Don't Miss!
- Sports
WPL 2023: ఫిబ్రవరి 13న మహిళల ఐపీఎల్ వేలం!
- News
తెలంగాణ నూతన సచివాలయంలో అగ్ని ప్రమాదం..!!
- Finance
WhatsApp: వామ్మో, అన్ని భారతీయ ఖాతాలను వాట్సప్ నిషేధించిందా..?
- Lifestyle
Women Money Habits: మహిళల ఈ అలవాట్లతో ఉన్నదంతా పోయి బికారీ కావాల్సిందే!
- Technology
ఈ ఫోన్లు వాడుతున్నారా? కొత్త OS అప్డేట్ చేస్తే ఇబ్బందుల్లో పడతారు జాగ్రత్త!
- Travel
బెజవాడకు చేరువలోని ఈ జైన దేవాలయం గురించి మీకు తెలుసా!
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
ఎన్టీఆర్ ను స్ఫూర్తిగా తీసుకున్నానని చెప్పిన వర్మ
రక్త చరిత్ర చిత్రంలో దివంగత నందమూరి తారక రామారావును కేవలం స్ఫూర్తిగా మాత్రమే తీసుకున్నానని, ఆయనకు నెగిటివ్ గా చూపించలేదని ఆ చిత్ర దర్శకుడు రాంగోపాల్ వర్మ ఓ టీవీ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. ఎవరైనా ఈ చిత్రంపై అభ్యంతరాలుంటే కోర్టుకు వెళ్లవచ్చునని అన్నారు. మనది ప్రజాస్వామ్య ప్రభుత్వం కాబట్టి వారికి ఆ హక్కు ఉంటుందన్నారు. రక్త చరిత్ర-2 పై ఈ చిత్రం ప్రభావం ఉండదని ఆయన అన్నారు.
రక్తచరిత్రలో విలన్లు, హీరోలు లేరన్నారు. కేవలం క్యారెక్టర్లు మాత్రమే ఉన్నాయన్నారు. లక్ష్మీ పార్వతి కోర్టుకు వెళతాననటంపై ఆయన మాట్లాడుతూ కోర్టుకు వెళ్లవచ్చని, మైకు ముందు ఉంటే అందరూ చాలా మాట్లాడుతారన్నారు. రియల్ లైఫ్ లో మంచివారు, చెడ్డవారు ఉండరని వారి వారి పరిస్థితులను బట్టి వారు అలా తయారవుతారని అన్నారు. ఎవరి అభిప్రాయం ఎలా ఉన్నా నేను పట్టించుకోనని, అభిమానుల నుండి, ప్రేక్షకులనుండి మంచి స్పందన వస్తుందని ఆయన అన్నారు.
తాను వివాదం సృష్టించలేదని, మీడియానే వివాదాలు సృష్టించిందని ఆయన అన్నారు. తాను టాపికల్ సబ్జెక్టులు తీసుకుంటాను కాబట్టి రకరకాల అభిప్రాయాలు వస్తాయని ఆయన చెప్పారు. సత్య, తదితర సినిమాల విషయంలోనూ అదే జరిగిందని ఆయన చెప్పారు. శివ చిత్రంలో మురళి హత్యను చూపించానని అన్నారని ఆయన చెప్పారు.