»   » షారూఖ్ ని ఇంప్రెస్ చేయటానికి పార్వతి మిల్టన్ పాట్లు

షారూఖ్ ని ఇంప్రెస్ చేయటానికి పార్వతి మిల్టన్ పాట్లు

Posted By:
Subscribe to Filmibeat Telugu

పవన్ కళ్యాణ్ తో చేసిన 'జల్సా' చిత్రం తర్వాత తెలుగులో మరేసినిమా సైన్‌ చేయని పార్వతి మిల్టన్ లేటెస్ట్ గా బాలీవుడ్ వైపు తన దృష్టి పెట్టింది. అందునిమిత్తం ఆమె గత ఆరు నెలల నుంచి ముంబయ్‌లో ఉంటున్నారు. అందుకోసం అక్కడ ఆమె పెద్ద హీరోల పార్టీలకు అటెండవుతోంది. తాజాగా ఆమె సోమవారం రాత్రి షారూఖ్ ఇచ్చిన పార్టీలో సెంటరాఫ్ ది ఎట్రాక్షన్ గా మారటానికి ప్రయత్నించింది. ఆ పార్టీకి వచ్చిన పలువురు బాలీవుడ్ దర్శక, నిర్మాతలకు ఆమె తనను తాను పరిచయం చేసుకుంది. నిజానికి షారూఖ్ ఆ పార్టీని ప్రముఖ పాప్ సింగర్ అకన్ కోసం ఏర్పాటు చేసారు. పార్వతి దానిని తనకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేసింది. అలాగే ఆమె ఓ పాపులర్ బాలీవుడ్ డైరక్టర్ చిత్రంలో కూడా చేసే అవకాసాలు ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే ఆమె హిందీ సినిమాల్లో ప్రయత్నిస్తూనే మరోవైపున కొన్ని వ్యాపార ప్రకటనల్లో కూడా ఆమె పాల్గొంటున్నారు. తాజాగా లాక్మే ఫ్యాషన్‌ వీక్‌లో 'థర్డ్‌ ఫేస్‌ ఆఫ్‌ ద డే'గా ఆమె అవకాశాన్ని పొందారు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X