»   » 'చూసుకుంటాం బ్రదర్': అల్లు అర్జున్ కు పవన్ ఫ్యాన్స్ కౌంటర్

'చూసుకుంటాం బ్రదర్': అల్లు అర్జున్ కు పవన్ ఫ్యాన్స్ కౌంటర్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: పవన్ ప్యాన్స్ కు, అల్లు అర్జున్ కు మధ్య రగులుకున్న వివాదం ఇప్పుడిప్పుడే చల్లారేటట్లు కనపడటం లేదు. చెప్పను బ్రదర్..ఏ ముహూర్తంలో అల్లు అర్జున్ ఈ మాట అన్నాడో గానీ, పవన్ ఫ్యాన్స్ ఇప్పుడీ డైలాగ్ ను ట్రెండింగ్ గా మార్చేశారు. అంతటితో ఊరుకున్నారా ఇప్పుడు చెప్పను బ్రదర్ కు కౌంటర్ ..'చూసుకుంటూం బ్రదర్' అని అంటున్నారు.

పూర్తి వివరాల్లోకి వెళితే...రీసెంట్ గా విజయవాడలో జరిగిన సరైనోడు బ్లాక్ బస్టర్ ఫంక్షన్ లో.. ఈ వ్యాఖ్యల దుమారం మొదలై ఇంకా కొనసాగుతోంది. పవన్ ని ప్రత్యేకంగా ...అల్లు అర్జున్ ఏమీ అనకపోయినా...ఫ్యాన్స్ పవన్ గురించి చెప్పమని అంటే.. 'చెప్పను బ్రదర్' అన్నాడు. ఇదే పవన్ ఫ్యాన్స్ కి కోపం తెప్పించడానికి కారణమైంది. రీసెంట్ గా ఓ పబ్లిక్ పోస్టర్ లాంటిది డిజైన్ చేసి.. ఇన్ డైరెక్టుగా వార్నింగ్ కూడా ఇచ్చేసి రచ్చ చేసారు.

అసలేం జరిగింది?

దాన్ని కంటిన్యూ చేస్తూ మళ్లీ హైదరాబాద్ లో మీడియాకు ఇచ్చిన ఇంటర్వూలలో ...బన్ని ని అదే ప్రశ్న మీడియావారు అడగటం జరిగింది. బన్ని అదే మాట మీద ఉన్నారు. మళ్లీ అదే సమాధానం చెప్పారు.

 Pawan fan's 'Chusukuntambrother' trends on twitter

ఆ విషయమై ఓ ప్రక్క రాజీ ప్రయత్నాలు అంటూ మీడియాలో వినిపిస్తూంటే, అల్లు అర్జున్ మాత్రం తాజాగా ఇచ్చిన ఇంటర్వూలో సైతం అవే పదాలని బన్ని రిపీట్ చేసారు. మీడియావారు బన్నిని ...చెప్పను బ్రదర్ వివాదంపై స్పందించమంటే ఇప్పుడు కూడా తాను చెప్పను బ్రదర్ అన్నారు.

Also See: 'చెప్పను బ్రదర్'...పవన్ మీద బన్నీ కామెంట్స్ దుమారం!

అదేమిటంటే... 'సరైనోడు' వేడుకలో 'పవన్‌ గురించి మాట్లాడను బ్రదర్‌...' అన్నారు. దాని గురించి సోషల్‌ మీడియాలో బాగా చర్చ జరిగింది? ఇప్పుడూ అదే మాట... 'పవన్‌ గురించి మాట్లాడను బ్రదర్‌'. ఈ ప్రశ్న తప్ప ఇంకేదైనా అడగండి అని అల్లు అర్జున్ స్పష్టంగా చెప్పారు. మరి ఈ వివాదం ఎక్కడిదాకా వెళ్లి ఆగుతుందో చూడాలి.

English summary
Some Pawan fans are even saying that whenever Allu Arjun comes out in public function, we will shout 'Chusukuntambrother'. Chusukuntambrother is still trending on twitter for the last 24 hours.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu