For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  దుమారం రేపుతున్న "వాణీ'స్ ఎన్టీఆర్": వాణీ విశ్వనాథ్,ఎన్టీఆర్ వివాహం "వార్తలు" మళ్ళీ తెరపైకి

  |
  దుమారం రేపుతున్న "వాణీ'స్ ఎన్టీఆర్"

  ప్రస్తుతానికి టాలీవుడ్ లో ఇప్పుడు ఎన్టీఆర్ బయోపిక్ ల "సిరీస్" హవా నడుస్తోంది. ఒక పక్క బాలయ్య తేజా కాంబినేషన్ లో ఒక బయోపిక్ వస్తుందన్న విష్యమూ, అదే సమయం లో రామ్ గోపాల్ వర్మ దానికి పోటీగా లక్ష్మీ'స్ ఎన్టీఆర్ మొదలు పెట్టిన సంగతీ తెలిసిందే. అయితే అప్పటి వరకూ సినిమా అంశంగానే ఉన్న ఈ బయోపిక్ ఎప్పుడైతే వర్మ కి మద్దతుగా వయ్యెస్సార్ పార్టీ ఉందన్న విషయం బయటికి వచ్చిందో అప్పుడే రాజకీయ రంగు పులుముకుంది.

  వర్మ తీసే సినిమా తెలుగుదేశం పార్టీ కి వ్యతిరేకమైన అంశాలతో ఉంటుందన్న అభిప్రాయం ఏర్పడగానే పాపం లక్ష్మీ పార్వతిని కూడా సీన్ లోకి తెచ్చేసినట్టయ్యింది. ఆ వెంటనేకేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి 'లక్ష్మీస్ వీరగ్రంథం' పేరుతో సినిమా అంటూ ప్రకటించాడు. అయితే ఈ సినిమాపై లక్ష్మీ పార్వతి అభ్యంతరం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఇక్కడివరకూ ఉన్నది ఒక ఎత్తైతే ఇప్పుడు ఒకనాటి హీరోయిన్ వాణీ విశ్వనాథ్ కూడా ఈ వివాదం లోకి అడుగు పెట్టటంతో మరింత ఇంట్రస్టింగ్ వ్యవహారంగా తయారయ్యింది ఆ మహానటుడూ, రాజకీయవేత్తా అయిన తారకరామారావు గారి జీవిత చరిత్ర సినిమా.

   ఎన్టీఆర్ బయోపిక్

  ఎన్టీఆర్ బయోపిక్

  ఏ క్షణాన ఎన్టీఆర్ బయోపిక్ అన్న మాట తెరమీదకి వచ్చిందో గానీ ఇప్పుడు మాత్రం రెండురాష్ట్రాల రాజకీయాలు కూడా సినిమా ఇండస్ట్రీలో భాగమయ్యాయా అన్నంత టెన్షన్ లో అటు టాలీవుడ్, ఇటు రాజకీయాలూ కలిసిపోయాయి. ఒక పక్క రామ్ గోపాల్ వర్మ లక్ష్మీ'స్ ఎన్టీఆర్ అని ప్రకటించగానే.

  లక్ష్మీ పార్వతి అభ్యంతరం

  లక్ష్మీ పార్వతి అభ్యంతరం

  దానికి ఫైనాన్స్ వయ్యెస్సార్సీపీనుంచి మద్దతు వచ్చింది, వైసీపీ నేత రాకేష్ దీనికి నిర్మాత అని తెలియగానే కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి 'లక్ష్మీస్ వీరగ్రంథం' పేరుతో సినిమా అంటూ ప్రకటించాడు. అయితే ఈ సినిమాపై లక్ష్మీ పార్వతి అభ్యంతరం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.

   నటి వాణీ విశ్వనాథ్

  నటి వాణీ విశ్వనాథ్

  "లక్ష్మీస్ వీరగ్రంథం" చిత్రంలో నటించనమని తనకు ఆఫర్ వచ్చిన మాట నిజమేనని,అయితే ఆ విషయంపై ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదనీ, అయితే అన్నీ కుదిరితే ఎన్టీఆర్ సతీమణిగా నటించడానికి తాను సిద్ధంగా ఉన్నానని చెప్పిన నటి వాణీ విశ్వనాథ్ ఈ కాంట్రవర్సీని మరింత ఆసక్తికరం చేసారు. విజయవాడలోని కనకదుర్గ ఆలయాన్ని సందర్శించిన సందర్భంగా ఆమె మీడియాతో ఈ విషయాన్ని చెప్పారు.

   ఎన్టీఆర్, నటి వాణీ విశ్వనాథ్‌‌ల పరిచయం

  ఎన్టీఆర్, నటి వాణీ విశ్వనాథ్‌‌ల పరిచయం

  అయితే ఇప్పుడు మరో ఇంట్రస్టింగ్ వ్యవహారం ఏమిటంటే ఒకప్పుడు ఎన్టీఆర్ కీ నటి వాణీ విశ్వనాథ్‌కీ ఉన్న పరిచయం గురించి మళ్ళీ కొందరు మాట్లాడుకుంటున్నారు. అప్పట్లో వీరిద్దరిమధ్యా వచ్చిన వార్తలని ఒకసారి గుర్తు చేసుకుంటున్నారు.

   వాణీ విశ్వనాథ్‌ను పెళ్లి చేసుకుందామని

  వాణీ విశ్వనాథ్‌ను పెళ్లి చేసుకుందామని

  ఆ సంగతలా ఉంటే.. ఇప్పుడు సీనియర్ ఎన్టీఆర్ ను బాగా ఓన్ చేసుకుంటున్న వాణీ విశ్వనాథ్‌ను పెళ్లి చేసుకుందామని ఎన్టీఆరే ఒక దశలో అనుకున్నాడనే టాక్ ఇప్పుడు మళ్లీ వినిపిస్తుండటం విశేషం. ఈ వ్యవహారం ఈనాటిది కాదు.. 1990‌ల్లోది.

   సామ్రాట్ అశోక సినిమా

  సామ్రాట్ అశోక సినిమా

  ఆ సమయంలో కుటుంబ నిరాదరణతో ఒంటరి అయిపోయి, అధికారం కూడా చేతిలో లేక అల్లాడిపోయిన ఎన్టీఆర్ కు వాణి కూడా మంచి ఫ్రెండ్ అయ్యిందని అంటారు. అప్పటికే 1992 లో వచ్చిన సామ్రాట్ అశోక సినిమాలో ఆయనతో కలిసి నటించింది వాణీ విశ్వనాథ్ ఆ సమయంలోనే ఇద్దరూ మంచి స్నేహితులయ్యారట.

  అమితంగా అభిమానించాడట

  అమితంగా అభిమానించాడట

  ఎన్టీఆర్ తో కలిసి నటించిన ఆమెను ఆయన అమితంగా అభిమానించాడట. ఆ విషయాన్ని వాణినే ఒకసారి ఒక తెలుగు మీడియా వర్గానికి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. ఆనాడు నందమూరి తారక రామారావు గారికీ తనకూ మధ్య ఉన్న సాన్నిహితమైన పరిచయాన్నీ స్వయంగా ఆమెనే చెప్పింది.

   ఎన్టీఆర్ నన్ను ఇంటికి ఆహ్వానించారు

  ఎన్టీఆర్ నన్ను ఇంటికి ఆహ్వానించారు

  ‘సినిమా పూర్తి అయ్యాకా.. ఎన్టీఆర్ నన్ను ఇంటికి ఆహ్వానించారు. అప్పటికే రెమ్యూనరేషన్ ఇచ్చేసినా.. అదనంగా నా చేతిలో కొంత డబ్బు పెట్టి పంపించారు..' అని వాణీ విశ్వనాథ్ ఆ మధ్య ఒక తెలుగు పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు.

  ఇక్కడ ఎన్టీఆర్‌కి ఉన్న ఫాలోయింగ్ వేరు

  ఇక్కడ ఎన్టీఆర్‌కి ఉన్న ఫాలోయింగ్ వేరు

  ఆ సమయంలో ఎన్టీఆర్ ఎవర్నో ఒకరిని పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు. ఆ జాబితాలో వాణీ కూడా ఉందనేది 90ల సినీ పత్రికలు చెప్పే మాట. ఎన్టీఆర్ ఆ వయసులో పెళ్లి చేసుకున్నది అయితే నిజం. కానీ అప్పటికే బాలీవుడ్ లో అలాంటి పెళ్ళిళ్ళు అప్పటికే ఉన్నాయి కానీ ఇక్కడ ఎన్టీఆర్‌కి ఉన్న ఫాలోయింగ్ వేరు, దాంతో ఆ వయసులో పెళ్ళా అంటూ ఆశ్చర్యంగా, కాస్త అదోరకంగా చూసినవాళ్ళు ఉన్నారు.

  అన్ని వార్తలలాగే

  అన్ని వార్తలలాగే

  అయితే లక్ష్మీ పార్వతికంటే ముందు కూడా ఆయన జీవితాన్ని పంచుకోవాలనుకున్న వాళ్ళు ఉండోచ్చు అన్న విషయాన్ని కాదనలేం అన్నది ఆనాడు ఆయనకి సన్నితంగా ఉన్నవాళ్ళ మాట. అయితే ఈ విషయాన్ని బహిరంగంగా మాత్రం ఎవరూ బయట పెట్టలేదు. కేవలం అన్ని వార్తలలాగే ఈ సంగతి కూడా ఒక "రూమర్" గానే మిగిలి పోయింది.

  వాణీ విశ్వనాథ్, మీనాక్షి శేషాద్రి వంటి వాళ్లు

  వాణీ విశ్వనాథ్, మీనాక్షి శేషాద్రి వంటి వాళ్లు

  లక్ష్మిపార్వతి దగ్గర కావడానికి మునుపు.. ఎన్టీఆర్ ఆ సమయంలో తనతో పని చేసిన హీరోయిన్లను కూడా పరిగణనలోకి తీసుకున్నాడని, వారిలో వాణీ విశ్వనాథ్, మహర్షి విశ్వామిత్రలో ఆయనతో కలిసి నటించిన మీనాక్షి శేషాద్రి వంటి వాళ్లు ఉన్నారని.. నాటి పరిణామాలను గమనించిన వాళ్లు, నాటి పత్రికలను చదివిన వాళ్లూ చెబుతారు.

  పబ్లిక్ మీటింగులోనే

  పబ్లిక్ మీటింగులోనే

  అయితే ఎన్టీఆర్ వారసులకు మాత్రం.. ఆయన మళ్లీ పెళ్లి చేసుకోవడం ఏ మాత్రం ఇష్టం లేదని, అందుకే.. వాణీకి, మీనాక్షికి గట్టి హెచ్చరికలు పంపించారని.. లక్ష్మీ పార్వతి విషయంలో కూడా వాళ్లు అలాగే వ్యవహరించినా.. ఎన్టీఆర్ వెనక్కు తగ్గక ఒక పబ్లిక్ మీటింగులోనే ఆమెతో వివాహ విషయాన్ని ప్రకటించాడని అంటారు.

   ఒక అసాధారణ ప్రస్తానం

  ఒక అసాధారణ ప్రస్తానం

  అయితే ఇప్పుడు వస్తున్న బయో పిక్‌ల కాంట్రవర్సీ, అవి రేపుతున్న దుమారమూ .., అటు తెలుగు సినిమారంగం లోనూ, ఇటు రాజకీయ రంగం లోనూ ఒక అసాధారణ ప్రస్తానం సాగించిన లెజెండ్ స్థాయి మనిషి అయిన ఎన్టీఆర్ మరణించిన ఇన్ని సంవత్సరాల కి కూడా ఆయనకి జనంలో ఉన్న స్టామినాని చెప్పకనే చెబుతున్నాయి.

  English summary
  Now once again the forgotten story of NTR yearning to marry Vani Viswanath is come back in to the lime light. It is said that during the 90s, He wanted to marry with Vani Vishwanth. This was reported by the media in those days. Even Meenakshi Seshadri’s name was also considered.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X