»   » ఆఫీసర్ ప్రిరిలీజ్ లైవ్: నాగార్జున నాకు తండ్రి కాదు.. షాకిచ్చిన నాగచైతన్య

ఆఫీసర్ ప్రిరిలీజ్ లైవ్: నాగార్జున నాకు తండ్రి కాదు.. షాకిచ్చిన నాగచైతన్య

By Rajababu
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
  Officer Pre Release Event : Akhil, Naga Chaitanya Speech

  శివ తర్వాత మన్మధుడు అక్కినేని నాగార్జున, సెన్సేషనల్ డైరెక్టర్ రాంగోపాల్ వర్మ కాంబినేషన్‌లో వస్తున్న చిత్రం ఆఫీసర్. నిజాయితీ కల పోలీస్ అధికారి కథా నేపథ్యంతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నది. ఈ కార్యక్రమంలో అక్కినేని నాగార్జున, అమల, నాగచైతన్య, కీరవాణి పాల్గొన్నారు.

  ఆఫీసర్ చిత్ర ఆడియోలోని నువ్వే నవ్వు పాటను అక్కినేని నాగచైతన్యను లాంచ్ చేశారు. ఆ చిత్రంలో ఓ పాపతో నాగార్జున నటించిన సన్నివేశాలు ఆకట్టుకునే విధంగా ఉన్నాయి.

  నాగార్జున కొత్త అబ్బాయి

  నాగార్జున కొత్త అబ్బాయి

  నాగార్జునతో తాను శివ చిత్రం చేయాల్సిందని కానీ అప్పటికి నాగార్జున కొత్త అబ్బాయి కనుక శివ చిత్రం చేయలేదని కీరవాణి అన్నారు. నాగార్జున పేరుచెబితే నాకు వెంటనే తెలుసా మనసా సాంగ్ గుర్తుకు వస్తుందని కీరవాణి అన్నారు. తెలివితేటలు, హార్డ్ వర్క్ తో పాటు కొండంత ధైర్యం కలిగిన వ్యక్తి వర్మ అని కీరవాణి అన్నారు. చిత్ర యూనిట్ కు శుభాకాంక్షలు తెలియజేసి తన ప్రసంగాన్ని ముగించారు.

  అక్కినేని ఆత్మను పిలిచిన తనికెళ్ల భరణి

  అక్కినేని ఆత్మను పిలిచిన తనికెళ్ల భరణి

  ఆఫీసర్ ప్రీరిలీజ్ వేడుకలో మాట్లాడుతూ.. ముందుగా అక్కినేని నాగేశ్వరరావు ఆత్మను ఆహ్వానిస్తా. కొడుకు ఉన్నతిని చూసి గొప్ప అవకాశం నాగేశ్వరరావుకు దక్కింది. ఆయన బ్రతికి ఉండగానే నాగార్జున వైభవాన్ని చూశారు. ఇప్పడు నాగచైతన్య, అఖిల్ ఉన్నతిని చూసే అవకాశం నాగార్జునకు దక్కింది. అమలను ఉద్దేశించి మాట్లాడుతూ.. సంస్కారవంతమైన కుటుంబం అక్కినేని ఫ్యామిలీ ప్రతీక. మనకు రెండు పండుగలు. వెరసీ ఆర్జీవి అనే మూడు అక్షరాల మంత్రం ఏరకంగానైనా, ఏం మాట్లాడినా ప్రభంజనమే అని తనికెళ్ల అన్నారు. శివలోని చైన్ నుంచి గురించి చెప్పిన కథ అందర్ని ఆకట్టుకొన్నది. శివ తర్వాత చైన్ బ్లాక్‌లో అమ్మారు అని తనికెళ్ల భరణి అన్నారు.

  నాన్న పోలీస్ ఆఫీసర్‌లాగే

  నాన్న పోలీస్ ఆఫీసర్‌లాగే

  అఖిల్ మాట్లాడుతూ.. పాతికేళ్ల క్రితం శివ చిత్రం కోసం నాన్న, వర్మ గారు ఎంత కష్టపడ్డారో, ఎంత ఎనర్జీతో పనిచేసారో ఆఫీసర్ చిత్రం కోసం కూడా అదేవిధంగా పనిచేశారని అఖిల్ తెలిపాడు. ఇది తనలాంటి యువ నటులకు స్ఫూర్తినిచ్చే అంశం అని అఖిల్ తెలిపాడు. నాన్నని ఇంట్లో చూస్తుంటా.. ఆయన క్రమశిక్షణ, కష్టపడేతత్వం నిజంగానే పోలీస్ అధికారిని గుర్తు చేస్తాయని అఖిల్ తెలిపాడు. జూన్ 1 న రాబోతున్న ఆఫీసర్ చిత్రానికి, చిత్ర యూనిట్ కు శుభాకాంక్షలు తెలియజేశాడు.

  నాగార్జున, ఆర్జీవితో పనిచేయడం అద్భుతం.. మైరా సరీన్

  నాగార్జున, ఆర్జీవితో పనిచేయడం అద్భుతం.. మైరా సరీన్

  ప్రీరిలీజ్ ఫంక్షన్‌లో మైరా సరీన్ మాట్లాడుతూ.. ఇలా మాట్లాడటం తొలిసారి. చాలా నెర్వెస్‌గా ఫీలవుతున్నాను. నాగార్జున సార్ పక్కన నటించడం గొప్పగా ఉంది. నాగ్ సార్, ఆర్జీవితో పనిచేయడం అద్భుతం. చాలా చెప్పాలని, మాట్లాడాలని ఉంది. కానీ చెప్పలేకపోతున్నాను. ఆఫీసర్ సినిమా బాగుంటుంది. థియేటర్‌కు వెళ్లి చూడండి.

  నాగచైతన్య మాట్లాడుతూ..

  నాగచైతన్య మాట్లాడుతూ..

  అభిమానులందరికీ నమస్కారం. ఈ సంవత్సరం ఫ్యాన్స్ బాగుంటుంది. మీరిచ్చే సౌండ్‌కు రీసౌండ్ ఉంటుంది. శివ సినిమా చేసేటప్పడు అంత పెద్ద చిత్రంగా అవుతుందని చేయలేదు. అలాంటి సినిమా ఇప్పుడు దర్శకులకు మార్గదర్శకంగా మారింది. ఈ సినిమా కోసం బాగా పనిచేశారు. సినిమా గురించి చాలా చెబుతుంటాడు. ఆఫీసర్ కూడా ఘనవిజయం సాధిస్తుంది. తండ్రిగా నాగార్జున గురించి చెప్పమని కోరగా, ఆయన నాకు తండ్రి కాదు. బ్రదర్ లాంటి వాడు అని నాగచైతన్య అన్నారు.

  English summary
  Officer 2018 Telugu Movie. Nagarjuna and Myra Sareen lead pair. Directed by RGV and Music composed by Ravi Shankar. Produced by Ram Gopal Varma and Sudheer Chandra under A Company Production. This movies pre release function organised at N Convention, Hyderabad
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more