»   » మరి అలా చూస్తే...షారుక్ ఖాన్ కంటే పవన్ కళ్యాణ్ పెద్ద స్టార్!

మరి అలా చూస్తే...షారుక్ ఖాన్ కంటే పవన్ కళ్యాణ్ పెద్ద స్టార్!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: కలెక్షన్ల పరంగానే ఒక హీరో స్టార్ డమ్ నిర్ణయించబడుతుందా?....ఈ మధ్య కాలంలో కొందరి వాదనలు, మరికొన్ని పరిణామాలు చూసిన వారికి ముందుగా వచ్చే డౌట్. సర్దార్ గబ్బర్ సినిమా విడుదల సందర్భంగా ట్విట్టర్లో దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఈ విషయమై పెద్ద చర్చకు తెరతీసిన సంగతి తెలిసిందే. సర్దార్ గబ్బర్ సింగ్ చిత్రాన్ని హిందీలో రిలీజ్ చేయవద్దు...అక్కడ ఈ సినిమాకు బాహుబలి కంటే తక్కువ కలెక్షన్స్ వస్తాయి, అపుడు ప్రభాస్ కంటే పవన్ కళ్యాణ్ చిన్న హీరో అయిపోతాడు అంటూ వర్మ గోల చేసాడు.

 Pawan A Bigger Star Than SRK?

కలెక్షన్లు, ఓపెనింగ్స్ పరంగా చూస్తే...... ఇపుడు బాలీవుడ్ స్టార్ షారుక్ కంటే పవన్ కళ్యాణే పెద్ద స్టార్ అంటున్నారు ఫ్యాన్స్. పవన్ కళ్యాణ్ నటించిన సర్దార్ గబ్బర్ సింగ్ ఇటీవల ఉగాది సందర్భంగా రిలీజై తొలి రోజు వరల్డ్ వైడ్ దాదాపు రూ. 31 కోట్ల గ్రాస్ కలెక్షన్ సాధించింది. మొన్న రిలీజైన షారుఖ్ ఖాన్ 'ఫ్యాన్' మూవీ తొలి రోజు రూ. 19.20 కోట్లు మాత్రమే వసూలు చేసింది.

వాస్తవానికి పవన్ కళ్యాణ్ కు, షారుక్ ఖాన్ కు పోలిక ఉండదు. ఆయన సినిమాల పరిధి వేరు, ఈయన సినిమాల స్టామినా వేరు. కేవలం వసూళ్ల పరంగా ఒక హీరో స్టార్ డమ్ నిర్ణయించడం బుద్ది తక్కువ చర్యే అవుతుంది. ఎవరిస్థాయి వారికి ఉంటుంది....ఈ విషయాన్ని ఇప్పటికైనా వర్మ లాంటి దర్శకులు గ్రహించాలి అంటున్నారు అభిమానులు.

English summary
Pawan's Ugadi release Sardaar Gabbar Singh and SRK's yesterday's Fan tell a different picture. While Sardaar's opening day numbers were around 31 crores share, Fan has raked in a paltry net amount of 19.20 crores, which means that the shares would be even lesser.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X