»   » ఎమ్మెల్యే కోసం ఎన్టీఆర్.. ఇప్పటికీ సస్పెన్సే!

ఎమ్మెల్యే కోసం ఎన్టీఆర్.. ఇప్పటికీ సస్పెన్సే!

Subscribe to Filmibeat Telugu

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ సినిమాతో ఎన్టీఆర్ బిజీకాబోతున్నాడు. మరోవైపు దర్శక ధీరుడు రాజమౌళి రూపొందించే మల్టి స్టారర్ చిత్రం కోసం కూడా ఎన్టీఆర్ సమాయత్తం అవుతున్నాడు. ఎన్టీఆర్ జిమ్ లో కసరత్తులు చేస్తున్న ఫొటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఎన్టీఆర్ కొత్త లుక్ త్రివిక్రమ్ సినిమా కోసమా లేక రాజమౌళి సినిమా కోసమా అనే విషయంలో క్లారిటీ లేదు.

NTR to attend MLA Prerelease event

కాగా ఎన్టీఆర్ నేడు జరగబోయే ఎమ్మెల్యే చిత్ర ప్రీరిలీజ్ ఈవెంట్ కు హాజరవుతాడని ప్రచారం జరుగుతోంది. ఎన్టీఆర్ హాజరయ్యే విషయంలో అధికారిక ప్రకటన అయితే ఏదీ లేదు. ఈ విషయంలో ఇప్పటికీ సస్పెన్స్ కొనసాగుతోంది. నందమూరి అభిమానులు మాత్రం ఎన్టీఆర్ హాజరు కావాలని కోరుకుంటున్నారు. ఎన్టీఆర్ కొత్త లుక్ని తనివితీరా ఆస్వాదించాలనేది వారి కోరిక. తన సోదరుడి సినిమా ఈవెంట్ కు ఎన్టీఆర్ హాజరవుతాడో లేదో మరి కొన్ని గంటల్లో తెలిసిపోనుంది.

English summary
NTR to attend MLA Prerelease event. NTR fans eagerly waiting for him
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X