For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  వివాదాల సుడిగుండంలో పద్మావతి.. హైదరాబాద్‌లో దీపికాకు షాక్ మీద షాక్..

  By Rajababu
  |

  సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వం వహించిన పద్మావతి చిత్రం వివాదాల సుడిగుండంలో విలవిలలాడుతున్నది. ఈ చిత్రం రిలీజ్‌ను పలు రాష్ట్రాలు, పలు సంస్థలు అడ్డుకొంటున్నాయి. ఈ చిత్ర విడుదలపై స్టే విధించాలని సుప్రీంకోర్టులో వ్యాజ్యం దాఖలైంది. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో దేశంలో భావవ్యక్తీకరణ స్వేచ్ఛను ఒక పథకం ప్రకారం అణగదొక్కుతున్నారని సినీ ప్రముఖులు, మేధావులు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నానరు. ఒక రాజకీయపక్షానికి అనుకూలంగానే ఈ తరహా వివాదాలు ప్రారంభమవుతున్నాయని ఆరోపణలు ఊపందుకొంటున్నాయి. దేశంలో ఎమర్జెన్సీ తరహా పరిస్థితులు నెలకొన్నాయని విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లో జరిగే అంతర్జాతీయ సదస్సు నుంచి దీపికాను తొలగించనట్టు తెలుస్తున్నది.

  Ivanka Trump Defends Her Father Always దటీజ్ ఇవాంకా! | Oneindia Telugu
   దీపికా పదుకొనేకు మరో షాక్

  దీపికా పదుకొనేకు మరో షాక్

  పద్మావతి చిత్రం వివాదంలో కూరుకుపోయిన నేపథ్యంలో ఆ చిత్రంలో నటించిన దీపికా పదుకొనేకు మరో షాక్ తగిలింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూతురు ఇవాంకా ట్రంప్, ప్రధాని నరేంద్రమోదీ పాల్గొనే గ్లోబల్ ఎంటర్‌ప్రెన్యూర్ సమ్మిట్ నుంచి దీపికాను తొలగించారు. ఈ సదస్సు హైదరాబాద్‌లో నవంబర్ 28న జరుగనున్నది.

   కఠిన చర్యలు తీసుకొంటాం.. ఆదిత్యనాథ్

  కఠిన చర్యలు తీసుకొంటాం.. ఆదిత్యనాథ్

  సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వం వహించిన వివాదాస్పద చిత్రం పద్మావతిపై ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యానాథ్ స్పందించారు. దీపికా పదుకొని ముక్కు కోయాలని, భన్సాలీ తల నరకాలని పిలుపునిచ్చిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. అలాగే ప్రజల మనోభావాలను కించపరిచే విధంగా భన్సాలీ సినిమాను తెరకెక్కిస్తే ఆయనపై కూడా చర్యలు తీసుకొంటాం అని ఆదిత్యానాథ్ అన్నారు.

   తోసిపుచ్చిన సుప్రీంకోర్టు

  తోసిపుచ్చిన సుప్రీంకోర్టు

  వివాదాల్లో చిక్కుకున్న సంజయ్‌లీలా బన్సాలీ చిత్రం పద్మావతి చిత్రంలోని అభ్యంతరకర సన్నివేశాలను తొలిగించడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. ఈ మేరకు దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని సోమవారం అత్యున్నత న్యాయస్థానం తోసిపుచ్చింది. సినిమాలో అభ్యంతరకరంగా ఉన్న దృశ్యాలను తొలిగించాలన్న పిటిషనర్ అభ్యర్థనను తిరస్కరించిన జస్టిస్ ఏఎం ఖాన్విల్కర్, జస్టిస్ డీవై చంద్రచూడ్‌లతో కూడిన ధర్మాసనం.. అలాంటి చర్యఅపరిపక్వ చర్య అవుతుందని పేర్కొన్నది.

   నిషేధం విధించలేం.. సుప్రీం

  నిషేధం విధించలేం.. సుప్రీం

  సెంట్రల్‌బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (సీబీఎఫ్‌సీ) ఇంకా సర్టిఫికెట్ ఇవ్వనేలేదని, అలాంటప్పుడు నిషేధం గురించికానీ, సన్నివేశాల తొలిగింపునకు ఆదేశాలు ఎలా ఇవ్వగలమని ప్రశ్నించింది. పిటిషనర్ తరఫున న్యాయవాది ఎంఎల్ శర్మ వాదనలు వినిపిస్తూ.. రాణి పద్మావతిని కించపరిచేలా సినిమాలో చిత్రీకరించారని ఆరోపించారు.

   షాహీద్ కపూర్ ఆగ్రహం

  షాహీద్ కపూర్ ఆగ్రహం

  పద్మావతి చిత్రంలో ఎలాంటి అభ్యంతకర దృశ్యాలు లేవు, దానిపై అగ్రహించడంలో అర్థమే లేదు అని బాలీవుడు నటుడు షాహిద్ కపూర్ అన్నారు. ఆ చిత్రంలో చిత్తోడ్‌రాజు రతన్‌సింగ్‌గా షాహిద్ నటించిన విషయం తెలిసిందే. మరోవైపు దీపిక, బన్సాలీ తలనరికినవారికి రూ.10కోట్లు నజరానాగా ఇస్తామని హర్యానా బీజేపీ నేత చేసిన ప్రకటనపై నివేదిక సమర్పించాల్సిందిగా రాష్ట్ర డీజీపీని జాతీయ మహిళా కమిషన్ ఆదేశించింది.

   పద్మావతిని విడుదల కానివ్వం

  పద్మావతిని విడుదల కానివ్వం

  చారిత్రక అంశాలను వక్రీకరిస్తే పద్మావతి చిత్రాన్ని రాష్ట్రంలో విడుదల కానివ్వం. రాణి పద్మావతిని భారతీయ మహిళలు శతాబ్దాలుగా తమ ప్రతీకగా భావిస్తున్నారు. అందుకే ప్రతీ ఏడాది రాష్ట్రమాత పద్మావతి పేరిట అవార్డును ఇవ్వాలని మా ప్రభుత్వం నిర్ణయించింది అని మధ్యప్రదేశ్ సీఎం చౌహాన్ అన్నారు.

   దీపిక కుటుంబానికి రకణ.. సిద్ధరామయ్య

  దీపిక కుటుంబానికి రకణ.. సిద్ధరామయ్య

  దీపిక పదుకొనేను బెదిరిస్తున్న సంస్థలు, వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలి. ఇటీవల ఓ గ్రూపు ముక్కుకోస్తామని కూడా బెదిరించింది. ప్రజాస్వామ్యంలో ఇది అనాగరికం. వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని హర్యానా సీఎంను కోరుతున్నాను. బెంగళూరులోని దీపిక కుటుంబానికి ప్రభుత్వం రక్షణ కల్పిస్తుంది అని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అన్నారు.

   వక్రీకరిస్తే సహించం.. అమరిందర్ సింగ్

  వక్రీకరిస్తే సహించం.. అమరిందర్ సింగ్

  భావ స్వేచ్చ పేరుతో చరిత్రను వక్రీకరిస్తే ఎవరూ హర్షించరు. నిరసనకారుల ఆవేదనలో అర్థం ఉంది. పద్మావతి త్యాగాన్ని ఎన్నో ఏండ్ల నుంచి చదువుకుంటూ వచ్చాం. ఆ చరిత్రను వక్రీకరిస్తే మాత్రం ఎట్టిపరిస్థితుల్లోనూ ఎవరూ సహించరు అని పంజాబ్ సీఎం కెప్టెన్ అమరిందర్ సింగ్ అన్నారు.

  నిషేధంపై సలహాలు తీసుకొంటున్నాం..

  నిషేధంపై సలహాలు తీసుకొంటున్నాం..

  అభ్యంతరకరమైన సన్నివేశాలను తొలగించనంత వరకు పద్మావతి చిత్రాన్ని రిలీజ్‌కు అనుమతించేది లేదు అని రాజస్థాన్ సీఎం వసుంధర స్పష్టం చేశారు. సినిమాపై నిషేధం విధించేందుకు తగిన న్యాయనిపుణుల సలహాలను తీసుకొంటున్నామని ఆమె అన్నారు.

  English summary
  Actress Deepika Padukone, who is at the centre of a row over Padmavati , has pulled out of the Global Entrepreneurship Summit (GES), that will have US President Donald Trump's daughter Ivanka and Prime Minister Narendra Modi attend the inauguration on November 28. Deepika plays the role of a Rajput queen in the movie. Some Rajput groups allege that Bhansali has distorted history and portrayed the queen in poor light.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X