»   »  'నిన్న నేడు రేపు' అనే సీన్ ఇక లేదు!!

'నిన్న నేడు రేపు' అనే సీన్ ఇక లేదు!!

Posted By:
Subscribe to Filmibeat Telugu
Ninna Nedu Repu
ఎస్.పి.ఆర్. ఎంటర్ టైన్ మెంట్ పతాకం పై నూకారపు సూర్యప్రకాశరావు నిర్మించిన 'నిన్న నేడు రేపు' నిజంగానే నిన్న నేడు రేపు అని రిలీజ్ డేట్స్ మార్చుకుంటూ వస్తోంది. అయితే ఇప్పుడు అలా అనే సీన్ లేకుండా అక్టోబర్ తొమ్మిదిన రిలీజ్ డేట్ ఫిక్స్ చేసారు. సెవన్ బై జి బృందావన కాలనీ ఫేమ్ రవి కృష్ణ, అక్షర,తమన్నాలు హీరోహీరోయిన్లు గా లక్ష్మీకాంత్ చెన్నా దర్శకత్వం లో రూపొందింన ఈ చిత్రం అన్ని కార్యక్రమాలనూ పూర్తి చేసుకొందని , తమిళం లో కూడా దీన్ని రిలీజ్ చేస్తున్నామనీ, నిజానికి ఈ చిత్రం చాలా రోజుల క్రితమే విడుదలవ్వాల్సి వుందని కానీ వేరే ఇతర కారణాలవల్ల విడుదల లో జాప్యం జరిగిందని కూడా నిర్మాత తెలిపారు.

దర్శకుడు లక్ష్మీ కాంత్ మాట్లాడుతూ యూత్ ని ఆలొచింప జేసే కధ తో ఈ చిత్రం రూపొందిందనీ, యువత ఆలోచనలు నిన్న ఎలా వున్నాయి, రెపు ఎలా వుంటాయి అన్నదే ప్రధాన ఇతివృత్తం అనీ, ఇరవై అయిదు ఏళ్ళ కుర్రాడు ఏదో చేయాలని హైదరాబాద్ వస్తే ఇక్కడ పరిస్తితులకు అతని ఆలోచనా ధోరిణి ఎలా మారింది, అసలు అతను ఏం చేయాలని వచ్చాడు, అది నెరవేరిందా లాంటి విషయాలను ఈ చిత్రం లో చాలా చక్కగా చెప్పడం జరిగిందని ఆయన తెలిపారు. ఈ చిత్రం లో నాజర్, బ్రమ్మానందం, వేణుమాధవ్, అజయ్, సుధ, కౌష,అపూర్వ తదితరులు నటించారు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X