రలో నాగశౌర్య హీరోగా వచ్చిన దిక్కులు చూడకు రామయ్య తో పరిచయం అయ్యిందీమె.

  ఆదోని

  ఆదోని

  సాయిరామ్ శంకర్ హీరోగా వచ్చిన రోమియోతో పరిచయం అయ్యిందీ భామ.

  హీబా

  హీబా

  సంవత్సరం చివర్లో వచ్చిన బాగుందనిపించుకున్న చిత్రం అలా ఎలా తో పరిచయం అయ్యిందీమె.

  నవీన

  నవీన

  రామ్ గోపాల్ వర్మ ఐస్‌క్రీమ్‌-2 తో తెలుగుకు పరిచయం అయ్యిందీ హాట్ భామ

  రెహానా

  రెహానా

  సుకుమార్ శిష్యుడు వేమారెడ్డి దర్శకత్వంలో రూపొందిన చక్కిలిగింతలు తో పరిచయం అయ్యిందీమె.

  English summary
  Oneindia telugu presents a list of young talent who stepped into tollywood for the first time in 2014.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X