»   » నారా రోహిత్ 'ఒక్కడినే' టాక్ ఏంటి?

నారా రోహిత్ 'ఒక్కడినే' టాక్ ఏంటి?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : నారా రోహిత్ హీరోగా గులాబీ మూవీస్‌ పై సి.వి.రెడ్డి నిర్మించిన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ 'ఒక్కడినే'. నిత్యామీనన్ హీరోయిన్ గా చేస్తున్న ఈ చిత్రం ఈ రోజే వాలెంటైన్స్ డే సందర్భంగా రిలీజ్ అయ్యింది. అందిన సమాచారం ప్రకారం చిత్రం చాలా స్లోగా నడుస్తుందని, ఫస్టాఫ్ కేవలం క్యారెక్టర్స్ ఇంట్రడక్షన్ కే సరిపోయిందని తెలుస్తోంది. అయితే ఇంటర్వెల్ ట్విస్ట్ బాగుందని కానీ స్లోగా నడవటం సహన పరీక్షలా ఫీలవుతున్నామని అంటున్నారు.

సెకండాఫ్ వచ్చేసరికి పూర్తిగా ఫ్లాష్ బ్యాక్ ల మీద ఆధారపడ్డారని, ట్విస్ట్ లు,బ్రహ్మానందం కామెడీ బాగున్నా కాస్త ఇబ్బందిగానే ఉందని చెప్తున్నారు. నారా రోహిత్ తన పాత్రకు న్యాయం చేయటానికి ప్రయత్నించాడని,నిత్యామీనన్ సినిమా ప్లస్ అయ్యిందని చెప్తున్నారు. సాయికుమార్,నాగబాబు లతో క్లైమాక్స్ ఇంట్రస్టింగ్ ప్లాన్ చేసినా,అంతగా పేలలేదనే టాక్. అయితే సినిమా రిజల్ట్ ఏమిటనేది తేలాలంటే కొంత టైమ్ పడుతుంది.

ఈ చిత్రం గురించి నారా రోహిత్ మాట్లాడుతూ.. ఇదివరకు నేను చేసిన 'సోలో', ఇప్పుడు 'ఒక్కడినే' రెండూ ఒకే అర్థాన్నిచ్చే టైటిల్స్‌లా కనిపిస్తున్నప్పటికీ రెండింటి మధ్యా భేదం ఉంది. 'సోలో' అనేది డెఫినిషన్ అయితే, 'ఒక్కడినే' అనేది స్టేట్‌మెంట్. కథ విషయంలో రెండింటికీ ఏమాత్రం సారూప్యత ఉండదు అని చెప్తున్నారు.


చిత్రం లో కథ...సూర్య అనే యువకుడికీ ఓ ప్రవాసాంధ్ర యువతికీ మధ్య సాగే ప్రేమ..వాటి మూలంగా వచ్చే సమస్యలుగా జరుగుతుంది. నారా రోహిత్ మాటల్లోనే... కుటుంబం కోసం 'ఒక్కడినే' ఏం చేశాననేది ఇందులోని ప్రధానాంశం. సహజంగానే కుటుంబపరమైన భావోద్వేగాలు ఉంటాయి. నా పాత్ర పేరు సూర్యచంద్ర. నా క్యారెక్టరైజేషన్ ఏమిటన్నది నా పేరే చెబుతుంది. ఇటు చంద్రునిలోని చల్లదనం, అటు సూర్యునిలోని తీక్షణత్వం.. రెండూ నా పాత్రలో ఉంటాయి . నేడు మన కుటుంబాల్లో జరిగేటువంటి అనుబంధాల్ని టచ్‌ చేస్తూ నిర్మిస్తున్న కుటుంబ కథా చిత్రమిది అన్నారు.

English summary
Nara Rohit, Nitya Menon starrer directed by Srinivas Raga is screened today across Andhra Pradesh. According to sources the youthful entertainer is progressing at slow pace. First half is completed with introduction of all characters. Three songs have been completed and the film till now has no fights and has only very few comedy scenes. Interval twist is good but slow pace of the film tested everyone's patience. Second half is full of flash backs,twists with Brahmanandam offering comic tonic in between.
Please Wait while comments are loading...