»   » పూరీ 'హార్ట్ ఎటాక్' పై నితిన్ ట్వీట్

పూరీ 'హార్ట్ ఎటాక్' పై నితిన్ ట్వీట్

Posted By:
Subscribe to Filmibeat Telugu
హైదరాబాద్ : 'ఇష్క్', 'గుండెజారి గల్లంతయ్యిందే' సినిమాల హిట్స్ తో హుషారుగా ఉన్న నితిన్ తాజాగా 'హార్ట్ ఎటాక్'లో నటిస్తున్నారు. పూరి జగన్నాథ్ టూరింగ్ టాకీస్ పతాకంపై ఈ సినిమాను పూరి జగన్నాథ్ తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ హైదరాబాద్‌లో మొదలైంది. దీని గురించి నితిన్ ట్వీట్ చేసారు.

నితిన్ ట్వీట్ లో ... "ఒన్ టు త్రీ ఫోర్ డిష్యుమ్ డిష్యుమ్ అంటూ ప్రస్తుతం ఫైటింగ్ చేస్తున్నాను. పూరి సార్ దర్శకత్వంలో 'హార్ట్ఎటాక్' రెగ్యులర్ షూటింగ్ మొదలైంది. క్లైమాక్స్ ఫైట్‌ను ప్రస్తుతం చిత్రీకరిస్తున్నాం'' అని ట్వీట్ చేశారు. మరోవైపు నితిన్ హీరోగా నటించిన కొరియర్ బాయ్ కల్యాణ్ షూటింగ్ దాదాపుగా పూర్తయినట్టే.

విక్రమ్ భట్ దర్శకత్వం వహించిన హారర్ సినిమా '1920' ద్వారా బాలీవుడ్ ప్రేక్షకులను భయపెట్టిన ఆదాశర్మ ఈ సినిమా ద్వారా తెలుగులోకి ఎంట్రీ ఇస్తోంది. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఇటీవల హైదరాబాద్‌లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో ప్రారంభమైంది. అక్కడ నితిన్ పాల్గొనగా క్టైమాక్స్‌కు సంబంధించిన కొన్ని కీలక సన్నివేశాల్ని దర్శకుడు పూరి జగన్నాధ్ చిత్రీకరించాడని చిత్ర వర్గాల సమాచాం. ఈ చిత్రానికి అమోల్ రాథోడ్ ఫోటోగ్రఫీని అందిస్తుండగా, అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నాడు.

ఈ షెడ్యూల్ తర్వాత గోవా, యూరప్ లలో భారీ షెడ్యూల్ జరిపేందుకు ప్రణాళికలు సిద్ధం చేసారు. ఇక్కడ సినిమా ప్రధాన తారగణంపై కీలకమైన సన్నివేశాలు తెరకెక్కించనున్నారు. హీరోలను సరికొత్తగా ప్రజెంట్ చేసే పూరి నితిన్ ను కొత్త స్టైల్ లో ప్రేక్షకులకు చూపించబోతున్నాడు.

నితిన్ మాట్లాడుతూ 'పూరి జగన్నాథ్ దర్శకత్వంలో నటించాలనే కోరిక ఎప్పటి నుండో ఉంది. ఇప్పటికి ఆ కోరిక నెరవేరబోతోంది. పూరిగారు కథ చెప్పగానే ఎప్పుడెప్పుడు ఈ షూటింగ్ మొదలవుతుందా అని ఆసక్తి నాలో మొదలైంది. ఈ సినిమా నా కెరీర్‌కు ఎంత ముఖ్యమైనదిగా భావిస్తున్నాను' అన్నారు.

ప్రస్తుతం నితిన్ 'కొరియర్ బాయ్ కళ్యాణ్' మూవీ షూటింగులో బిజీగా ఉన్నారు. గుండె జారి గల్లంతయ్యిందే చిత్రం ఘన విజయంతో నితిన్ కు వరస ఆఫర్స్ వచ్చి పడుతున్నాయి. ప్రస్తుతం నితిన్ 'కొరియర్ బాయ్ కళ్యాణ్' చిత్రం షూటింగులో బిజీగా గడుపుతున్నాడు. గౌతం మీనన్ నిర్మిస్తున్న ఈచిత్రానికి ప్రేమ్ సాయి దర్శకత్వం వహిస్తున్నారు. యామి గౌతం నితిన్ సరసన హీరోయిన్ గా చేస్తోంది. కార్తీక్ ఈచిత్రానికి సంగీతం అందిస్తున్నారు.

ఈ సినిమాల తర్వాత మరో రెండు ప్రాజెక్టులు నితిన్‌కు ఖరారయ్యాయి. అందులో కిక్ దర్శకుడు సురేందర్ రెడ్డి దర్వకత్వంలో రూపొందబోయే సినిమా ఒకటి కాగా, మరొకటి అలా మొదలైంది, జబర్దస్త్ చిత్రాల ఫేం నందినీరెడ్డి దర్శకత్వంలో చేయనున్నారు. ఈ చిత్రాలు 2014లో సెట్స్ పైకి వెళ్లనున్నాయి.

English summary
Nithin's latest tweet: 1 2 3 4 get on d fight floor..hand punch leg kick dishum dishum hardcore!!startin shoot 4 puri sirs HEART ATTACK with d climax fight now.. Nithin and Puri Jagan have started working together for the film ‘Heart Attack’. The movie’s first schedule has started today in Hyderabad, at the famous Aluminium Factory near Gachibowli. A fight sequence is being shot and this will be used for the climax episode.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X