»   » నితిన్, హన్సికల 'సీతారాముల కళ్యాణం' ఏమైంది

నితిన్, హన్సికల 'సీతారాముల కళ్యాణం' ఏమైంది

Posted By:
Subscribe to Filmibeat Telugu

మొన్న శుక్రవారం రిలీజైన నితిన్,హన్సిక కాంబినేషన్ లో వచ్చిన 'సీతారాముల కళ్యాణం'..లంకలో చిత్రం యావరేజ్ టాక్ ని తెచ్చుకుంది. శ్రీను వైట్ల రెడీ తరహాలో నవ్వించాలని చూసిన ఈ కథ తెలుగు తెరపై ఎన్నో సార్లు చూసిందే. కథలో ఇంజనీరింగ్ కాలేజీ స్టూడెంట్ చందు (నితిన్) తన జూనియర్ నందిని (హన్సిక)ని తొలి చూపులోనే ప్రేమిస్తాడు.ఆమె కూడా మొహమాటపడి ప్రేమిస్తుంది. ఇక రెగ్యులర్ గానే నందిని తండ్రి పెద్దిరెడ్డి (సుమన్) ఓ ఫ్యాక్షనిస్టు.అయితే ట్విస్ట్ ఏమిటంటే ఆళ్లగడ్డలో అతనికి ఓ ప్రత్యర్థి (జయప్రకాష్ రెడ్డి) ఉంటాడు. అతని తమ్ముడు కొడుకు వీరప్రతాప్ రెడ్డి (సునీల్ పాండా) నందినిని ఇష్టపడతాడు. అయితే అతనితో పెళ్లికి పెద్దిరెడ్డి ఒప్పుకోడు. దీంతో నందినిని వీర ప్రతాప్ రెడ్డి తన మనుషులతో బలవంతంగా సీమకు ఎత్తుకు వస్తాడు. అది తెలిసిన చందు ఆమెను కాపాడేందుకు సీమలో అడుగుపెడతాడు. రావణాసురుడు లాంటి వీరప్రతాప్ రెడ్డి చెర నుంచి నందినిని మన హీరో ఎలా కాపాడుకున్నాడనేదే మిగతా కథ. కథలో పెద్ద చెప్పుకోవటానికి ఏమీ లేక పోయినా కామిడీతో కొట్టుకొద్దామని ప్రయత్నం చేసారు. ముఖ్యంగా విలన్ కు బందీగా పడి ఉండే లాయర్ గా బ్రహ్మానందం ఇందులో నవ్విస్తాడు. అలాగే సుబ్బరాజు పాత్ర బుజ్జి గాడు మేడిన్ భీమవరం అంటూ ఆకట్టుకుంటుంది. ఇవి మినహా సినిమాలు పేలిందేమీ లేదు. హన్సిక,నితిన్ ఇద్దరూ తమ రెగ్యులర్ ధోరణిలోనే నటించారు. కథ కొత్తగా లేక, ట్రీట్ మెంట్ కామన్ గా సాగి, నటన అలాగే ఉండటంతో ప్రేక్షకులు చూసిన సినిమానే మరో సారి చూసిన ఫీలింగ్ లో ఉన్నారు..

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu