»   » రామ్ చరణ్ సోదరిగా చేస్తున్నందుకు ఫీలవటం లేదు

రామ్ చరణ్ సోదరిగా చేస్తున్నందుకు ఫీలవటం లేదు

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: సాధారణంగా...హీరోయిన్స్ ఒక్కసారిగా రూటుమార్చి హీరోకు చెల్లి,లేదా అక్క పాత్రలు చేయటానికి ఇష్టపడరు. కానీ భారీ ఆఫర్ పిలిస్తేను కాదనలేరు. ఇప్పుడు అలాంటి పరిస్దితే కృతి కర్భంద ఎదుర్కొంటోంది. తీన్ మార్, ఒంగోలు గిత్త చిత్రాల్లో చేసిన ఈమెకు తెలుగులో అనుకున్నంత బ్రేక్ రాలేదు. ఈ నేపధ్యంలో ఆమె రామ్ చరణ్ తాజా చిత్రంలో అతనికి సోదరిగా నటించటానికి ముందుకు వచ్చింది. ఈ విషయమై ఆమె మాట్లాడింది.

కృతి కర్భంద మాట్లాడుతూ..."చాలా మంది రామ్ చరణ్ సోదరిగా చేస్తున్నానంటే వద్దని హెచ్చరించారు. కానీ ఆ పాత్ర నాకు బాగా నచ్చింది. అయినానేనేమీ ఈ సినిమాతో కోల్పోయేదేమీ లేదు " అంది..

No regrets playing Ram Charan's Sister: Kriti Kharbanda

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

సినిమా విషయానికొస్తే...

రామ్‌చరణ్‌ - శ్రీను వైట్ల కలయికలో డి.వి.వి. ఎంటర్‌టైన్‌మెంట్స్‌ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తోంది. రకుల్‌ప్రీత్‌ సింగ్‌ హీరోయిన్. డి.వి.వి.దానయ్య నిర్మాత. విజయవంతమైన చిత్రాలను నిర్మించిన సుప్రసిద్ధ నిర్మాత దానయ్య డి.వి.వి. 'డి.వి.వి. ఎంటర్టైన్మెంట్స్ ఎల్ ఎల్ పి.' పతాకం పై శ్రీమతి డి. పార్వతి సమర్పణలో నిర్మిస్తున్న భారీ ప్రతిష్టాత్మక చిత్రం రెగ్యులర్ షూటింగ్ హైదరాబాద్ లో ప్రారంభమైంది.

చిత్రం గురించి దర్శకుడు 'శ్రీను వైట్ల' మాట్లాడుతూ " ఫ్యామిలి ఎంటర్టైనర్ విత్ యాక్షన్ 'కథా చిత్రం గా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నట్టు ఆయన తెలిపారు. నిర్మాత దానయ్య డి.వి.వి. గారు ఈ చిత్రాన్ని ఎక్కడా రాజీ పడకుండా నిర్మిస్తున్నారు. మంచి సాంకేతిక నిపుణులతో, అద్భుతమైన తారాగణంతో రూపొందుతున్న ఈ చిత్రం ఘన విజయం సాధిస్తుంది" అన్నారు.

నిర్మాత దానయ్య డి.వి.వి. మాట్లాడుతూ హైదరాబాద్లో చిత్రం రెగ్యులర్ షూటింగ్ జరుగుతోంది.. ప్రధాన తారాగణం అంతా పాల్గొంటున్నారు. నాయక్ తర్వాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో ఈ సినిమా నిర్మించటం ఎంతో ఆనందంగా ఉంది. భారీ తారాగణం తో పాటు, అత్యున్నత సాంకేతిక విలువలతో ఈ చిత్రం ముస్తాబౌతుందని అన్నారు.

English summary
Kriti Kharbanda playing Ram Charan's sister in 'My Name Is Raju'. Kriti says, "Many people whom I knew warned me about it. But, I signed the film as I loved my character sketch. After all, I had nothing to lose".
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu