»   » దేవీశ్రీ ప్రసాద్‌ తండ్రి, ప్రముఖ రచయిత సత్యమూర్తి మృతి

దేవీశ్రీ ప్రసాద్‌ తండ్రి, ప్రముఖ రచయిత సత్యమూర్తి మృతి

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్‌: ప్రముఖ సినీ రచయిత, యువ సంగీత దర్శకుడు దేవీశ్రీ ప్రసాద్‌ తండ్రి సత్యమూర్తి కన్నుమూశారు. సోమవారం తెల్లవారుజామున చెన్నైలోని ఆయన నివాసంలో గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. ఆయన 90కి పైగా సినిమాలకు రచయితగా పనిచేశారు.

ఆయన రచయితగా పనిచేసిన తొలిచిత్రం ‘దేవత'. చంటి, ఛాలెంజ్‌, భలేదొంగ, అభిలాష, పెదరాయుడు, ఖైదీ నంబర్‌ 786 లాంటి విజయవంతమైన చిత్రాలకు రచయితగా పనిచేశారు. ఆయన అంత్యక్రియలు ఈరోజు సాయంత్రం చెన్నైలో నిర్వహించనున్నట్లు కుటుంబసభ్యులు తెలిపారు.

Noted writer, Devisri prasad father Satyamurthy passed away
English summary
Tollywood Film writer Satyamurthy passed away earlier today due to sudden heart attack. He is the father of music director of Devi Sri Prasad.
Please Wait while comments are loading...