Just In
Don't Miss!
- Finance
ఈ ఒక్కరోజులో రూ.2.23 లక్షల కోట్ల సంపద హుష్‌కాకి
- Sports
పతంగి ఎగురవేసిన ఇర్ఫాన్ పఠాన్.. కైట్ కోసం పిల్లల పాట్లు వీడియో
- News
'డ్యాన్స్'పై ఆసక్తి.. ఊహించని మలుపులు తిరిగిన జీవితం.. లింగ మార్పిడి,మూడేళ్లుగా గ్యాంగ్ రేప్...
- Lifestyle
సినిమా థియేటర్ కు వెళ్దామనుకుంటున్నారా? అయితే ఈ విషయాలు మీకోసమే...
- Automobiles
రైలులో హ్యుందాయ్ రయ్.. రయ్.. ఇదే తొలిసారి
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
ఆస్కార్ 2020: విన్నర్స్ లిస్ట్.. సరికొత్త చరిత్ర సృష్టించిన పారసైట్ మూవీ
సినిమారంగంలో అత్యున్నత పురస్కారంగా చెప్పుకునే ఆస్కార్ అవార్డుల పంపణీ కార్యక్రమం అట్టహాసంగా జరుగుతోంది. 92వ అకాడమీ అవార్డల పేరుతో ఈ అవార్డుల కార్యక్రమాన్ని అమెరికా లాస్ ఎంజెలెస్‌లోని డాల్బీ థియేటర్‌లో ఘనంగా నిర్వహిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకాదరణ పొందిన చిత్రాలను, యాక్టర్లను ఎంపిక చేసి ఈ అత్యున్నత పురస్కారం అందజేస్తున్నారు.

అట్టహాసంగా ఆస్కార్ వేడుక.. బెస్ట్ పిక్చర్
ఎంతో అట్టహాసంగా జరుగుతున్న ఈ కార్యక్రమానికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న నటీనటులు, దర్శక నిర్మాతలు, ఇతర సినీ సాంకేతిక నిపుణులు హాజరయ్యారు. అయితే ఈ సారి ఆస్కార్ అవార్డుల్లో బెస్ట్ పిక్చర్‌గా 'పారసైట్' మూవీ ఎంపిక కాబడి సంచలనం సృష్టించింది.

బెస్ట్ పిక్చర్ కేటగిరీలో నామినేషన్స్.. పోటాపోటీ
బెస్ట్ పిక్చర్ కేటగిరీలో.. వన్స్ అపాన్ ఎ టైమ్ ఇన్ హాలీవుడ్, ద ఐరిష్‌మాన్, పారసైట్,1917, మారియేజ్ స్టోరీ, జోజో రాబిట్, జోకర్, లిటిల్ ఉమన్,ఫోర్డ్ వర్సెస్ ఫెరారి చిత్రాలు పోటీపడగా చివరకు పారసైట్ మూవీ ఆస్కార్ అవార్డు వరించింది.

చరిత్రలో మొదటిసారి ఇలా.. ఏకంగా నాలుగు అవార్డులు
దీంతో ఈ ఆస్కార్ ఫంక్షన్‌లో పారసైట్ మూవీ స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది. ఈ సౌత్ కొరియన్ సినిమాకు బెస్ట్ పిక్చర్ సహా మూడు ఆస్కార్ అవార్డులు రావడం విశేషం. అంతేకాదు చరిత్రలో మొదటిసారి మెయిన్ కేటగిరిలో బెస్ట్ మూవీ అవార్డ్ అందుకున్న సినిమాగా పారసైట్ నిలిచింది.

పారసైట్.. సరికొత్త రికార్డు
ఇప్పటివరకు జరిగిన ఆశాఖ వేడుకల్లో కేవలం ఇంగ్లీష్ మూవీస్ మాత్రమే మెయిన్ కేటగిరిలో బెస్ట్ పిక్చర్ అవార్డ్స్ అందుకున్నాయి. కానీ మొదటిసారి ఓ కొరియన్ మూవీ (పారసైట్) ఫారిన్ కేటగిరిలో కాకుండా మెయిన్ కేటగిరిలో అవార్డు గెలుపొంది రికార్డు సృష్టించింది.

ఇక ఆస్కార్ 2020 విన్నర్స్ లిస్ట్ చూస్తే..
ఉత్తమ చిత్రం : పారాసైట్
ఉత్తమ నటుడు : జోక్విన్ ఫీనిక్స్(జోకర్)
ఉత్తమ నటి : రెంజి జెల్వెగర్ (జూడి)
ఉత్తమ సహాయ నటుడు : బ్రాడ్‌పిట్ ( వన్స్ అపాన్ ఏ టైమ్ ఇన్ హాలీవుడ్)
ఉత్తమ సహాయక నటి : లారా డెర్న్ (మ్యారేజ్ స్టోరీ)
ఉత్తమ దర్శకుడు : బాంగ్ జోన్-హో(పారసైట్)
బెస్ట్ సౌండ్ మిక్సింగ్ : 1917
ఉత్తమ సినిమాటోగ్రఫీ : 1917
ఉత్తమ విజువల్ ఎఫెక్ట్ : 1917
బెస్ట్ సౌండ్ ఎడిటింగ్ : ఫోర్డ్ వి ఫెరారీ
ఉత్తమ ప్రొడెక్షన్ డిజైన్ : వన్స్ అపాన్ ఏ టైమ్ ఇన్ హాలీవుడ్
బెస్ట్ లైవ్ యాక్షన్ షార్ట్ ఫిల్మ్ : ది నైబర్స్ విండో
బెస్ట్ యానిమేటేడ్ ఫీచర్: టాయ్ స్టోరీ 4
బెస్ట్ డాక్యుమెంటరీ ఫీచర్ : అమెరికన్ ఫ్యాక్టరీ
బెస్ట్ లైవ్ యాక్షన్ షార్ట్: ది నైబర్స్ విండో
ఉత్తమ ఒరిజినల్ స్క్రీన్‌ప్లే : బాంగ్ జూన్ హో( పారాసైట్)
బెస్ట్ ఫిల్మ్ ఎడిటింగ్ : ఫోర్డ్ వి ఫెరారీ