పాస్ ల కోసం: పవన్ ఫ్యాన్స్ ఆందోళన, మేం లేకుండా చేస్తారా?
హైదరాబాద్: పవన్‌కల్యాణ్ అభిమానులు హైదరాబాద్‌లోని చిరంజీవి బ్లడ్‌బ్యాంక్ వద్ద ఆందోళనకు దిగారు. పవన్ నటించిన 'సర్దార్ గబ్బర్‌సింగ్' సినిమా ఆడియో రిలీజ్ ఫంక్షన్‌కు తమకు పాస్‌లు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
రాజమండ్రి, విజయవాడ, గుంటూరు, కర్ణాటకతో పాటు ఇతర ప్రాంతాల నుంచి తరలివచ్చిన అభిమానులు... తాము లేకుండా ఆడియో ఫంక్షన్ ఎలా నిర్వహిస్తారని ప్రశ్నించారు.

గతంలోనూ ...ఇదే విధంగా అత్తారింటికి దారేది చిత్రం ఆడియోపంక్షన్ సమయంలోనూ బ్లడ్ బ్యాంక్ వద్ద కొందరు పవన్ ఫ్యాన్స్ ఆందోళన చేసారు. ఇప్పుడు మళ్లీ అలాంటి సీనే రిపీట్ అయ్యింది.


Click it and Unblock the Notifications











