Just In
- 5 min ago
మరో సర్ప్రైజ్ ప్లాన్ చేసిన రవితేజ: ఆరోజే అలరించబోతున్న మాస్ మహారాజా
- 18 min ago
స్టార్ డైరెక్టర్ శిష్యుడితో నాగశౌర్య మరో డిఫరెంట్ మూవీ.. టైటిల్ కొత్తగా ఉందే!
- 24 min ago
చిరంజీవి కోసం బాలీవుడ్ ప్రముఖుడు: తెలుగులో ఇది మూడో సినిమా మాత్రమే!
- 40 min ago
‘క్రాక్’ తర్వాత నందమూరి బాలకృష్ణతో సినిమా: క్లారిటీ ఇచ్చిన గోపీచంద్ మలినేని
Don't Miss!
- News
కాబోయే సీఎం కేటీఆర్‌కు శుభాకాంక్షలు... తేల్చేసిన డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్...
- Sports
ఇంటికి రాగానే దెబ్బ తగిలిన ప్రతి చోట ముద్దులు పెట్టింది: పుజారా
- Lifestyle
డయాబెటిస్ ఉన్నప్పటికీ సుదీర్ఘకాలం మరియు ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపడానికి ఇక్కడ కొన్ని ముఖ్యమైన చిట్కాలు ఉన్నాయ
- Finance
ఫ్యూచర్ గ్రూప్ డీల్, అమెజాన్‌కు షాక్: రిలయన్స్‌కు గుడ్‌న్యూస్, షేర్ జంప్
- Automobiles
భారత్‌లో అడుగుపెట్టిన కొత్త బిఎమ్‌డబ్ల్యూ 3 సిరీస్ గ్రాన్ లిమోసిన్; ధర & వివరాలు
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
పసుపులేటి రామారావు కుటుంబానికి అన్నిరకాలుగా అండగా ఉంటా.. చిరంజీవి హామీ
తెలుగు సినీ పరిశ్రమకు సీనియర్ జర్నలిస్టుగా, పీఆర్ఓగా ఎన్నో సేవలందించిన పసుపులేటి రామారావు (70) మృతి చిత్రసీమలో విషాద ఛాయలు నింపింది. యూరిన్ ఇన్ఫెక్షన్‌కి గురైన ఆయన ఈ రోజు (మంగళవారం) ఉదయం వనస్థలిపురంలోని ప్రైవేట్ హాస్పిటల్‌లో మరణించారు. సన్నిహితులు, అభిమానుల సందర్శనార్థం ఆయన మృతదేహాన్ని కృష్ణానగర్‌లో ఉన్న ఆయన సొంతింటికి తరలించారు.

చిరంజీవి ఆప్తుడు.. కళామతల్లి సేవకుడు
సినీ పరిశ్రమలో మెగాస్టార్ చిరంజీవికి ఎంతో ఆప్తుడు పసుపులేటి రామారావు. దాదాపు 5 దశాబ్దాల పాటు సినీ జర్నలిస్టుగా పనిచేసిన ఆయన టాలీవుడ్ ఇండస్ట్రీ లోని పెద్దల తలలో నాలుకగా ఉన్నారు. ఎన్నో పుస్తకాలు రచించిన ఓ మహా నిఘంటువు పసుపులేటి రామారావు గారు. సీనియర్ ఎన్టీఆర్ మొదలుకొని నేటి యంగ్ హీరోల వరుకు అందరినీ ఇంటర్వ్యూలు చేసిన అనుభవం ఆయనకుంది.

చిరంజీవి సంతాపం.. మెగాస్టార్ ఆవేదన
పసుపులేటి రామారావు మరణవార్త తెలిసి పలువురు సినీ ప్రముఖులు తమ తమ సంతాపం తెలుపుతున్నారు. తాజాగా మెగాస్టార్ చిరంజీవి తన సంతాపం తెలిపారు. ఈ మేరకు పసుపులేటి రామారావుతో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ ఆవేదన చెందారు చిరంజీవి.

నా ఆత్మ బంధువు రామారావు
రామారావు తనకు ఆత్మ బంధువని, సినియర్ జర్నలిస్టు అనే కాకుండా ఆయన వ్యక్తిత్వం తనకెంతో ఇష్టమని చిరంజీవి అన్నారు. నేనంటే అతనికి ఎంతో అభిమానం, అతనన్నా నాకంతే అభిమానం అని చిరంజీవి చెప్పారు. లేకలేక పుట్టిన అతని కుమారుడికి మా ముగ్గురు అన్నదమ్ముల పేర్లు కలిసి వచ్చేలా 'కళ్యాణ్ నాగ చిరంజీవి' అనే పేరు పెట్టుకున్నారని ఆయన చెప్పారు.

ఆయన్ను ఓ జర్నలిస్టుగానే కాకుండా.. ఇలా చూస్తా
''రామారావు అనారోగ్యంతో బాధపడుతున్నారని, నడవలేకపోతున్నారని తెలిసి సన్ షైన్ ఆస్పత్రి వైద్యులు డాక్టర్ గురవారెడ్డి దగ్గరికి పంపించాను. మోకాళ్ల ఆపరేషన్ చేయించుకోవాలన్నారు. అయితే తన అక్కయ్య గారికి బాగోలేదని, ఆమె కోలుకున్నాక ఆపరేషన్ చేయించుకుంటానని రామారావు అన్నారు. నేనతన్ని కేవలం ఒక జర్నలిస్టుగానే చూడను. నీతికీ నిజాయితీకీ నిబద్దతకూ మరోరూపంలా చూస్తుంటాను'' అని చెప్పారు చిరంజీవి.

అన్నిరకాలుగా అండగా ఉంటా.. చిరు హామీ
'రామారావు కుటుంబానికి నేను అన్నిరకాలుగా అండగా ఉంటాను. వాళ్ల కుటుంబం బాగోగులను చూసుకుంటాను. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నాను. ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి'' అంటూ చిరంజీవి తన సంతాపం వ్యక్తం చేశారు.

రేపు అంత్యక్రియలు
ఈ రోజు రామారావు స్వగృహంలో ఆయన మృతదేహాన్ని ఉంచి.. రేపు అంత్యక్రియలు జరపాలనుకుంటున్నామని ఆయన తోడల్లుడు చెప్పాడు.